Unbelievable: ప్రాణ భయం పులిని కూడా పిల్లిని చేస్తుందంటారు. అలాగే, పిల్లిని పులిగా మారుస్తుందంటారు. కానీ, ఇక్కడ జరిగిన సంఘటన చూస్తే, భయం ఒక ఎద్దును ఏకంగా ఇంటి పైకి ఎక్కించింది.. ఈ విచిత్ర సంఘటన ఆదిలాబాద్ జిల్లా బోరజ్ మండలం, నిరాల గ్రామంలో జరిగింది. కుక్కల గుంపు వెంట పడటంతో భయపడిన ఒక ఎద్దు, ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగు పరుగున వెళ్లి ఒక ఇంటి పైకప్పు ఎక్కింది.
Supreme Court: రోగి మరణిస్తే.. డాక్టర్ బాధ్యత వహించడు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
నిరాల గ్రామంలోని ఓ ఇంట్లో నివాసితులు ఊహించని విధంగా పైకప్పుపై ఓ ఎద్దును చూసి ఆశ్చర్యపోయారు. ఈ విచిత్ర దృశ్యాన్ని చూసిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఎద్దును కుక్కలు తరిమాయని, భయంతో అది ఇంటి పైకప్పు ఎక్కిందని తెలుసుకుని మరింత ఆశ్చర్యపోయారు. సాధారణంగా, మేకలు, పిల్లులు, కుక్కలు వంటి జంతువులు చెట్లు, గుట్టలు ఎక్కడం చూస్తుంటాం. కానీ, ఒక ఎద్దు ఇంటి పైకి ఎక్కడం మాత్రం అరుదైన సంఘటన.
ఎద్దుని కిందకి దించడం కోసం నానా తంటాలు!
ఇంటి పైకప్పుపై ఎద్దు కూర్చున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే అసలు సమస్య అక్కడితో ఆగలేదు. దానిని కిందకు ఎలా దించాలో తెలియక స్థానికులు తలలు పట్టుకున్నారు. పైకప్పు బలహీనంగా ఉంటే, ఎద్దు బరువుకు కూలిపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందారు. చాలాసేపు శ్రమించిన తర్వాత, ఎట్టకేలకు ఆ ఎద్దు సురక్షితంగా కిందికి దిగింది.
ఈ సంఘటనను చూసి కొందరు “ప్రాణభయం అద్భుతాలు చేయిస్తుంది” అని వ్యాఖ్యానించారు. మరికొందరు మాత్రం, తమ పెంపుడు జంతువులను జాగ్రత్తగా చూసుకోవాలని, లేదంటే ఇలాంటి సంఘటనలు జరగవచ్చని హెచ్చరించారు. ఈ ఎద్దు ఎలా ఇంటి పైకి చేరిందో, కుక్కల భయం దానితో ఏమి చేయించిందో తెలియకపోయినా, ఈ దృశ్యం మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏది ఏమైనా, భయం అనేది ఎంత శక్తివంతమైనదో, అది మనకు ఎలాంటి ఆలోచనలు తెచ్చిపెడుతుందో ఈ సంఘటన నిరూపించింది.
Gowra Hari : ఫోన్ కంటిన్యూగా రింగ్ అవుతూనే ఉంది..జ్వరంతో రెస్ట్ మోడ్ లోకి వెళ్ళా !