నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం కుద్వాన్పూర్ ప్రాథమిక పాఠశాలలో దారుణ ఘటన వెలుగుచూసింది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు శంకర్, రెండో తరగతి విద్యార్థులపై కర్కశంగా ప్రవర్తించాడు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం జై కేసారం గ్రామంలో ఉన్న SR ల్యాబ్ కెమికల్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో కొద్ది సేపట్లోనే పెద్ద ఎత్తున దగ్ధమయ్యాయి.
బీఆర్ఎస్ బై పోల్ మూడ్లోకి వచ్చేసిందా? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టిందా? ఎప్పుడు సైరన్ మోగినా మేము సై అంటూ సిద్ధమైపోతోందా? అసలిప్పుడు ఎందుకు హడావిడి చేస్తోంది కారు పార్టీ? ఏ ఉప ఎన్నికల కోసం సిద్ధమవుతోంది.
ఓట్ల చోరీ వ్యవహారంపై ఏఐసీసీ పిలుపునకు స్పందిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఓట్ల చోరీ వ్యతిరేక ప్రచారానికి సంబంధించిన ప్రత్యేక లోగోను సీఎం రేవంత్రెడ్డి ఆవిష్కరించారు.
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం (MDM - Mid Day Meal) పథకాన్ని అమలు చేసే వంటకార్మికులు ఎన్నో నెలలుగా ఎదుర్కొంటున్న సమస్యలు త్వరలో తగ్గబోతున్నాయి. ఇప్పటి వరకు బిల్లులు ఆలస్యమవడం, చెల్లింపులు సమయానికి జరగకపోవడంతో వారు అప్పులు తెచ్చుకుని పని కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తెలంగాణ బీజేపీ కమిటీ వేసేదెన్నడు? కొత్త అధ్యక్షుడు వచ్చాక వారంలో వేస్తామని ప్రకటించి నెల గడుస్తున్నా... దిక్కూ దివాణం లేకుండా పోయింది ఎందుకు? అధ్యక్షుడు ఎందుకు నిస్సహాయంగా ఉండిపోతున్నారు? తెర వెనక జరుగుతున్న తతంగం ఏంటి?
Telangana : తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి విద్యా రంగంలో మరో ముఖ్యమైన సంస్కరణకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఫేసియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS)ను శనివారం నుంచి విజయవంతంగా అమలు చేసింది. విద్యా రంగంలో డిజిటల్ మార్పుకు ఇది ఒక కీలక అడుగుగా అధికారులు పేర్కొన్నారు. ఈ నూతన విధానం ద్వారా విద్యార్థుల హాజరు పూర్తిగా డిజిటల్ పద్ధతిలో నమోదు అవుతుంది. ప్రాక్సీ హాజరు లేదా రికార్డుల్లో తారుమారు […]
Cyber Crime : దేశవ్యాప్తంగా సైబర్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ మోసం బయటపెట్టారు. విజయవాడకు చెందిన సైబర్ క్రిమినల్ శ్రవణ్ కుమార్ను అరెస్ట్ చేశారు. కేవలం రెండు నెలల వ్యవధిలోనే అతను 500 కోట్ల రూపాయల భారీ నగదు లావాదేవీలు జరిపినట్టు విచారణలో తేలింది. పోలీసుల దర్యాప్తులో, శ్రవణ్ కుమార్ 500 మ్యూల్ అకౌంట్స్ సృష్టించి, వాటి ద్వారా 500 కోట్ల పైచిలుకు నగదు బదిలీ చేసినట్టు వెల్లడైంది. […]
Gurukulam : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన ఘటన ఒక్కసారిగా విద్యా వర్గాలను, తల్లిదండ్రులను, ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన గురుకుల పాఠశాలలోనే కొందరు సిబ్బంది తమ కక్షసాధింపుకై తాగునీటిలోనే పురుగుల మందు కలపడం కలకలం రేపింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పరిధిలోని ఒక గురుకుల పాఠశాలలో ఈ దారుణం జరిగింది. పాఠశాలలో ప్రత్యేక అధికారి (Special Officer) పట్ల కక్ష పెంచుకున్న నలుగురు సిబ్బంది ఆవేశపూరితంగా తాగునీటిలో పురుగుల మందు కలిపినట్టు […]
కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతున్న నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన కూకట్పల్లి పోలీస్ స్టేషన్కి చేరుకుని బాలిక తల్లిదండ్రులతో మాట్లాడారు.