Congress: ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి బృందం.. కాంగ్రెస్ అధిష్టానంతో కీలక భేటీ.. అజెండాలో ఆ అంశాలేనా.?
- ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి బృందం ప్రయాణం
- కాంగ్రెస్ అధిష్టానంతో కీలక సమీక్ష సమావేశం3 గ్యారెంటీలు, పార్టీ బలోపేతం అజెండాలో
- క్యాబినెట్ మార్పులపై ఊహాగానాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ బృందం ఈ నెల 19న ఢిల్లీకి వెళ్లనుంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మారుతున్న రాజకీయ సమీకరణలు, పార్టీ బలోపేతం , భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు ఏఐసీసీ (AICC) అగ్ర నాయకత్వం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రివర్గంలోని పలువురు కీలక మంత్రులు ఈ పర్యటనలో పాల్గొనబోతున్నారు. వీరితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఈ సమావేశంలో భాగస్వామి కానున్నారు. 19వ తేదీ ఉదయం ఢిల్లీకి చేరుకోనున్న వీరు, కాంగ్రెస్ అగ్ర నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ , కేసీ వేణుగోపాల్‌తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. రాష్ట్రంలో పాలన మొదలై ఏడాది దాటిన క్రమంలో, క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై నివేదిక ఇవ్వనున్నారు.
Also Read
Emmanuel Macron: ముంబై రోడ్లపై సామాన్యుడిలా ఫ్రెంచ్ అధ్యక్షుడు జాగింగ్.. వీడియో వైరల్
ఈ సమావేశంలో ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలవుతున్న సంక్షేమ పథకాలు, ముఖ్యంగా గ్యారెంటీల అమలు తీరుపై అధిష్టానం సమీక్షించనుంది. ప్రభుత్వ పనితీరుతో పాటు పార్టీ నిర్మాణం, సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయడం , పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీపై అధిష్టానం దిశానిర్దేశం చేయనుంది. అలాగే విపక్షాల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టడం , భవిష్యత్తు ఎన్నికల వ్యూహాల గురించి రాహుల్ గాంధీ స్వయంగా నాయకులకు సూచనలు చేసే అవకాశం ఉంది.
కాంగ్రెస్ అధిష్టానం ప్రస్తుతం వివిధ రాష్ట్రాల నాయకులతో వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగానే 19వ తేదీ ఉదయం తెలంగాణ నేతలతో సమావేశమై, అదే రోజు సాయంత్రం మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంతో భేటీ కానుంది. రాష్ట్రంలో పార్టీ స్థితిగతులను మెరుగుపరచడంతో పాటు, ప్రభుత్వం , పార్టీ మధ్య సమన్వయాన్ని పెంచడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. ఈ భేటీ తర్వాత తెలంగాణ క్యాబినెట్‌లో మార్పులు లేదా చేర్పులు ఉండొచ్చనే ఊహాగానాలు కూడా రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి.
Sri Lanka-T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక ప్రయాణం.. లంకేయులు ఎప్పుడూ పోటీదారులే!
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?