స్లిమ్ బెజెల్స్, టూ-వే స్పీకర్లతో రాబోతున్న Xiaomi X Pro QLED (2026) 75 అంగుళాల టీవీ.. ఫీచర్స్ ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Xiaomi X Pro QLED (2026): భారత్‌లో షియోమీ (Xiaomi) సంస్థ మరో భారీ స్క్రీన్ మోడల్‌ను తీసుకురావడానికి రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే 43-అంగుళాలు, 55-అంగుళాలు, 65-అంగుళాల సైజుల్లో అందుబాటులో ఉన్న Xiaomi X Pro QLED (2025) సిరీస్‌కు కొనసాగింపుగా.. ఇప్పుడు కొత్త 75-అంగుళాల మోడల్ ను కంపెనీ ప్రకటించింది. తాజా సమాచారం ప్రకారం Xiaomi X Pro QLED (2026) 75-అంగుళాల టీవీ ఫిబ్రవరి 19న భారత్‌లో అధికారికంగా లాంచ్ కానుంది. ఇందుకు సంబంధించి కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఓ ప్రత్యేక మైక్రోసైట్ కూడా ఏర్పాటు చేసింది. భారత్‌లో షియోమీ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా అందుబాటులోకి తీసుకరానున్నారు.
MLA Arava Sridhar Controversy: ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం.. మరో వీడియో విడుదల చేసిన హర్షవీణ..
Also Read
- Samsung Galaxy F70 5G: సామ్ సంగ్ Galaxy F70 5G లాంచ్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, Super AMOLED డిస్‌ప్లే!
- Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
- Vivo V80 FE: వివో V80 FE త్వరలో భారత్‌లోకి? BIS సర్టిఫికేషన్‌లో గుర్తింపు.. 7500mAh బ్యాటరీ ఉండే ఛాన్స్!
- iPhone Duo: స్క్రీన్ పగిలితే రూ. 1.5 లక్షలు గోవిందా.. ‘ఐఫోన్ డ్యుయో’తో జర భద్రం!
రాబోయే 75-అంగుళాల మోడల్‌లో CineMagiQ, MaxMagiQ ఫీచర్లు ఉండనున్నట్లు కంపెనీ టీజ్ చేసింది. ఇవి గత ఏడాది మోడళ్లలో కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ టీవీ తక్కువ బెజెల్స్‌తో స్లీక్ డిజైన్‌లో రానుంది. రెండు వైపులా సౌండ్ విడుదల చేసే టూ-వే ఫైరింగ్ స్పీకర్ సెటప్ ఇందులో ఉండనుంది. టీవీ స్టాండ్‌తో వస్తుందని కంపెనీ పేర్కొంది. అలాగే వాల్ మౌంట్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉండే అవకాశముంది. అయితే పూర్తి స్పెసిఫికేషన్లు, ధర వివరాలు ఇంకా వెల్లడించలేదు. ఇదివరకువిడుదలైన Xiaomi X Pro QLED (2025) సిరీస్‌కు అప్డేటెడ్ మోడల్‌గా నిలవనుంది. 43-అంగుళాల మోడల్ ధర రూ. 31,999, 55-అంగుళాల మోడల్ రూ. 44,999, 65-అంగుళాల మోడల్ రూ. 64,999గా నిర్ణయించారు.
Off The Record: చుట్టూ ఉన్నవాళ్ల వల్లే ఆ ఎమ్మెల్యేకు సమస్యలు పెరుగుతున్నాయా?
గత ఏడాది మోడళ్లలో 4K (3,840×2,160 పిక్సెల్స్) రిజల్యూషన్, 178-డిగ్రీ వ్యూయింగ్ యాంగిల్, డాల్బీ విజన్, HDR10+ సపోర్ట్, 120Hz వరకు రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే షియోమీ సొంతంగా అభివృద్ధి చేసిన Vivid పిక్చర్ ఇంజిన్ 2, DLG (Dual Line Gate) టెక్నాలజీలను వినియోగించారు. 65 అంగుళాల ఫ్లాగ్‌షిప్ మోడల్‌లో 34W స్పీకర్ యూనిట్ ఉండి,షియోమీ సౌండ్, డాల్బీ ఆడియో, DTS:X, DTS Virtual: X టెక్నాలజీలకు సపోర్ట్ ఇచ్చింది. ఇది క్వాడ్-కోర్ A55 చిప్‌సెట్‌తో పాటు Mali-G52 MC1 GPU, 2GB RAM, 32GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వచ్చింది. MagiQ ఫీచర్ ద్వారా సహజమైన రంగులు, మెరుగైన విజువల్ అనుభవాన్ని అందించడమే కాకుండా “ఫిలింమేకర్ మోడ్” కూడా అందించింది. రానున్న 75-అంగుళాల Xiaomi X Pro QLED (2026) 75-inch TV మోడల్‌లో ఇంకా ఎలాంటి అప్‌గ్రేడ్లు ఉంటాయో తెలియాల్సి ఉంది. ధర, పూర్తి స్పెసిఫికేషన్లపై ఫిబ్రవరి 19న స్పష్టత రానుంది.
తాజావార్తలు
-
World Protests: ఫ్రాన్స్ నుంచి అమెరికా వరకు.. 8 దేశాల్లో నిరసనల సెగ.. కారణాలివే!
-
PM-VBRY Scheme 2026: తొలిసారి ఉద్యోగం చేసేవారికి రూ.15,000.. రెండో విడత డబ్బుల కోసం ఈ కోర్సు తప్పనిసరి!
-
Jailer 2: జస్ట్ 5 నిమిషాల క్యామియోకి రూ.25 కోట్లా?
-
Ramayana: సహ నిర్మాతగా ఉన్నందుకేనా? రణబీర్‌ను డామినేట్ చేస్తున్న యశ్!
-
JD Vance: వలసల్ని ప్రోత్సహించి అనుభవిస్తున్నారు.. ఫ్రాన్స్ అల్లర్లపై యూఎస్ ఉపాధ్యక్షుడు..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!