Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త..!
- అత్తాపూర్ హల్దీరామ్స్‌పై ఫుడ్ సేఫ్టీ కేసు
- స్వీట్లలో ఫంగస్ – వినియోగదారుల ఆగ్రహం
- నిర్వాహకుల నిర్లక్ష్యంపై ఫిర్యాదు
- FSL రిపోర్ట్ తర్వాత కఠిన చర్యల సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Food Safety Alert: బ్రాండ్‌ను చూసి నమ్మి వెళ్లే వినియోగదారులకు అత్తాపూర్‌లోని ప్రముఖ స్వీట్ షాప్ ‘హల్దీరామ్స్’ (Haldiram’s) చేదు అనుభవాన్ని మిగిల్చింది. పాడైపోయిన, ఫంగస్ పట్టిన మిఠాయిలను విక్రయిస్తున్నారనే ఆరోపణలపై అత్తాపూర్ పోలీసులు ఈ సంస్థపై కేసు నమోదు చేశారు. నాణ్యత లేని ఆహారాన్ని విక్రయించడమే కాకుండా, ప్రశ్నించిన వారిపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఇప్పుడు నగరంలో చర్చనీయాంశంగా మారింది.
Errabelli Dayakar Rao : తొర్రూరు కాంగ్రెస్ కైవసం.. కన్నీళ్లు పెట్టుకు ఎర్రబెల్లి..
Also Read
- Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
- Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
- Cricket Betting :ప్రియురాలికి ప్రాంక్.. పోలీసులకు జాక్‌పాట్.. రూ.30 లక్షల బెట్టింగ్ గుట్టురట్టు
- CM Revanth Reddy : కేంద్ర ప్రభుత్వ తీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం..
బాధితులు హల్దీరామ్స్‌లో స్వీట్ బాక్స్ కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లారు. బాక్స్‌ను అన్బాక్స్ చేయగానే అందులో నుంచి తీవ్రమైన దుర్వాసన రావడాన్ని గమనించారు. లోపల ఉన్న మిఠాయిలను పరిశీలించగా, వాటిపై తెల్లటి ఫంగస్ పేరుకుపోయి ఉండటాన్ని చూసి వారు షాక్‌కు గురయ్యారు. ఒకవేళ పొరపాటున ఈ స్వీట్లను పిల్లలు తిని ఉంటే పరిస్థితి ఏంటని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
పాడైన స్వీట్ల గురించి షాప్ నిర్వాహకులను నిలదీయగా, వారు ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని బాధితులు ఆరోపిస్తున్నారు. యాజమాన్యం బాధ్యతారాహిత్యాన్ని గమనించిన బాధితులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు స్వీట్లను పరిశీలించి, పరిస్థితి తీవ్రతను బట్టి కేసు నమోదు చేశారు.
పోలీసులు హల్దీరామ్స్ నుంచి పాడైన స్వీట్ల నమూనాలను సేకరించారు. వీటిని తదుపరి విచారణ నిమిత్తం ఎఫ్.ఎస్.ఎల్ (FSL) ల్యాబ్‌కు పంపించారు. రిపోర్టులో స్వీట్లు కలుషితమైనట్లు తేలితే యాజమాన్యంపై మరిన్ని కఠిన సెక్షన్ల కింద చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ఆహార భద్రతా నిబంధనలను తుంగలో తొక్కి వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాడే సంస్థలపై కఠినంగా వ్యవహరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Heavy Rain Alert : ఏపీకి భారీ వర్ష ముప్పు.. ఉత్తరాంధ్రకు అలర్ట్
-
Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
-
Bangladesh: హసీనా ఎఫెక్ట్.. బంగ్లా ప్రధాని భారత్ పర్యటనపై తర్జనభర్జన!
-
Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
-
Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!