Israel-Iran War: ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం.. ఏ దేశం ఏ వైపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Iran War: మిడిల్ ఈస్ట్‌లో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం పశ్చిమాసియా దేశాలను కలవరపెడుతోంది. ఈ యుద్ధం కేవలం రెండు మూడు దేశాలకే పరిమితం కాకుండా గల్ఫ్ దేశాలను కూడా ఇందులోకి లాగింది. ఇజ్రాయిల్, యూఎస్ దాడులకు ప్రతీకారంగా కువైట్, యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్ వంటి దేశాల్లోని యూఎస్ మిలిటరీ బేస్‌లపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది.
అయితే, ఈ యుద్ధంలో ప్రపంచ దేశాలు ఎటువైపు ఉన్నాయనే ఆసక్తి అందరికి ఉంటుంది. ఈ ఘర్షణల్లో ఇరాన్ నెమ్మదిగా ఒంటరవుతున్న పరిణామాలు కనిపిస్తున్నాయి.
Also Read
- Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
- Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
ఇరాన్ వైపు ఎవరుంటారు??
ఇరాన్ వైపు ఉండే దేశాల జాబితా చాలా తక్కువగా ఉంది. ఇరాన్ ప్రాక్సీలు అయిన లెబనాన్‌లోని హిజ్బుల్లా, యెమెన్‌లోని హౌతీలు మద్దతు ఇస్తారు. ఇక రష్యా, చైనాలు ఇరాన్ వైపు ఉంటాయి. కానీ, అమెరికా ఇజ్రాయిల్‌ను కాదనే పరిస్థితి కూడా ఉంది. రష్యా, చైనాలు కేవలం సైనిక సహకారాన్ని ఇరాన్‌కు అందిస్తాయి.
రష్యా ఈ దాడుల్ని తీవ్రంగా ఖండించింది. ట్రంప్ అసలు రంగు బయటపడిందని విమర్శించింది. యూఎస్ఏ కేవలం 249 ఏళ్ల చరిత్ర కలిగి ఉందని, ఇరాన్‌కు మాత్రం 2500 ఏళ్ల ఘన చరిత్ర ఉందని రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వదేవ్ అన్నారు. ఇరాన్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్న దేశం పాకిస్తాన్. గతంలో ఇజ్రాయిల్ దాడి సమయంలో ఇరాన్‌కు సాయం చేస్తామని పాక్ ప్రకటించింది. అయితే, ఈసారి యుద్ధంలోనే అమెరికా నేరుగా ఇన్వాల్వ్ కావడంతో పాక్ ఆ సాహసం చేయకపోవచ్చు.
ఇజ్రాయిల్-అమెరికా వైపు ఉన్న దేశాలు:
సహజంగా నాటో సభ్య దేశాలు అమెరికా కు సపోర్ట్ చేస్తాయి. ఈ దాడుల కారణంగా సౌదీ, ఖతార్, యూఏఈ, బహ్రైయిన్, కువైట్ వంటి గల్ఫ్ దేశాలు అమెరికా వైపు నిలబడుతాయి. ఇజ్రాయిల్ అంటే ఇష్టం లేకున్నా ఇప్పుడు సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి గల్ఫ్ దేశాలకు ఉంది. వీటితో పాటు జర్మనీ, ఫ్రాన్స్ దేశాలు ఇరాన్ అణు కార్యక్రమాలను తప్పుపడుతున్నాయి.
తటస్థంగా ఉండే దేశాలు:
భారత్, ఇటలీ వంటి దేశాలు తటస్థంగా ఉండనున్నాయి. భారత్‌కు ఇజ్రాయిల్, ఇరాన్ రెండూ సన్నిహిత మిత్ర దేశాలే. దీంతో సమస్యను దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవాలని భారత్ చెబుతుంది. భారత్ లాగే ప్రపంచంలోని మెజారిటీ దేశాలు ఈ యుద్ధంపై తటస్థ వైఖరిని అవలంభించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓడిపోతామనుకున్నా.. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది..
-
Shai Hope: అదే మా కొంప ముంచింది.. చాలా బాధగా ఉంది.. వెస్టిండీస్ కెప్టెన్ ఆవేదన..
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!