Kolors Healthcare : విశాఖపట్నంలో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’.. ప్రారంభించిన హీరోయిన్ సంయుక్త మీనన్
- విశాఖలో కలర్స్ హెల్త్ కేర్ 2.Oకి సంయుక్త మీనన్ ఆవిష్కరణ
- ఆధునిక టెక్నాలజీతో హెల్త్, స్కిన్, వెయిట్ మేనేజ్మెంట్ సేవలు
- 2004 నుంచి వేలాది కస్టమర్ల విశ్వాసం గెలుచుకున్న కలర్స్ హెల్త్ కేర్
- యుఎస్-ఎఫ్‌డీఏ ఆమోదం పొందిన అంతర్జాతీయ ప్రమాణాల చికిత్సలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ హెల్త్ కేర్ సంస్థ ‘కలర్స్ హెల్త్ కేర్’ (Kolors Healthcare) సంస్థ విశాఖపట్నంలో తన నూతన బ్రాంచ్‌ను ప్రారంభించింది. రామ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ను హీరోయిన్ సంయుక్త మీనన్ ఆవిష్కరించారు. ఆధునిక సాంకేతికతతో రూపొందించిన సౌకర్యాలను ఆమె పరిశీలించి, నిర్వాహకుల ప్రయత్నాలను అభినందించారు.
ఈ సందర్భంగా సంయుక్త మీనన్ మాట్లాడుతూ – “ఆకర్షణీయ నగరం విశాఖపట్నంలోని ప్రజలకు అందం, ఆరోగ్యం అందించేందుకు ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ను పరిచయం చేయడం గర్వకారణంగా ఉంది. నేను కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు వెయిట్ లాస్‌కు ఇప్పుడున్నంత టెక్నాలజీ లేదు. హెల్తీ బాడీ అంటే సరైన మజిల్స్ ఉండాలని ఇప్పుడు తెలుస్తుంది. ఇటీవల ట్రెక్కింగ్ కోసం మేఘాలయా వెళ్లాను. ఆ జర్నీ నేను చాలా ఎంజాయ్ చేశాను. బ్రీతింగ్ సమస్య కూడా లేదు. కానీ అక్కడ కొంత మందిలో సరిగ్గా బ్రీతింగ్ లేదు, ఆరోగ్యం సహకరించలేదు. ప్రపంచంలోని పలు ప్రదేశాలను చూడాలి, ప్రకృతిని ఎంజాయ్ చేయాలంటే హెల్త్‌ను మెంటాయిన్ చేయాలి. ప్రతి ఒక్కరూ ఫిట్‌గా ఉండాలలి అసరమైన ట్రీట్మెంట్ తీసుకోవాలి. నాణ్యమైన సేవలను ఆధునిక టెక్నాలజీతో అందిస్తున్న కలర్స్ హెల్త్ కేర్‌కు అభినందనలు. దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న కలర్స్ హెల్త్ కేర్.. ఇప్పుడు విశాఖ ప్రజల చెంతకు రావడం ఆనందంగా ఉంది” అని అన్నారు.
Also Read
- CMR Jewellery: గాజువాకలో CMR జువెలరీ షోరూం.. ఘనంగా ప్రారంభించిన భాగ్యశ్రీ బోర్సే.!
- Kolors Healthcare : కలర్స్ హెల్త్కేర్లోకి రూ.215 కోట్లు.. పిరమల్ ఆల్టర్నేటివ్స్ భారీ పెట్టుబడి..
- Rainbow Children's Hospital: రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇప్పుడు నెల్లూరులో కూడా..!
- Janani Dialogues 2026: భారతదేశపు పునరుత్పత్తి ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు.. 'ఒయాసిస్ అకాడమీ' ప్రారంభం

‘కలర్స్ హెల్త్ కేర్’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట శివాజీ కూన మాట్లాడుతూ – “2004లో ప్రారంభమైన కలర్స్ హెల్త్ కేర్ ఇప్పటివరకు వేలాది మంది కస్టమర్లను సంతృప్తి పరిచింది. ఆధునిక టెక్నాలజీని నిరంతరం జోడిస్తూ సేవలను మరింత బలోపేతం చేస్తున్నాం. మెడికల్ కండీషన్, ఇంజెక్షన్స్, హెల్త్ పౌడర్ వంటివి అందించే సేవలతో కలర్స్ హెల్త్ కేర్ 2.Oగా అప్డేట్ అయింది. దేశవ్యాప్తంగా విస్తరణలో భాగంగా విశాఖపట్నంలో బ్రాంచ్‌ను ప్రారంభించాము. ” అని తెలిపారు.
ఆపరేషన్స్ డైరెక్టర్ కృష్ణరాజ్ మాట్లాడుతూ – “21 ఏళ్లుగా కస్టమర్ల విశ్వాసం, సంతృప్తి మాకు మరింతా కాన్ఫిడెన్స్ పెంచింది. వారి అభిలాష మేరకు విశాఖలో ఈ కొత్త బ్రాంచ్‌ను ఏర్పాటు చేశాం. యుఎస్-ఎఫ్‌డీఏ ఆమోదం పొందిన టెక్నాలజీతో అధిక బరువు, హెయిర్, స్కిన్ సమస్యలకు అంతర్జాతీయ ప్రమాణాల చికిత్సలను అందిస్తున్నాం” అని వివరించారు.

మేనేజింగ్ డైరెక్టర్ డా. విజయ్ కృష్ణ మాట్లాడుతూ – “కలర్స్ హెల్త్ కేర్ సేవలను విశాఖపట్నానికి విస్తరించగలగడం ఆనందంగా ఉంది. ఈ బ్రాంచ్‌ను ఆవిష్కరించిన సంయుక్త మీనన్‌కు ధన్యవాదాలు. ఆరోగ్యంగా, అందంగా ఉండాలన్న ప్రతి ఒక్కరి కోరికకు మద్దతుగా కలర్స్ హెల్త్ కేర్ ఎల్లప్పుడూ నిలుస్తుంది” అని అన్నారు.
5M మీడియా ఆధ్వర్యంలో జైదీప్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంయుక్త మీనన్‌ను చూడటానికి అభిమానులు, అతిథులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. “కలర్స్ హెల్త్ కేర్ కొత్త బ్రాంచ్ ప్రారంభోత్సవానికి పలువురు అతిథులు శుభాకాంక్షలు తెలిపారు.
తాజావార్తలు
-
OTR: పాయల్ శంకర్ రైతు యాత్రకు అధిష్టానం నో.. అసలు కారణం ఏంటి…?
-
OTR: తాండూరులో ఇద్దరు పవర్ సెంటర్లు.. అన్నదమ్ముల ఆధిపత్య పోరుతో అధికారులకు తిప్పలు..
-
OTR : ఎమ్మిగనూరులో వైసీపీ తడబాటు.. నేతల అహంకారమే కారణమా..?
-
Story Board : ఢిల్లీ కాలుష్యాన్ని ఎంతకాలం భరించాలి ?జనం అనారోగ్యం పాలైనా పట్టించుకోరా ?
-
Kitchen Storage Tips : ఆవాలు ఎక్కువ కాలం తాజాాగా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే పాడవవు
ట్రెండింగ్
-
Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
-
BSNL నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రూ.172, రూ.184, రూ.190లకే అన్లిమిటెడ్ కాలింగ్..!
-
గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే సులువుగా రైడ్.. KTM 390 Super Duke GT Evo బైక్ లాంచ్‌కు సిద్ధం..!
-
IND vs NZ 3rd ODI: వర్షం మధ్యే టాస్.. న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన భారత్.! 40 ఓవర్లకు కుదింపు..
-
IPL 2027: అతడిని ఆల్‌రౌండర్‌గా అస్సలు అంగీకరించను.. భారత జట్టులో ఎలా అవకాశం వచ్చిందో?