మాస్ మహరాజా రవితేజ, దివ్యాంశ కౌశిక్, రజీషా విజయన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’. శరత్ మండవను దర్శకుడిగా పరిచయం చేస్తూ చెరుకూరి సుధాకర్ ఈ సినిమాను నిర్మించారు. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఈ పాటికే ఈ సినిమా విడుదలై ఉండేది. అయితే మూవీని మరింత చక్కగా జనం ముందుకు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో జూన్ 17న విడుదల కావాల్సిన దీనిని వాయిదా వేశారు.
ఇప్పుడు లేటెస్ట్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. అన్ని హంగులు పూర్తి చేసుకుని రామారావు జూలై 29న డ్యూటీ ఎక్కుతాడని తెలిపారు. సామ్ సి.ఎస్. సంగీతం అందిస్తున్న ఈ సినిమా ప్రచార చిత్రం, లిరికల్ వీడియోస్ చక్కని ఆదరణ పొందాయి. రవితేజ ఈ సినిమాలో డిప్యూటీ కలెక్టర్ పాత్రను పోషిస్తున్నాడు. యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’లో వేణు తొట్టెంపూడి కీలక పాత్ర పోషించడం విశేషం. ఇతర ముఖ్య పాత్రల్లో నాజర్, నరేష్, పవిత్ర లోకేష్, ‘సర్పట్ట’ జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ కనిపించనున్నారు.