Maoists Surrender : ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టు పార్టీకి మరోసారి గట్టి దెబ్బ తగిలింది. దక్షిణ బస్తార్ ప్రాంతానికి చెందిన మొత్తం 37 మంది మావోయిస్టులు అధికారుల ముందు లొంగిపోయారు. దంతేవాడ జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్ సమక్షంలో ఈ లొంగుబాట్లు నమోదయ్యాయి. లొంగిపోయిన వారిలో 27 మంది క్రియాశీల మావోయిస్టులు ఉండటం విశేషం. వీరిలో పలువురిపై మొత్తం 65 లక్షల రూపాయల రివార్డులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే మరో 10 మంది మిలీషియా సభ్యులు […]
గ్రామాలలో గ్రామపంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో తమ ఓటు అమ్మబడదు అంటూ గ్రామంలోని కొందరు యువకులు ఇంటి ఎదుట వినూత్నంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకుంటున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గాంధీనగర్ లో గ్రామపంచాయతీ ఎన్నికల వేళ గ్రామంలోని యువత వారి ఇంటికి ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకున్నారు. ఫ్లెక్సీ పై ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని, ఆ ఓటుని మేము అమ్ముకోమని, మా ఓటు విలువైనది – అమ్మబడదు అని […]
అక్క జీవితాన్ని నాశనం చేశాడన్న పగతో బావమరిది చేసిన దాడిలో బావ మృతి చెందగా అత్త తీవ్రంగా గాయపడింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ళకు చెందిన సాంబశివరావుకు గణపవరంకు చెందిన సాయికి రెండేళ్ళ క్రితం వివాహం జరిగింది. నాలుగు నెలల తర్వాత ఇద్దరిమధ్య విబేధాలు తలెత్తాయి. దీంతో సాయిపుట్డింటికి వెళ్లింది. పెద్దలు సర్దిచెప్పినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఇద్దరు విడిపోయారు. అయితే అక్క జీవితం నాశనమవడానికి బావ సాంబశివరావు కారణమని మనసులో పగ పెంచుకున్నాడు. […]
మద్యం మత్తులో రోడ్డు ప్రమాదాల కారణంగా.. అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపైన ట్రాఫిక్ పోలీసులు, కోర్టులు కొరడా జులిపిస్తున్నాయి. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేశారు. ఈ డ్రైవ్లో భాగంగా మొత్తం 431 మందిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. వీరిలో 325 ద్విచక్ర వాహనదారులు, 16 […]
పార్టీ ఆవిర్భావం తర్వాత బోణీ కొట్టిన నియోజకవర్గంలో గ్లాస్ ఇంకా బ్యాలెన్స్ అవడం లేదా? నాయకుడు మారినా నడిపే తీరు మాత్రం మారడం లేదా? దశాబ్దానికి పైగా పార్టీ జెండా మోసిన వాళ్ళు అందుకే హర్ట్ అవుతున్నారా? రాజోలు జనసేన రచ్చకు అసలు కారణం ఏంటి? పవన్ వార్నింగ్ ఇచ్చాక కూడా పరిస్థితులు మారే అవకాశం లేదా? లెట్స్ వాచ్. పార్టీ పెట్టాక తొలిసారి 2019 ఎన్నికల్లో ఒకే ఒక్క అసెంబ్లీ సీటు రాజోలులో గెలిచింది జనసేన. […]
IBomma Ravi : హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ రవి కస్టడీ విచారణలో మరోసారి కీలక వివరాలను వెలికితీశారు. పైరసీ వ్యవహారాన్ని పూర్తిగా తన అసలైన గుర్తింపుకి దూరంగా ఉంచాలని రవి ముందుగానే నిర్ణయించుకున్నట్లు విచారణలో స్పష్టం అయింది. ఇందుకోసం అతడు ‘ప్రహ్లాద్’ పేరుతో పూర్తిగా ఫేక్ ఐడెంటిటీని సృష్టించుకుని, ఆ పేరుతో వివిధ పత్రాలు, బ్యాంకింగ్ వ్యవస్థలు, కంపెనీ రిజిస్ట్రేషన్లను నిర్వహించాడు. రవి ప్రహ్లాద్ పేరుతోనే పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడంతో పాటు, […]
ఏపీకి అలర్ట్.. రేపు పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు.. దిత్వా తుపాన్ ప్రభావంతో రాబోయే రెండు రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. కాబట్టి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రేపు (నవంబర్ 30న ) ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ […]
CP Sajjanar : హైదరాబాద్ లో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా, ముఠా తగాదాలతో అశాంతి రేపుతున్న అసాంఘిక శక్తులపై నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్, ఐపీఎస్ కఠిన చర్యలు తీసుకున్నారు. పది ప్రధాన ముఠాలకు చెందిన సభ్యులను ఆయన టీజీఐసీసీసీకి పిలిపించి.. అదనపు జిల్లా మెజిస్ట్రేట్ (ఎగ్జిక్యూటివ్) హోదాలో ప్రత్యేక కోర్టు నిర్వహించారు. నగరంలోని సౌత్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ పరిధిల్లో ఆధిపత్య పోరు కోసం ఘర్షణ పడుతున్న వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి […]
మరావతి వ్యవహారాల్లో మున్సిపల్ మంత్రి నారాయణ పాత్ర పరిమితం కాబోతోందా? అన్ని వ్యవహారాలను డీల్ చేయడం ఆయనవల్ల కావడం లేదా? అందుకే కేంద్ర మంత్రి తెర మీదికి వచ్చారా? ఆ విషయమై జరుగుతున్న చర్చలేంటి? మున్సిపల్ మినిస్టర్కు ఎక్కడ తేడా కొట్టింది? అమరావతి రైతుల సమస్యల పరిష్కారం కోసం త్రిసభ్య కమిటీ వేసింది ఏపీ సర్కార్. ఇందులో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ సభ్యులుగా ఉన్నారు. సమస్య పరిష్కారం సంగతి […]
మేమంటే…. మరీ అంత ఎకసెక్కాలైపోయాయా? ఎంత ఫారెస్ట్ ఏరియా అయితే మాత్రం అంత కామెడీగా ఉందా? ఏకంగా మా పేరునే లాక్కుపోయి ఉనికిని ప్రశ్నార్ధకంగా చేస్తారా అంటూ… డైరెక్ట్గా ఏపీ ప్రభుత్వ పెద్దల మీదే మండిపడుతున్నారు ఆ నియోజకవర్గ ప్రజలు. ఎవర్నో సంతృప్తి పరచడానికి మాకు అడ్రస్ లేకుండా చేస్తే ఊరుకోబోమని అంటోంది ఎక్కడ? బలమైన ఆ బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి? ఏపీలో జిల్లాల పునర్విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయంపై ఓవైపు హర్షం వ్యక్తం అవుతున్నా… […]