శతాధిక కథాచిత్రాలకు దర్శకత్వం వహించిన ఘనులు తెలుగునాటనే అధికంగా ఉండడం విశేషం. వారిలో యాక్షన్ మూవీస్ తో అధికంగా మురిపించిన కె.ఎస్.ఆర్.దాస్ స్థానం ప్రత్యేకమైనది. చిత్రసీమలోని 24 శాఖలలో పట్టున్న దర్శకులు అరుదుగా కనిపిస్తారు. కె.ఎస్.ఆర్. దాస్ అన్ని శాఖల్లోనూ పట్టు సాధించాకే ‘లోగుట్టు పెరుమాళ్ళ కెరుక’తో దర్శకుడయ్యారు. ఆపై ‘రాజయోగం’ చూడాలనుకున్నాడు ‘రాజసింహ’ తీశాడు. ‘గండరగండడు’ కాసింత కరుణించాడు. తరువాత ‘గందరగోళం’లో పడ్డాడు దాసు. ఆ సమయంలో కృష్ణ ద్విపాత్రాభినయంతో తెరకెక్కించిన ‘టక్కరి దొంగ – […]
ఆ రోజుల్లో డాన్స్ మాస్టర్ సలీమ్ పేరు తెరపై కనిపించగానే థియేటర్లలో ఈలలు మారుమోగి పోయేవి. తెలుగువాడు కాకపోయినా సలీమ్ తెలుగు చిత్రసీమలోని అగ్రశ్రేణి కథానాయకులందరికీ నృత్యరీతులు సమకూర్చి అలరించారు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 300 పైచిలుకు చిత్రాలకు సలీమ్ డాన్స్ కంపోజ్ చేశారు. మళయాళ సీమలో కన్ను తెరచిన సలీమ్ బాల్యం నుంచీ పచ్చని పొలాల మధ్య చిందులు వేస్తూ గడిపాడు. అతని డాన్సుల్లో ఈజ్ ను గమనించిన […]
(జనవరి 4న హిట్లర్కు పాతికేళ్ళు)విజయాల చుట్టూ జనం పరిభ్రమిస్తూ ఉంటారు. ఒకానొక దశలో మెగాస్టార్ చిరంజీవిని వరుస పరాజయాలు పలకరించాయి. ఆ సమయంలో ఆయన కథలపై దృష్టిని సారించారు. ఓ మంచి కథతో మళ్ళీ జనాన్ని పలకరించాలని ఆశించారు. ఆ నేపథ్యంలో మమ్ముట్టి హీరోగా మళయాళంలో రూపొంది విజయం సాధించిన హిట్లర్ ఆయన దృష్టిని ఆకర్షించింది. దానిని రీమేక్ చేస్తూ మళ్ళీ జనాన్ని ఆకట్టుకోవాలని ఆశించారు. ఆ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ఎడిటర్ మోహన్ తీసుకున్నారు. […]
టాలీవుడ్ టాప్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున సరసన నటించి, తెలుగువారికి చేరువైన ఉత్తరాది భామ సోనాలీ బింద్రే. స్టైల్ ఐకాన్ గా పేరొందిన సోనాలీ బింద్రే పలు యాడ్స్ లో నాజూకు షోకులతో కుర్రకారును కిర్రెక్కించింది. వెండితెరపై సోనాలీ నాజూకు సోకులు చూసి ఫిదా అయిన జనాన్ని బుల్లితెరపైనా మురిపించింది. పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా, న్యాయనిర్ణేతగా వ్యవహరించి అలరించారు. క్యాన్సర్ ను ధైర్యంగా జయించి పలువురికి స్ఫూర్తి కలిగించారు సోనాలీ బింద్రే! సోనాలీ బింద్రే మహారాష్ట్ర […]
తెలుగు చిత్రాలు -యన్టీఆర్ ‘జయసింహ’, ఏయన్నార్ ‘రోజులు మారాయి’తోనే వెలుగు చూసిన వహిదా రెహమాన్, హిందీ చిత్రసీమలో అందాలతారగా రాజ్యమేలారు. 1956లో గురుదత్ తన ‘సి.ఐ.డి.’ సినిమాతో వహిదాను హిందీ సినిమా రంగానికి పరిచయం చేశారు. ఆ సినిమా ఘనవిజయంతో బొంబాయితారగానే మిగిలిపోయారు వహిదా రెహమాన్. మొదట్లో గురుదత్, దేవానంద్ చిత్రాలలోనే మురిపించిన వహిదా రెహమాన్ తరువాత తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. అలా ఆమెకు తొలి విజయాన్ని అందించిన చిత్రం ‘బీస్ సాల్ బాద్’. బిశ్వజిత్ […]
నాటి మేటి నటులలో తన బహుముఖ ప్రజ్ఞతోనూ, బహు భాషాపాండిత్యంతోనూ ఆకట్టుకున్న అరుదైన నటులు కొంగర జగ్గయ్య. ఆయన పేరు వినగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఆయన కంచుకంఠం. ఎంతటి సుదీర్ఘ సమాసాలనైనా అలవోకగా చెప్పగల నేర్పు, ఓర్పు జగ్గయ్య గళం సొంతం. చిత్రసీమలో అడుగు పెట్టకముందు తన విద్యను ప్రదర్శించుకోవడానికి అన్నట్టు జగ్గయ్య బహుకృత వేషం కట్టారు. అందులో పాత్రికేయ వృత్తిలోనూ రాణించారు. రేడియోలో వార్తలూ చదివారు. ఆ రోజుల్లో జగ్గయ్య వార్తలు చదువుతున్నారంటే […]
తెలుగు చిత్రసీమలో అసలు సిసలు మాటల మాంత్రికుడు అంటే పింగళి నాగేంద్రరావు అనే చెప్పాలి. తెలుగు సినిమా పలుకుకు ఓ జిలుగునద్దిన ఘనత నిస్సందేహంగా పింగళివారిదే అనడం అనతిశయోక్తి! పింగళి వారి రచనలో జాలువారిన పదాలను పరిశీలించి చూస్తే, వాటిలో గమ్మత్తు ఉంటుంది, మత్తూ ఉంటుంది. ఆపైన మనల్ని చిత్తు చేసే గుణమూ కనిపిస్తుంది. చూడటానికి మనకు బాగా తెలిసిన పదాలనే ఆయన ఉపయోగించిన తీరు గమ్మత్తు చేసి చిత్తు చేస్తుంది పింగళి నాగేంద్రరావు 1901 డిసెంబర్ […]
2021లో దాదాపు 270 తెలుగు సినిమాలు విడుదలైతే అందులో స్ట్రయిట్ మూవీస్ సుమారు 200. థియేటర్లలో కాకుండా ఇందులో ఇరవైకు పైగా సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యాయి. విశేషం ఏమంటే యంగ్ హీరోస్ తో పాటు స్టార్ హీరోలనూ డైరెక్ట్ చేసే ఛాన్స్ కొత్త దర్శకులకు ఈ యేడాది లభించింది. మరి ఈ నయా దర్శకులలో ఎవరెవరు తమ సత్తా చాటారో తెలుసుకుందాం. అక్కినేని నాగార్జున నటించిన ఒకే ఒక్క చిత్రం ‘వైల్డ్ డాగ్’ […]