హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ ప్రాంతం మరోసారి మహా గణనాథుడి ఆగమన్‌తో పండుగ వాతావరణంలో మునిగిపోయింది. డీజెల హోరు, యువత కేరింతలు, భక్తుల జయజయకారాలతో ఖైరతాబాద్ మహా గణపతికి గ్రాండ్ వెల్కమ్ లభించింది.
కాంగ్రెస్ పార్టీ ఎప్పటినుంచో శ్రీరాముడి పేరును ఎగతాళి చేస్తూ వస్తోందని, రాముడి పట్ల వారికి గౌరవం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.
తెలంగాణ రైతాంగానికి ఉద్దేశించి వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బహిరంగ లేఖ విడుదల చేశారు. యూరియా కేటాయింపులు, స్వదేశీ–దిగుమతి సరఫరాల్లో కేంద్ర ప్రభుత్వం సమన్వయ లోపం, అసమర్థత కారణంగా రాష్ట్రాలకు అవసరమైన పరిమాణం సమయానికి చేరడం లేదని ఆయన తీవ్రంగా విమర్శించారు.
హైదరాబాద్ నగరంలో మరోసారి రేవ్ పార్టీ బస్టింగ్ జరిగింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈగల్ టీమ్, గచ్చిబౌలి పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి డ్రగ్స్ వాడుతున్న పలువురిని పట్టుకున్నారు.
భద్రాద్రి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు దాడి చేసి వ్యవసాయశాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌ను లంచం తీసుకుంటూ పట్టుకున్నారు. నరసింహారావు అనే ఈ అధికారి, ఎరువుల దుకాణం యజమాని నుంచి లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ సిబ్బంది నిర్వహించిన ఆపరేషన్‌లో పట్టుబడ్డాడు.
హైదరాబాద్ నగరంలో మరోసారి సైబర్ మోసం వెలుగుచూసింది. 52 ఏళ్ల వయసు గల ఓ పురోహితుడు నేరగాళ్లకు బలై, లక్షల రూపాయలు కోల్పోయాడు. పాతబస్తీ పురానాపూల్ ప్రాంతానికి చెందిన ఈ పురోహితుడిని సైబర్ దుండగులు పూజ పేరుతో మోసం చేసిన ఘటన ఆలస్యంగా బయటపడింది.
వికారాబాద్ జిల్లా అనంతగిరి పర్యాటక అభివృద్ధి దిశగా పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పలు చర్యలు చేపట్టారు. వికారాబాద్ కేంద్రంలో ఆయన అనంతగిరి హరిత రిసార్ట్స్, అనంతగిరి వ్యూ టవర్ ప్రాంతాలను ప్రత్యేకంగా పరిశీలించారు.
వరంగల్ నగరంలో మరో వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. మిల్స్ కాలనీ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఎస్సై శ్రీకాంత్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయింది. వివరాల ప్రకారం, ఈ నెల 22వ తేదీ అర్ధరాత్రి స్థానికంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్న దళిత మహిళ మరియమ్మపై దాడి చేసిన ఘటన జరిగింది.