మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐ-2 బ్రాంచ్ చోరీ కేసు సినిమాకథలా మారింది. బ్రాంచ్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్న రవీందర్‌నే అసలు సూత్రధారి అని పోలీసులు గుర్తించారు. బ్యాంక్‌లో పని చేస్తూ నమ్మకాన్ని తాకట్టు పెట్టి, డబ్బులపై కన్నేశారు.
సూర్యాపేట జిల్లాలో సంచలనం రేపే ఘటన వెలుగులోకి వచ్చింది. నడిగూడెం పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న కృష్ణంరాజుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు అయ్యింది. అందిన సమాచారం ప్రకారం, ఇప్పటికే నాలుగు వివాహాలు చేసుకున్న కృష్ణంరాజు, ఐదో పెళ్లికి కూడా సిద్ధమయ్యాడు.
KTR : హైదరాబాద్ టెక్ హబ్‌గా వేగంగా ఎదుగుతోన్న నేపథ్యంలో, అంతర్జాతీయ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్ఏఐ (OpenAI) తన కార్యకలాపాలను హైదరాబాద్‌లో ప్రారంభించాలని భారత రాష్ట్ర సమితి (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (K.T. Rama Rao) విజ్ఞప్తి చేశారు. తాజాగా ఓపెన్ఏఐ సీఈవో శామ్ అల్ట్మన్ (Sam Altman) భారత్‌లో ఆఫీస్ ఏర్పాటు చేయాలని ప్రకటించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ నెలలో భారత్ పర్యటనకు వస్తున్నట్లు కూడా ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ […]
హైదరాబాద్‌లో వరదలు, మురుగునీటి సమస్యలు, చెరువుల కబ్జాలు, పర్యావరణ సమస్యలు వంటి క్లిష్ట అంశాల పరిష్కారానికి ఒక ప్రత్యేక సంస్థ అవసరమని భావించిన ప్రభుత్వం, గత ఏడాది జూలైలో హైడ్రా (HYDRA) అనే ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసింది.
Sahasra M*rder Case : రాష్ట్రవ్యాప్తంగా సంచలన రేపిన 10 ఏళ్ల సహస్ర హత్య కేసులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ హత్య కేసులో పదో తరగతి చదువుతున్న బాలుడు హంతకుడిగా తేల్చిన పోలీసులు.. బ్యాట్ కోసం వెళ్లి ఈ ఘటనకు పాల్పడినట్లు విచారణలో తేల్చారు. అయితే.. ఇప్పటికే బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో బాలిక తల్లిదండ్రులు తమకు న్యాయం కావాలంటూ రోడ్డెక్కారు. తమ బంధువులతో కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు దిగారు. […]
Etela Rajender : మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు, సమస్యలను పరిష్కరించడానికి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తాజాగా రాష్ట్ర మంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సెక్రటేరియట్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసిన ఆయన సమస్యలపై వివరణాత్మక చర్చ నిర్వహించారు. అనంతరం ఈటల రాజేందర్ మాట్లాడుతూ, మల్కాజిగిరి ఎంపీ పరిధిలో పేదలకు కేటాయించాల్సిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో సమస్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. గతంలో తప్పిపోయిన పేదల జాబితాను మంత్రి […]
సీపీఐ రాష్ట్ర కార్యసంఘంలో మరోసారి కూనంనేని ఎన్నిక జరగడం మైదానంలో కలకలం రేపింది. కొత్తగూడెం శాసనసభ్యులు సాంబశివరావు రెండో సారి రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. రాష్ట్ర సహాయ కార్యదర్శులుగా తక్కెళ్ళపల్లి శ్రీనివాసరావు, ఇ.టి. నర్సింహా ను ఎంచుకున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో బీఆర్ఎస్ ఇంకా.. ఇంకా… ఇరుక్కుపోతోందా? పార్టీ డబుల్ స్టాండ్ తీసుకుంటోందన్న సంగతి ఆన్ రికార్డ్ తేలిపోతోందా? పైకి రాజకీయంగా ఒక మాట, లోపల కోర్ట్‌లో మరో మాట చెబుతోందా? మేడిగడ్డ పిల్లర్స్ కుంగుబాటు విషయంలో బీఆర్ఎస్ ఇన్నాళ్ళు బయట వాదించిందంతా ఉత్తుత్తిదేనా? అసలు విషయాన్ని కోర్ట్‌కు చెప్పేసినట్టేనా? ఇంతకీ కోర్ట్‌కు ఏం చెప్పింది గులాబీ పార్టీ? ఈ లోపల, బయట గేమ్ ఏంటి? తెలంగాణ పాలిటిక్స్‌లో కాళేశ్వరం ప్రకంపనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రాజెక్ట్ […]
మహబూబాబాద్ జిల్లాలో కుటుంబ కలహం దారుణానికి దారితీసిన ఘటన చోటుచేసుకుంది. భర్త ఆకలికన్నా టీవీ సీరియల్ ముఖ్యమా అని మందలించడంతో, భార్య మనస్థాపానికి గురై కుమారుడితో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన విషాదకర సంఘటన వెలుగుచూసింది.
ఓరుగల్లు పోరులో మంత్రి కొండా సురేఖ దంపతులకు మరోసారి చెయ్యి కాలిందా? లేనిపోని ఇగోలకు పోయి ఉన్న పరువు తీసుకుంటున్నారన్న మాటలు మరోసారి ఎందుకు వినిపిస్తున్నాయి. సొంత పార్టీలోని వాళ్ళతో పాటు ఇతర ప్రత్యర్థుల్ని ఎదుర్కోవడానికి వేసిన ఎత్తులు చిత్తయ్యాయా? తాజాగా ఏం జరిగింది? కొండా కపుల్ మళ్ళీ ఎందుకు చర్చనీయాంశం అయ్యారు?