TG Cabinet Meeting : ఈ నెల 23న కేబినెట్ భేటీ.. వాటిపై నిర్ణయం తీసుకునే ఛాన్స్
- నెల 23న మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం
- అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై చర్చించనున్న కేబినెట్
- శాఖలవారీగా బడ్జెట్ కేటాయింపులు
- కొత్త పథకాల అమలుపై నిర్ణయం తీసుకునే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG Cabinet Meeting : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 2026-27 వార్షిక బడ్జెట్ రూపకల్పన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 23న మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ, నిధుల కేటాయింపులు, కొత్త పథకాల అమలుపై ఈ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనుంది.
సగం ధరకే Havells వాటర్ హీటర్..! ఫీచర్లు అదరిపోయాయి.!
Also Read
- CM Revanth Reddy : పది మంది డీఎస్పీలు చాలు.. ప్రభుత్వ ప్రతిష్ట పెంచినా, తగ్గించినా
- Cloud Kitchens: క్లౌడ్ కిచెన్లలో ఆర్డర్ పెట్టుకుంటున్నారా..? తనిఖీల్లో మొత్తం బొద్దింకలు, పురుగులే..
- IVF Scam : ఐవీఎఫ్ సెంటర్ల అక్రమ దందాపై పోలీసుల ఉక్కుపాదం... 20 ఫెర్టిలిటీ సెంటర్లకు నోటీసులు!
- Indiramma Indlu: రూ.5 లక్షలతో 20 రోజుల్లో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం!
ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా ఫిబ్రవరి 26 నుండి ప్రారంభం కానున్నట్లు సమాచారం ఉన్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్‌ను ఖరారు చేయనున్నారు. సుమారు 10 నుండి 15 రోజుల పాటు ఈ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా.. వివిధ ప్రభుత్వ శాఖల వారీగా నిధుల కేటాయింపులు, ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్య రంగాలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతపై చర్చించనున్నారు.
వీటితో పాటు.. ఎన్నికల హామీలైన ఆరు గ్యారంటీల అమలుకు సంబంధించి బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి వంటి పథకాలకు అవసరమైన ఆర్థిక వెసులుబాటుపై కేబినెట్ తుది నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలో కొత్తగా అమలు చేయాలని భావిస్తున్న కొన్ని సంక్షేమ పథకాలపై కూడా ఈ సమావేశంలో స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. గత బడ్జెట్ కంటే ఈసారి కేటాయింపులు మరింత వాస్తవిక దృక్పథంతో, ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండేలా ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది.
కేంద్రం నుండి రావాల్సిన నిధులు, రాష్ట్ర స్వంత ఆదాయ వనరులపై కూడా మంత్రులు సమీక్షించనున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్ని శాఖల అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించి బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేశారు. కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత, ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి మొదటి వారంలో బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
India Unemployment Rate 2026: దేశంలో నిరుద్యోగం తగ్గుముఖం.. 5.1 శాతానికి పడిపోయిన నిరుద్యోగ రేటు!
-
Ramayana: ఆస్కార్ రేసులో ‘రామాయణ: పార్ట్ 1’.. ఇండిపెండెంట్ ఎంట్రీ!
-
Kedarnath Temple: కేదార్నాథ్ ఆలయం మూసివేత.. ఈ ఏడాది రికార్డు స్థాయిలో భక్తుల రాక!
-
Kolkata-Sairang Express Derails: రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన కోల్‌కతా-సైరాంగ్ ఎక్స్‌ప్రెస్..
-
Suryakumar Yadav: భార్య ఇచ్చిన సలహా నా ఆలోచనా విధానాన్ని మార్చేసింది.. జట్టులో స్థానం కోల్పవడంపై ఓపెనైన స్కై..!
ట్రెండింగ్
-
Aryaveer Sehwag: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న.. వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఎమోషనల్.!
-
రోల్స్ రాయిస్‌కు పోటీగా BYD కొత్త కారు.. 1,000+ కి.మీ. రేంజ్, 360 డిగ్రీలు తిరిగే BYD Yangwang Altior..!
-
New Zealand Test Squad: టీమిండియాతో టెస్ట్ సమరానికి కివీస్ రెడీ.. 14 మందితో జట్టు ప్రకటన!
-
National Education Day 2026: బట్టీ పద్ధతులకు చెక్.. ఏఐ యుగంలో ‘క్రిటికల్ థింకింగ్’
-
Kitchen Storage Tips : ఆవాలు ఎక్కువ కాలం తాజాాగా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే పాడవవు