శాంసంగ్ సంస్థ తన భవిష్యత్తు ప్రణాళికల్లో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను తన ప్రతి ఉత్పత్తిలోనూ అంతర్భాగం చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు శాంసంగ్ మొబైల్ విభాగం అధిపతి TM Roh సంస్థ నూతన వ్యూహాన్ని వెల్లడిస్తూ, కేవలం స్మార్ట్ఫోన్లకే పరిమితం కాకుండా గృహోపకరణాలు , ఇతర డిజిటల్ సేవలన్నింటిలో AIని అనుసంధానించనున్నట్లు ప్రకటించారు. దీనిని వారు “AI Experience” (AX) గా అభివర్ణిస్తున్నారు. వినియోగదారుల రోజువారీ అవసరాలను గుర్తించి, వాటికి అనుగుణంగా స్పందించేలా తమ […]
చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న శ్రీశైలం ఎడమగట్టు కాలువ (SLBC) టన్నెల్ నిర్మాణ పనులలో కీలక అడుగు పడింది. ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఎదురవుతున్న భూగర్భ అడ్డంకులను గుర్తించేందుకు ఎన్జీఆర్ఐ (NGRI) శాస్త్రవేత్తలు నిర్వహించిన హెలి మాగ్నెట్ సర్వే నివేదిక తాజాగా నిపుణుల కమిటీకి చేరింది. ప్రత్యేక హెలికాప్టర్ సహాయంతో సుమారు 13 లైన్లలో సర్వే చేపట్టిన శాస్త్రవేత్తలు, భూమి లోపల దాదాపు 800 మీటర్ల లోతు వరకు ఉన్న భూ స్వరూపంపై సమగ్ర సమాచారాన్ని […]
ఇద్దరూ పొలిటికల్ దాయాదులే. ఒకరు మంత్రి అయితే….మరొకరు ఎమ్మెల్యే. కానీ… ఇప్పుడు ఇద్దరి మధ్య మాట పట్టింపులు, పైచేయి పాలిటిక్స్ మొదలయ్యాయి. లాబీయింగ్‌తో మంత్రి పంతం నెగ్గించుకుంటే…. మాటచెల్లని ఈ అడ్డరోడ్డు రాజకీయం మనకెందుకంటూ ఎమ్మెల్యే ఫైర్ అవుతున్నారు. ఏ విషయమై కూటమిలో కుంపట్లు రాజుకుంటున్నాయి? ఎవరా మినిస్టర్ అండ్ ఎమ్మెల్యే? వంగలపూడి అనిత…..ఏపీ హోం మంత్రి….కేరాఫ్ పాయకరావుపేట. సుందరపు విజయ్ కుమార్…. జనసేన ఎమ్మెల్యే……కేరాఫ్ యలమంచిలి. ఇద్దరూ కూటమి గూటి పక్షులే. పైగా ఇరుగు పొరుగు […]
తెలంగాణ కమలం పార్టీకి అగ్ని పరీక్ష ఎదురు కాబోతోందా? ఇన్నాళ్లు ఒక ఎత్తు, ఇక నుంచి మరో ఎత్తు అని డైలాగ్స్ చెప్పడం కాదు, చేసి చూపించండని పార్టీ పెద్దలు రాష్ట్ర నాయకులకు సీరియస్‌గా చెప్పారా? ప్రత్యేకించి బీజేపీ ప్రజా ప్రతినిధులకు రాబోయే రోజులు సవాల్‌గా మారబోతున్నాయా? ఏ విషయంలో అంత సీరియస్‌గా ఉన్నారు పార్టీ పెద్దలు? ఎందుకలా? తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ ఘోరమైన ఫలితాలు వచ్చాయి. కనీసం ఆరు శాతం గ్రామాల్ని కూడా గెల్చుకోలేక, […]
ఎమ్మెల్యే మూడంకేయడం, అధికారులతో ఎడ్డెమంటే తెడ్డెమంటూ ప్రతిపక్ష పాత్ర పోషించడం ఆ నియోజకవర్గానికి కలిసొస్తోందా? మంత్రితో ఢీ అంటే ఢీ అన్నట్టుగా ఉండటం ప్లస్ అవుతోందా? కుల బలం చూపించి మరీ… తనకు కావాల్సిన పనులు చేయించుకుంటున్న ఆ శాసనసభ్యుడు ఎవరు? ఆయన విషయంలో టీడీపీ అధిష్టానం వైఖరి ఏంటి? రాజకీయ ఉద్దండులు ప్రాతినిధ్యం వహించిన అసెంబ్లీ నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస. ఇక టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా వున్న కూన రవికుమార్ కూడా ఈసారి కేబినెట్లో […]
కుక్క తోకను ఆడించాలిగానీ… తోక కుక్కని ఆడించకూడదన్న సామెతను అక్కడ పదే పదే గుర్తు చేసుకుంటున్నారా? నలుగురు షాడో ఎమ్మెల్యేలు తయారై నియోజకవర్గాన్ని నలిపేస్తున్నారా? ఎమ్మెల్యే పేరు చెప్పి పీఏలు పనులు చేసుకుంటూ నాలుగు రాళ్ళు వెనకేసుకుంటున్నారా? ఆ కాంగ్రెస్ శాసనసభ్యుడు వాళ్ళని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఎక్కడ జరుగుతోందా తంతు? 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ తరపున గెలిచారు యెన్నం శ్రీనివాస్ రెడ్డి. ఎన్నికలకు ముందు అనూహ్యంగా టికెట్ […]
ఆ పోలీస్ టర్న్డ్ పొలిటీషియన్‌కు ఇప్పటికీ పాత వాసనలు పోలేదా? నేను ఎంపీని, మీరంతా నా పరిధిలోనే ఉంటారంటూ ఎమ్మెల్యేల మీద కర్ర పెత్తనాలు చేయాలనుకుంటున్నారా? అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంపీ అనుచరగణం బాగా అతి చేస్తోందన్న విమర్శలు ఎందుకు పెరుగుతున్నాయి? ఆ ఎంపీ మీద సొంత టీడీపీ ఎమ్మెల్యేలే కోపంగా ఉండటానికి కారణం ఏంటి? ఎవరాయన? ఏంటా కెలుకుడు కహానీ? అంతకు ముందు సంగతి ఎలా ఉన్నా…. ఈ మధ్య కాలంలో మాత్రం బాపట్ల ఎంపీలకు బంపరాఫర్స్ […]
Jangaon : జనగామ జిల్లాలో ఒక సామాన్య రైతు పడుతున్న కష్టాలు, అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉన్నాయో కళ్లకు కట్టే ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. తన పొలం ఎండిపోతుంటే తట్టుకోలేక, ఒక రైతు ఏకంగా జిల్లా కలెక్టర్ కాళ్లు మొక్కి తన సమస్యను పరిష్కరించాలని వేడుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జిల్లాలోని ఒక గ్రోమోర్ కేంద్రాన్ని సందర్శించి, అక్కడ ఉన్న యూరియా రికార్డులను , నిల్వలను తనిఖీ […]
ఫరీదాబాద్‌లో దారుణం.. కదులుతున్న వ్యాన్‌లో మహిళపై గ్యాంగ్‌రేప్ ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులు అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. తాజాగా హర్యానాలోని ఫరీదాబాద్‌లో దారుణం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున 28 ఏళ్ల మహిళపై కదులుతున్న వ్యాన్‌లో రెండున్నర గంటల పాటు ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం రోడ్డుపై విసిరేసి పరారయ్యారు. ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది. సోమవారం-మంగళవారం మధ్య రాత్రిలో వివాహిత ఇంటికి వెళ్లేందుకు వాహనం కోసం […]
Moon events 2026 : రాబోయే 2026 సంవత్సరం అంతరిక్ష పరిశీలకులకు ఒక మరపురాని జ్ఞాపకంగా మిగిలిపోనుంది. సాధారణంగా ఏడాదికి 12 పౌర్ణమిలు వస్తుంటాయి, కానీ 2026లో ఏకంగా 13 పౌర్ణమిలు (Full Moons) సంభవించబోతున్నాయి. ఇందులో ఒకే నెలలో రెండు పౌర్ణమిలు రావడం వల్ల ఏర్పడే ‘బ్లూ మూన్’ (Blue Moon) ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మే నెలలో రెండు పౌర్ణమిలు రానుండటంతో, రెండో దానిని బ్లూ మూన్‌గా పరిగణిస్తారు. కేవలం పౌర్ణమిలే కాకుండా, చంద్రుడు […]