Rainbow Meadows : సంగారెడ్డి జిల్లాలోని కిష్టారెడ్డిపేటలో రెయిన్బో మెడోస్ నిర్మాణ సంస్థ పాల్పడిన అతిపెద్ద రియల్ ఎస్టేట్ మోసం తాజాగా వెలుగు చూసింది. హెచ్ఎండీఏ ఆమోదించిన లేఅవుట్‌గా నమ్మించి, పలు సర్వే నంబర్లలో ఏకంగా 40 విల్లాలను అక్రమంగా నిర్మించి అమాయక ప్రజలకు విక్రయించారు. ఇటీవల రెవెన్యూ అధికారుల సర్వేలో ఈ విల్లాలన్నీ సర్వే నంబర్లు 198, 199, 204, 208, 210లలోని ప్రభుత్వ భూమిలో ఉన్నట్లు నిర్ధారణ కావడంతో, కొనుగోలుదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం […]
Hyderabad Police : హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ యూనిట్ తాజాగా ప్రజలకు ముఖ్య హెచ్చరిక జారీ చేసింది. “డిజిటల్ అరెస్ట్” పేరుతో దేశవ్యాప్తంగా పెరుగుతున్న కొత్త రకం సైబర్ మోసాలు హైదరాబాద్‌లో కూడా విస్తరిస్తున్నాయి. నకిలీ పోలీస్, సీబీఐ, ఈడీ, కస్టమ్స్, లేదా కోరియర్ కంపెనీల అధికారులుగా నటిస్తూ కాల్ చేసే మోసగాళ్లు, మనీ లాండరింగ్, టెర్రరిజం, నార్కోటిక్స్ కేసులు, ట్రాఫికింగ్ వంటి తీవ్ర నేరాల్లో కేసులు నమోదయ్యాయని చెప్పి ప్రజలను భయపెట్టి డబ్బు లాక్కోవడం […]
IBomma Ravi : హైదరాబాద్ సైబర్ క్రైమ్ టీమ్ ఐబొమ్మ రవి పై మరో విడత కస్టడీ కఠిన విచారణ జరిపింది. రవి తన మెయిల్ అకౌంట్స్ రిట్రైవ్ చేసిన విషయాలను పోలీసులకు వివరించాడు. పోలీసులు గుర్తించినట్టు, ఐబొమ్మ, బప్పం వెబ్‌సైట్స్‌లో 21,000కి పైగా సినిమాలు పైరసీ చేయబడి ఉంటాయి. పోలీసుల పరిశీలనలో, రవి పైరసీ వెబ్‌సైట్స్ నుండి సినిమాలను రికార్డింగ్ చేసి, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లపై వచ్చే సినిమాలను కూడా కాపీ చేశాడని గుర్తించారు. ఈ సినిమా […]
టీటీడీ కల్తీ నెయ్యి కేసులో బిగ్ ట్విస్ట్.. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రారంభంలో ఫిర్యాదు చేసిన అధికారుల పేర్లు కూడా ఇప్పుడు నిందితుల జాబితాలో చేరాయి. ఈ సందర్భంగా సిట్ (SIT) మరో మెమో దాఖలు చేస్తూ మొత్తం 11 మందిని అదనంగా నిందితులుగా నమోదు చేసింది. అయితే, ఈస్ట్ పీఎస్‌లో కల్తీ నెయ్యి జరిగిందని ఫిర్యాదు చేసిన అప్పటి జీఎం మురళీకృష్ణపై కూడా కేసు నమోదు కావడం పెద్ద చర్చగా […]
Addanki Dayakar : ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణ సాధనలో అమరవీరుల త్యాగాల కంటే కేసీఆర్ దీక్షను పెద్దది అని చెప్పుకోవడం సరైందా అని ప్రశ్నించారు. కేసీఆర్ చేసిన దీక్ష నిజంగా ఎలా జరిగిందో ప్రజలందరికీ తెలుసని, ఆ దీక్షను మహోన్నతంగా చూపించడానికి బీఆర్ఎస్ ప్రయత్నం చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. దయాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన శ్రీకాంతాచారి, యాదయ్య, ఇషాన్ రెడ్డి, కానిస్టేబుల్ కిష్టయ్య […]
Railway Line : దాదాపు పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న రామగుండం-మణుగూరు కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్‌కు కేంద్ర రైల్వే శాఖ నుండి చివరకు ఇన్-ప్రిన్సిపల్ అప్రూవల్ లభించింది. ఈ నిర్ణయంతో పెద్దపల్లి ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. రైల్వే సమస్యల పరిష్కారంలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ కృషి ఫలిస్తున్నదని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ వంశీ మాట్లాడుతూ.. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) ఇప్పటికే సిద్ధమైందని, సుమారు రూ. 4 వేల […]
MLA Anirudh Reddy : మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. కోనసీమపై తెలంగాణ నాయకుల దిష్టి పడిందని పవన్ కళ్యాణ్ అనడం తప్పు మాత్రమే కాదు, దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ.. ఎప్పుడూ మేము ఆంధ్రప్రదేశ్ సంక్షేమానికే మద్దతు ఇచ్చామని, రెండు రాష్ట్రాలు సౌహార్దంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటామన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర విభజన […]
తెలంగాణలో జరుగుతున్న రెండవ సాధారణ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానానికి మాజీ మావోయిస్టు నేత జ్యోతి బరిలోకి దిగుతున్నారు. మావోయిస్టు పార్టీలో 19 సంవత్సరాలుగా పనిచేసి ప్రజా సమస్యల పోరాటానికి కృషి చేశానని, 2023 సంవత్సరంలో సంవత్సరంలో లొంగిపోయిన అనంతరం, గ్రామంలో ప్రజల సమస్యలపై దృష్టి సాధించినట్లు తెలిపారు. మూడేళ్ల క్రితం లొంగి పోయిన మాజీ మావోయిస్టు నేరెళ్ల జ్యోతి సర్పంచిగా పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా శివంగలపల్లికి చెందిన నేరెళ్ల […]
Pawan Kalyan : అమరావతిలో జనసేన పార్టీకి చెందిన లోకసభ సభ్యులు బాలశౌరి, తంగెళ్ల ఉదయ శ్రీనివాస్‌తో ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో పార్టీ ఎంపీలకు అనుసరించాల్సిన వ్యూహాలపై పవన్ కళ్యాణ్ స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. దేశ ప్రయోజనాలను కేంద్రీకరించిన చర్చల్లో సక్రమంగా పాల్గొనడానికి ముందస్తు సన్నాహాలు చేయాలని ఆయన సూచించారు. రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులను వేగవంతం చేసే […]
బైపోల్ వార్ కోసం బీఆర్ఎస్ కొత్త అస్త్రాలను సిద్ధం చేసుకుంటోందా? జూబ్లీహిల్స్ అనుభవం ఆ పార్టీకి సరికొత్త పాఠం నేర్పిందా? అందుకే స్టేషన్ ఘన్‌పూర్‌లో గేమ్ మారిపోయి ప్లాన్ ఎ, ప్లాన్ బీ కూడా తెర మీదికి వచ్చాయా? బలమైన ఇద్దరు నేతల్ని చేర్చుకుని కాంగ్రెస్‌ని దెబ్బ కొట్టాలనుకుంటోందా? ఎవరా ఇద్దరు? ఘన్పూర్ గేమ్ ప్లాన్ ఏంటి? జూబ్లీహిల్స్ ఓటమితో దిమ్మతిరిగిపోయిన బీఆర్ఎస్ అధిష్టానం ఇక అలర్ట్ అయిపోయిందట. పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు […]