Kishan Reddy : హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌ను ఆధునికీకరించే పనులను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీం కింద ఈ స్టేషన్ అభివృద్ధి వేగవంతంగా కొనసాగుతుండగా, మొత్తం 35 కోట్ల రూపాయలతో అత్యాధునిక సౌకర్యాలను కల్పించే పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. సాంకేతిక ప్రగతికి కేంద్ర బిందువుగా ఉన్న హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులు, రోజువారీ ప్రయాణికులు, టూరిజం రంగానికి చెందిన వారు ఉపయోగించే […]
Jagga Reddy : తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి మరోసారి బీజేపీపై, ముఖ్యంగా బీజేపీ నేత లక్ష్మణ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన, గాంధీ కుటుంబంపై వ్యాఖ్యలు చేసిన లక్ష్మణ్‌కు అనుభవం, అవగాహన ఏమీ లేవని, చరిత్రకు గౌరవం తెలియదని మండిపడ్డారు. జగ్గారెడ్డి మాట్లాడుతూ.. “బీజేపీ లక్ష్మణ్ వయస్సు 69 ఏళ్లు. స్వతంత్రం వచ్చి 78 ఏళ్లు. అప్పటికి ఆయనే పుట్టలేదు. అలా ఉన్న వ్యక్తి రాహుల్ గాంధీ ఇంట్లో […]
TPCC Mahesh Goud : కేసీఆర్‌పై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పార్టీలో జరిగిన పరిణామాలు, బీఆర్ఎస్ ప్రకటించిన “దీక్షా దివస్”పై స్పందిస్తూ, బీఆర్ఎస్ ఇప్పుడు ఉనికి కోల్పోయిన పార్టీగా మారిందని, మళ్ళీ కనిపించేందుకు కొత్త నాటకాలే ఆశ్రయిస్తోందని అన్నారు. కేసీఆర్ గతంలో చేసిన తెలంగాణ రాష్ట్ర దీక్షను పూర్తిగా నాటకమని అభివర్ణిస్తూ, ఎనిమిది రోజుల దీక్షలో ఆయన ఆసుపత్రిలోనే సెలైన్ ఎక్కించుకున్నారని, విటమిన్ ఇంజెక్షన్లు తీసుకున్నారని మహేష్ గౌడ్ […]
Harish Rao : మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకుంటూ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కూడా నాణ్యమైన ఆహారం అందించలేని పరిస్థితి నెలకొన్నదని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పురుగులతో కూడిన అన్నం అందించిన ఘటనను గుర్తుచేస్తూ, “ముందుగా ప్రభుత్వ పాఠశాలల్లో […]
తెలంగాణలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు వచ్చే సంవత్సరం మార్చి 18 నుంచి ప్రారంభం కానున్నట్లు పాఠశాల విద్యాశాఖ వర్గాలు సూచిస్తున్నాయి.
Special : హైదరాబాద్… ఇప్పుడు గ్లోబల్ సిటీగా ఎదుగుతోంది. అయితే, నగరంలో ఎటు చూసినా గాలిలో వేలాడుతున్న కేబుల్స్, వైర్ల జంక్షన్లు నగర సౌందర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా విద్యుత్ వైర్లు, ఇంటర్నెట్ కేబుల్స్ మరియు కమ్యూనికేషన్ లైన్ల గందరగోళం నిత్య సమస్యగా మారుతోంది. గాలిలో వేలాడుతున్న ఈ ట్యాంగిల్డ్ వైర్స్ కేవలం నగర అందాన్ని దెబ్బతీయడమే కాదు, యాక్సిడెంట్లకు కూడా కారణం అవుతున్నాయి. ఇక వర్షాకాలంలో ఈ ఓవర్‌హెడ్ లైన్స్ నిర్వహణ అనేది పెద్ద టాస్క్‌గా మారుతోంది. […]
Ragging : సిద్దిపేట అర్బన్ మండలంలోని మిట్టపల్లి సురభి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నెల 17న కాలేజీలో జాయిన్ అయిన ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థి సాయి (18)ను అదే కాలేజీకి చెందిన రెండో సంవత్సరం విద్యార్థులు ర్యాగ్ చేసినట్లు సమాచారం. గడ్డం ఎందుకు పెంచుకున్నావని సీనియర్లు ప్రశ్నించగా, దేవుడికి మొక్కు ఉందని చెప్పినా వినకుండా ట్రిమ్మర్‌తో గడ్డం తీయించినట్లు బాధిత విద్యార్థి ఆరోపించాడు. ఇంతటితో ఆగకుండా, మరోసారి గడ్డం పెంచితే […]
Telangana : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ, బీసీ రిజర్వేషన్ల అంశం కాంగ్రెస్ ప్రభుత్వానికి అత్యంత కీలకంగా మారింది. సర్పంచ్ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లను అమలు చేసి తీరుతామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చకు దారితీసింది. అయితే, ఈ హామీని అధికారికంగా కాకుండా పార్టీ పరంగా అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకువచ్చిన జీఓ (GO)పై ప్రస్తుతం హైకోర్టులో […]
డీసీసీ నియామకాలు ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్‌లో చిచ్చు పెట్టాయా? నాయకుల మధ్య అసలే అంతంతమాత్రంగా ఉన్న సంబంధాలు మరింత దిగజారే ప్రమాదం ఉందా? ముందు నుంచి ప్రచారం జరిగిన వాళ్ళకు కాకుండా… అస్సలు ఎవ్వరూ ఊహించని నాయకులకు ఎలా జిల్లా అధ్యక్ష పదవులు దక్కాయి? తెర వెనక చక్రం తిప్పిందెవరు? ఉమ్మడి వరంగల్ జిల్లాలో డీసీసీ పదవులు ఆశించిన వారికి కాంగ్రెస్ అధిష్టానం ఝలక్ ఇచ్చింది. సామాజిక సమీకరణల పేరుతో ఊహించని వ్యక్తులు తెర మీదికి రావడంతో…. […]
నల్లగొండ డీసీసీ అధ్యక్షుడి నియామకంపై ఆ మంత్రి తన అసంత్రుప్తిని ఎందుకు వ్యక్తం చేస్తున్నారు… తన లేఖలో ఆ సీనియర్ నేత పేర్కొన్న అంశాలేంటి.. డీసీసీ అధ్యక్షుడి నియామకానికి అన్న నై అంటుంటే.. తమ్ముడు మాత్రం సై అని ఎందుకు అంటున్నారు… డీసీసీ నియామకంతో ఉమ్మడి జిల్లా నేతలంతా ఒకవైపు… ఆ సీనియర్ నేత, క్యాబినెట్ మంత్రి మాత్రం మరోవైపు ఎందుకయ్యారు… తాజా ఎపిసోడ్ లో గతం తవ్వుకుంటే అందరి నష్టమేనని కాంగ్రెస్ క్యాడర్ ఎందుకంటుంది… నల్లగొండ […]