Reels Madness: శివుడికి గంజాయి ప్రసాదం.. యువకుల వికృత చేష్టలు.. రంగంలోకి సీపీ సజ్జనార్..
- శివరాత్రి రోజున ఆలయంలో యువకుల వికృత చేష్టలు
- గంజాయి ప్రసాదంగా పెట్టి రీల్స్ వైరల్
- నెటిజన్ల ఆగ్రహం.. పోలీసులకు ఫిర్యాదులు
- కఠిన చర్యలకు సీపీ సజ్జనార్ ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆధ్యాత్మికతకు నెలవైన దేవాలయాలు నేడు సోషల్ మీడియా పిచ్చికి అడ్డాగా మారుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం వేళ శంషాబాద్‌లోని ధర్మగిరి దేవాలయంలో కొందరు యువకులు చేసిన పని ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. భక్తులంతా భక్తిశ్రద్ధలతో కొబ్బరికాయలు, పూలు సమర్పిస్తుంటే, ఈ ప్రబుద్ధులు మాత్రం సాక్షాత్తు ఆ పరమశివుడికి ‘గంజాయి’ని ప్రసాదంగా పెట్టి తమ వికృత చేష్టలను ప్రదర్శించారు.
Mahesh Babu: ‘వారణాసి’ ఓకే.. నెక్స్ట్ ఏంటి?
Also Read
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
బడంగ్‌పేటకు చెందిన చరణ్, అతని స్నేహితులు శివరాత్రి సందర్భంగా ధర్మగిరి ఆలయానికి చేరుకున్నారు. అందరూ చేసేలా కాకుండా తాము ఏదో వెరైటీగా చేస్తున్నామనే భ్రమలో గంజాయిని దేవుడి పాదాల చెంత ఉంచి వీడియో తీశారు. “దేవుడికి అందరూ కొబ్బరికాయలు కొడతారు.. మేము మాత్రం గంజాయి ప్రసాదం పెడుతున్నాం” అంటూ ఆ వీడియోలో వ్యాఖ్యానించారు. అనంతరం ఆ వీడియోను ‘ఇన్‌స్టాగ్రామ్’లో రీల్స్‌గా పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేవుడిని, భక్తుల మనోభావాలను కించపరిచేలా వ్యవహరించిన సదరు యువకులపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌కు సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు చేశారు. దీనిపై తక్షణమే స్పందించిన సీపీ సజ్జనార్, నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు.
వీడియో ఆధారంగా నిందితులు బడంగ్‌పేటకు చెందిన వారిగా పోలీసులు ఇప్పటికే గుర్తించారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. కేవలం వ్యూస్ కోసం, లైక్స్ కోసం మతపరమైన విశ్వాసాలను దెబ్బతీస్తూ ఇలాంటి రీల్స్ చేసే వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. “సోషల్ మీడియాను విజ్ఞానానికి, వినోదానికి వాడాలి తప్ప, ఇలాంటి వికృత చేష్టలకు కాదు. పవిత్రమైన దేవాలయాల్లో ఇలాంటి పనులకు పాల్పడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవు” అని ఆయన స్పష్టం చేశారు.
Dhruv Vikram: మైత్రీ మూవీ మేకర్స్‌తో..విక్రమ్ తనయుడు ధ్రువ్ క్రేజీ ప్రాజెక్ట్
దేవుడి ముందు మాదకద్రవ్యాలను చూపిస్తూ రీల్సా? ఫేమస్ అవ్వడం కోసం ఎంతకైనా తెగిస్తారా?
మహాశివరాత్రి భక్తికి నిదర్శనం.. ముక్తికి సోపానం. పరమ పవిత్రమైన ఈ పర్వదినాన, దైవ ప్రసాదం పేరుతో మత్తు పదార్థాలను ప్రదర్శించడం అత్యంత హేయమైన చర్య. అది వికృతమైన ఉన్మాదం!
మేమేదో సాహసం చేశామని… pic.twitter.com/MWeFz2Id19
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) February 17, 2026
తాజావార్తలు
-
Praveen Kumar: ఏదైనా చేయాలనుంది.. కీలక పదవికి దరఖాస్తు చేసిన టీమిండియా మాజీ పేసర్!
-
Ramayana : రామాయణ ప్రీ పోన్.. మూడు రోజులు ముందుగా థియేటర్స్‌లోకి
-
Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Guntur Car Fire: కారులో ఏసీ పేలి మంటలు.. తండ్రి సజీవదహనం, కొడుకుకు తీవ్ర గాయాలు..
ట్రెండింగ్
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!