Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Telangana Municipal Elections Counting Live Results Updates

TG Municipal Elections Live Updates: నేడే మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్.. మీ అభ్యర్థుల భవితవ్యం ఇక్కడ చూడండి..

Published Date :February 13, 2026 , 9:10 am
By RAMAKRISHNA KENCHE
TG Municipal Elections Live Updates: నేడే మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్.. మీ అభ్యర్థుల భవితవ్యం ఇక్కడ చూడండి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

TG Municipal Elections Live Updates: తెలంగాణలో పురపోరు తుది ఘట్టానికి చేరుకుంది. నేడు మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ షురూ అయ్యింది. 12,993 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. 3 నుంచి 8 రౌండ్లలో ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. 136 కౌంటింగ్ కేంద్రాల్లో మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. ప్రస్తుతం సాధారణ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. తుది ఫలితాలపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు, కార్యకర్తలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీవీలో పురపాలిక ఎన్నికల ఫలితాల లైవ్ అప్డెట్స్ మీకోసం..

The liveblog has ended.
  • 13 Feb 2026 07:34 PM (IST)

    భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం-సీఎం రేవంత్‌రెడ్డి

    మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అఖండ విజయం సాధించింది.. ఈ విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు ధన్యవాదాలు.. పార్టీ జెండా మోసి, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన కాంగ్రెస్‌ కార్యకర్తలకు ఈ విజయం అంకితం.. ఈ విజయం మా బాధ్యతను మరింత పెంచింది.. భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం-సీఎం రేవంత్‌రెడ్డి

  • 13 Feb 2026 06:23 PM (IST)

    ఇదే ఊపుతో రేపు GHMC ఎన్నికల్లోనూ గెలుస్తాం-కేటీఆర్

    మున్సిపల్‌ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాం.. మావాళ్లు చాలాచోట్ల వీరోచిత పోరాటం చేశారు.. చౌటుప్పల్‌లో అధికార దళాన్ని అడ్డంపెట్టుకొని గెలిచారు.. వర్ధన్నపేట, వికారాబాద్‌లో మా కౌన్సిలర్లను ఎత్తుకెళ్తున్నారు.. 15 చోట్ల సింగిల్‌ లార్జెస్ట్ పార్టీగా అవతరించబోతున్నాం.. కాంగ్రెస్‌, బీజేపీ కలిసి పనిచేశాయి.. కలిసొచ్చే లౌకిక పార్టీలను కలుపుకొని పోతాం.. మంచి భవిష్యత్‌ ఉందనడానికి ఈ ఫలితాలే నిదర్శనం.. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌ మాత్రమే.. ఇదే ఊపుతో రేపు GHMC ఎన్నికల్లోనూ గెలుస్తాం-కేటీఆర్

  • 13 Feb 2026 06:15 PM (IST)

    మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కౌంటింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత

    మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కౌంటింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ శ్రేణుల మధ్య గొడవ.. కౌంటింగ్‌ హాల్‌కు వచ్చి కూర్చున్న ఎమ్మెల్యే వినోద్.. అదే సమయంలో అక్కడికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.. మాజీ ఎమ్మెల్యేను పోలీసులు అడ్డుకోవడంతో రగడ.. ఇరు పార్టీల మధ్య వాగ్వాదం..

  • 13 Feb 2026 05:43 PM (IST)

    ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా రాలేదు. -బీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు

    మేం ప్రతిపక్షంగానే ఉంటాం కానీ, ఏ పార్టీకి సపోర్ట్‌ చేయం. మేం బీఆర్‌ఎస్‌కు దగ్గరగా వచ్చాం. ఓటు శాతం పెరిగింది, వార్డులు కూడా గెలిచాం. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ కలిసి బీజేపీని అడ్డుకున్నాయి. నిజామాబాద్‌, కరీంనగర్‌ కార్పొరేషన్‌లను కైవసం చేసుకోబోతున్నాం. ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా రాలేదు. -బీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు

  • 13 Feb 2026 05:14 PM (IST)

    మావాళ్లు చాలాచోట్ల వీరోచితం పోరాటం చేశారు. -కేటీఆర్‌

    మున్సిపల్‌ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాం. మున్సిపాలిటీల్లో 740లకు పైగా స్థానాలు గెలుచుకోబోతున్నాం. గద్వాల్లో అధికారులను అడ్డంపెట్టుకొని గెలిచారు. గద్వాలలో నాలుగుసార్లు రీకౌంటింగ్‌ చేసి చివరికి ఒక్క ఓటుతో గెలిచామని చెప్పుకున్నారు. మావాళ్లు చాలాచోట్ల వీరోచితం పోరాటం చేశారు. -కేటీఆర్‌

  • 13 Feb 2026 04:54 PM (IST)

    నల్గొండ కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌ విక్టరీ

    నల్గొండ కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌ విక్టరీ.. మొత్తం 48 డివిజన్లకు 27 గెలిచిన కాంగ్రెస్‌.. బీఆర్ఎస్‌-9, బీజేపీ-4, AIFB-4, మజ్లిస్-2, స్వతంత్రులు- 2

  • 13 Feb 2026 04:37 PM (IST)

    కార్యకర్తలు గెలుపే లక్ష్యంగా శ్రమించారు. -భట్టి విక్రమార్క

    మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయంపై స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి. ప్రజాపాలనకు ప్రజలు పట్టం కట్టారు. ప్రభుత్వంపై నమ్మకం, విశ్వాసం ఆదరణగా మారింది. కార్యకర్తలు గెలుపే లక్ష్యంగా శ్రమించారు. -భట్టి విక్రమార్క

  • 13 Feb 2026 04:36 PM (IST)

    ప్రియాంక గాంధీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ

    ఢిల్లీ: ప్రియాంక గాంధీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ. మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపుపై సీఎం రేవంత్‌కు ప్రియాంక గాంధీ అభినందనలు.

  • 13 Feb 2026 04:26 PM (IST)

    కోహిర్‌ (16): కాంగ్రెస్‌ 8, బీఆర్‌ఎస్‌ 5, బీజేపీ 1, ఇండిపెండెంట్‌ 1, MIM 1. ఇంద్రేశం (18): బీఆర్‌ఎస్‌ 9, కాంగ్రెస్‌ 6, బీజేపీ 2, ఇండిపెండెంట్‌ 1.

  • 13 Feb 2026 04:04 PM (IST)

    116 మున్సిపాలిటీల్లో 90 స్థానాల్లో కాంగ్రెస్‌ పాగా

    మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జోరు.. 116 మున్సిపాలిటీల్లో 90 స్థానాల్లో కాంగ్రెస్‌ పాగా.. 12 మున్సిపాలిటీలకే పరిమితమైన బీఆర్ఎస్‌.. 12 మున్సిపాలిటీల్లో హంగ్.. ఒకే మున్సిపాలిటీకి పరిమితమైన బీజేపీ.. నారాయణపేట మున్సిపాలిటీలో బీజేపీకి అత్యధిక వార్డులు.. భైంసాలో అత్యధిక వార్డులు గెలిచిన ఎంఐఎం

  • 13 Feb 2026 04:01 PM (IST)

    మహబూబాబాద్‌ మున్సిపాలిటీపై కన్నేసిన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌.

    మహబూబాబాద్‌ మున్సిపాలిటీపై కన్నేసిన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌. 36 వార్డులలో కాంగ్రెస్‌ 12, BRS 13, సీపీఎం 3, సీపీఐ 3, స్వతంత్రులు 4. స్వతంత్ర అభ్యర్థుల మద్దతుల కోసం కాంగ్రెస్‌, BRS ముమ్మర ప్రయత్నాలు. స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కోసం కాంగ్రెస్‌, BRS ముమ్మర ప్రయత్నాలు. స్వతంత్ర అభ్యర్థులను బుజ్జగిస్తున్న ఇరు పార్టీల నేతలు. కౌంటింగ్‌ సెంటర్‌ వద్ద పోటాపోటీగా నినాదాలు. స్వతంత్ర అభ్యర్థులను క్యాంపుకు తరలించేందుకు ఇరు పార్టీలు ప్రయత్నం.

  • 13 Feb 2026 03:54 PM (IST)

    ఆలేరు మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం

    యాదాద్రి: ఆలేరు మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం. ఆలేరు (12): కాంగ్రెస్‌ 7, బీఆర్‌ఎస్‌ 3, బీజేపీ 2. మోత్కురు (12): కాంగ్రెస్‌ 8, బీఆర్‌ఎస్‌ 3, ఇండిపెండెంట్‌ 1. యాదగిరిగుట్ట (12): కాంగ్రెస్‌ 8, బీజేపీ 2, బీఆర్‌ఎస్‌ 1, సీపీఐ 1.

  • 13 Feb 2026 03:37 PM (IST)

    ఇస్నాపూర్‌లో తీవ్ర ఉద్రిక్తత..

    సంగారెడ్డి: ఇస్నాపూర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. మున్సిపల్‌ పీఠం కోసం కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీలకు దక్కని మ్యాజిక్‌ ఫిగర్.. మొత్తం 26 వార్డుల్లో కాంగ్రెస్‌ 10, బీఆర్ఎస్‌ 12, స్వతంత్ర అభ్యర్థులు 4 స్థానాల్లో గెలుపు.. మ్యాజిక్‌ ఫిగర్‌ కోసం 2 సీట్ల దూరంలో బీఆర్ఎస్‌, 4 సీట్ల దూరంలో కాంగ్రెస్‌.. స్వతంత్ర అభ్యర్థులను కౌంటింగ్‌ సెంటర్‌ నుంచి క్యాంపులకు తరలించేందుకు రెండు పార్టీల యత్నం

  • 13 Feb 2026 03:33 PM (IST)

    కొత్తగూడెం కార్పొరేషన్‌ సీపీఐ కైవసం

    కొత్తగూడెం కార్పొరేషన్‌ సీపీఐ కైవసం. కొత్తగూడెం (47): సీపీఐ 25, కాంగ్రెస్‌ 25, బీఆర్‌ఎస్‌ 4, బీజేపీ 1, సీపీఎం 1, ఇండిపెండెంట్‌ 2.

  • 13 Feb 2026 03:27 PM (IST)

    మెదక్‌ మున్సిపాలిటీలో హంగ్‌

    మెదక్‌ మున్సిపాలిటీలో హంగ్‌. 32 వార్డుల్లో BRS 15, కాంగ్రెస్‌ 14, బీజేపీ 2, బీఎస్పీ 1. మున్సిపల్‌ చైర్మన్‌ కోసం కీలకంగా మారనున్న BJP, BSP పార్టీలు.

  • 13 Feb 2026 02:34 PM (IST)

    కరీంనగర్‌ కార్పొరేషన్‌లో బీజేపీ దూకుడు..

    కరీంనగర్‌ కార్పొరేషన్‌లో బీజేపీ దూకుడు.. కరీంనగర్‌లో మొత్తం 66 డివిజన్లు.. బీజేపీ-23, కాంగ్రెస్-14, మజ్లిస్-5, బీఆర్ఎస్-4, ఇతరులు-4

  • 13 Feb 2026 02:23 PM (IST)

    మున్సిపాలిటీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కూతురు గెలుపు..

    వికారాబాద్ మున్సిపాలిటీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కూతురు 17 వార్డు గడ్డం అనన్య భారీ మెజారిటీతో గెలుపు.

  • 13 Feb 2026 02:23 PM (IST)

    సంగారెడ్డి: భార్య ఓటమి తట్టుకోలేక భర్తకి అస్వస్థత..

    సంగారెడ్డి: భార్య ఓటమి తట్టుకోలేక భర్తకి అస్వస్థత.. ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఘటన.. 16వ వార్డులో BRS అభ్యర్థి విజయలక్ష్మి ఓడిపోవడంతో కావడంతో భర్త వెంకట్ రెడ్డికి తీవ్ర అస్వస్థత.. స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చేయించి మెరుగైన చికిత్స కోసం హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు

  • 13 Feb 2026 02:20 PM (IST)

    ఆసిఫాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నేతలకు చుక్కెదురు..

    ఆసిఫాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నేతలకు చుక్కెదురు.. పార్టీ టికెట్ ఇవ్వకపోవడం తో ఇండిపెండెంట్ గా బరిలో దిగిన కామ్రే లక్ష్మీ.. ఆమె 6 ఓట్లతో గెలవడంతో మచ్చిక చేసుకునేందుకు వెళ్లిన కాంగ్రెస్ నాయకులు.. టికెట్ ఇవ్వలేదు.. ఇప్పుడు ఎందుకు వచ్చారని నిలదీత

  • 13 Feb 2026 02:19 PM (IST)

    వంద శాతం వెబ్ కాస్టింగ్ మంచి పరిణామం :నీలం సాహని

    వంద శాతం వెబ్ కాస్టింగ్ మంచి పరిణామం.. తెలంగాణ ఎలక్షన్ విధానాన్ని పరిశీలించాను.. ఇక్కడ అమలు చేసిన పలు టెక్నాలజీ ఏపీలో ఇంప్లిమెంట్ చేస్తాం.. ఏపీలో పొలిటికల్ వైలేషన్ ఎక్కువ కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటాం.. రాష్ట్ర వ్యాప్తంగా కౌటింగ్ ప్రశాంతంగా జరుగుతుంది.. ఎక్కడా ఎలాంటి సమస్యలు మా దృష్టికి రాలేదు.. సాయంత్రానికి పూర్తి ఫలితాలు విడుదల అవుతాయి.. బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు నేషనల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయించింది..16వ తేదీ మేయర్, చేర్మెన్ ఎన్నిక ఉంటుంది. మేయర్, చైర్మెన్ ఎన్నికలు టై అయితే లాటరీ విధానం అమలు చేస్తారు..: నీలం సాహని, ఏపీ SEC చీఫ్

  • 13 Feb 2026 02:09 PM (IST)

    మహబూబాబాద్ జిల్లా: కౌటింగ్ సెంటర్ వద్ద ఉద్రిక్తత...

    మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ కౌంటింగ్ సెంటర్ వద్ద బీఆర్ఎస్- కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ.. మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గో బ్యాక్ అంటూ కాంగ్రెసు కార్యకర్తల ఆందోళన.. కౌంటింగ్ సెంటర్ లోకి మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ లోపలికి ఎలా పంపించారంటూ పోలీసులతో వాగ్వివాదం.. 4 వార్డు ఇండిపెండెంట్ ఆభ్యర్థి గుగులోత్ జ్యోతి రమేష్ 135 ఓట్ల తో గెలుపు.. జ్యోతి రమేష్ ను క్యాంపునకు తరలించడానికి మంతనాలు, క్యాంపునకి ప్రయత్నం చేసిన మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్.. పోలీసుల రంగ ప్రవేశం.. ఆభ్యర్థిని కౌంటింగ్ హలోకి పంపిన పోలీసులు.. మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కారు ముందు కాంగ్రెస్ కార్యకర్తల నిరసన.. కౌటింగ్ సెంటర్ వద్ద ఉద్రిక్తత...

  • 13 Feb 2026 01:54 PM (IST)

    తెలంగాణలో ఇప్పటి వరకు 15 మున్సిపాలిటీల్లో హంగ్..

    తెలంగాణలో ఇప్పటి వరకు 15 మున్సిపాలిటీల్లో హంగ్‌.. జిన్నారం, జమ్మికుంట, ఆసిఫాబాద్, కోహీర్, అలంపూర్, జనగామ, ఇస్నాపూర్‌, జహీరాబాద్‌, కేసముద్రం, దేవరకద్ర, అమరచింత, అలియాబాద్‌, గద్వాల్‌లో హంగ్.. కీలకం కానున్న స్వతంత్ర అభ్యర్థులు.. ఎక్స్ఆఫీషియో ఓట్లతో మున్సిపాలిటీలను కైవసం చేసుకోనున్న కాంగ్రెస్.. హంగ్ దిశగా బెల్లంపల్లి మున్సిపాలిటీ..

  • 13 Feb 2026 01:47 PM (IST)

    మెదక్: ఉత్కంఠ రేపుతున్న నర్సాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు

    మొత్తం 15 వార్డుల్లో 14 వార్డులకు వచ్చిన ఫలితాలు

    కాంగ్రెస్ 6, BRS 4, BJP 4 స్థానాల్లో విజయం

    ఓ వార్డులో కాంగ్రెస్, BRS అభ్యర్థులకు సమాన ఓట్లు రావడంతో రీ కౌంటింగ్ చేస్తున్న అధికారులు

  • 13 Feb 2026 01:46 PM (IST)

    మెదక్ జిల్లాలో 4 మున్సిపాలిటీల ఎన్నికల ఫలితాలు

    మెదక్ జిల్లాలో 4 మున్సిపాలిటీల ఎన్నికల ఫలితాలు

    1.మెదక్(22/32)
    CONG-09
    BRS-11
    BJP-01
    BSP-01

    2.రామయంపేట(12/12)
    CONG-08
    BRS-03
    BJP-01

    3.నర్సాపూర్-(12/15)
    BRS-03
    CONG-04
    BJP-04
    IND-01

    4.తూప్రాన్(12/16)
    BRS-06
    CONG-03
    BJP-03

  • 13 Feb 2026 01:43 PM (IST)

    ఉమ్మడి ఆదిలాబాద్‌లో..

    ఆదిలాబాద్ (20/ 49 )
    కాంగ్రెస్ - 03
    బీఆర్ఎస్ - 03
    బీజేపీ - 09
    Mim.1
    స్వతంత్రులు - 04

    మంచిర్యాల కార్పోరేషన్ ( 60 )
    కాంగ్రెస్ - 06
    బీఆర్ఎస్ - 01
    బీజేపీ - 00
    స్వతంత్రులు - 00

    లక్షేట్టిపేట - 15
    కాంగ్రెస్ - 08
    బీఆర్ఎస్ - 01
    బీజేపీ - 01
    స్వతంత్రులు -

    చెన్నూర్ - 18
    కాంగ్రెస్ - 11
    బీఆర్ఎస్ - 04
    బీజేపీ - 02
    స్వతంత్రులు - 01

    బెల్లంపల్లి 34
    కాంగ్రెస్ - 08
    బీఆర్ఎస్ - 08
    బీజేపీ - 00
    స్వతంత్రులు - 01

    క్యాతన్ పల్లి 22
    కాంగ్రెస్ - 07
    బీఆర్ఎస్ - 10
    బీజేపీ - 01
    స్వతంత్రులు - 04

    నిర్మల్ జిల్లా
    నిర్మల్ 42
    కాంగ్రెస్ - 11
    బీఆర్ఎస్ - 02
    బీజేపీ - 06
    స్వతంత్రులు - 02

  • 13 Feb 2026 01:30 PM (IST)

    ధర్మపురి మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ క్వీన్ స్లీప్...

    ధర్మపురి మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ క్వీన్ స్లీప్...

    ధర్మపురి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కైవసం

    మున్సిపల్ చైర్మన్ పదవి జనరల్ మహిళకు కేటాయింపు

    మొత్తం వార్డులు ...15

    15 వార్డులకు 15 వార్డుల కాంగ్రెస్ పార్టీ గెలుపు

    కాంగ్రెస్............15
    బీఆర్ఎస్.........0
    బిజెపి..............0
    ఇండిపెండెంట్...0

  • 13 Feb 2026 01:23 PM (IST)

    తెలంగాణలో ఖాతా తెరిచిన జనసేన..

    సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో జనసేన అభ్యర్థి విజయం సాధించారు. మొత్తం 15 స్థానాలకు గానూ 9 వార్డుల్లో కాంగ్రెస్‌, 5 వార్డుల్లో బీఆర్‌ఎస్‌ గెలుపొందగా, ఒక వార్డును జనసేన దక్కించుకుంది.

  • 13 Feb 2026 01:07 PM (IST)

    కామారెడ్డి: ఫలితాల పై ఉత్కంఠ

    కామారెడ్డి: మొత్తం 49 వార్డులకు కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.. 12 వార్డుల్లో కాంగ్రెస్ విజయం.. 12 వార్డుల్లో బీజేపీ గెలుపు.. 6 వార్డుల్లో టిఆర్ఎస్ అభ్యర్థుల విజయం.. రెండు వార్డుల్లో స్వతంత్రుల గెలుపు.. ఇంకా 7 వార్డుల ఫలితాల కోసం కొనసాగుతున్న లెక్కింపు.. ఫలితాల పై ఉత్కంఠ.. కీలకం కానున్న స్వతంత్రులు

  • 13 Feb 2026 01:06 PM (IST)

    కరీంనగర్: కార్పొరేషన్‌లోని 56 డివిజన్‌లో బీజేపీ విజయం..

    కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని 56 డివిజన్‌లో బీజేపీ విజయం.. 65 డివిజన్ లో ఎంఐఎం అభ్యర్థి మోసిన్ విజయం.. 42వ డివిజన్‌లో మాజీ మేయర్ బీజేపీ అభ్యర్థి సునీల్ రావు విజయం..

  • 13 Feb 2026 01:05 PM (IST)

    కేసముద్రం మున్సిపాలిటీపై బీఆర్ఎస్ ఫోకస్..

    కేసముద్రం మున్సిపాలిటీపై బీఆర్ఎస్ ఫోకస్.. బీఆర్ఎస్ కార్పొరేటర్లను క్యాంప్‌నకు తరలింపు.. మరో మూడు ఎక్స్‌ఆఫీషియో ఓట్లు నమోదుకు బీఆర్ఎస్ వ్యూహం.. ఎమ్మెల్సీలు పోచంపల్లి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, ఎంపీ గాయత్రి రవి ఎక్స్‌ఆఫీషియో ఓట్లు నమోదు చేయాలని నిర్ణయం.. దాంతో కేసముద్రంలో 11కు పెరగనున్న బీఆర్ఎస్ బలం

  • 13 Feb 2026 12:55 PM (IST)

    కరీంనగర్ జిల్లా: చొప్పదండిలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం..

    కరీంనగర్ జిల్లా: చొప్పదండి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం.. చొప్పదండి మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు ప్రజల స్పష్టమైన మద్దతు.. రేవంత్ రెడ్డి పై విశ్వాసంతో ప్రజల తీర్పు.. ఈ గెలుపుతో మా బాధ్యత మరింత పెరిగింది: మేడిపల్లి సత్యం

  • 13 Feb 2026 12:44 PM (IST)

    కవిత ఖాతాలో ఓ మున్సిపాలిటీ..

    తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే చాలా మున్సిపాలిటీల ఫలితాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఖాతాలో ఒక మున్సిపాలిటీ చేరింది. జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్(AIFB) పార్టీ ఘన విజయం సాధించింది. ఏఐఎఫ్‌బీ తరఫున పోటీ చేసిన కీలక అభ్యర్థి శ్రీను గత నెల రోజుల కింద మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధినేత్రి కవిత వెంట ఉన్నారు. ఆమెతో కలిసి పని చేశారు. అయితే.. వడ్డేపల్లి మున్సిపాలిటీలో మొత్తం 10 వార్డులకు గానూ.. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ 8 గెలుచుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఒక్కో సీటు లభించింది. బీజేపీ, జనసేనకు మాత్రం ఒక్క సీటు కూడా రాలేదు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేసిన కవిత మద్దతుదారులు 8 వార్డులను కైవసం చేసుకోవడంతో ఆమె అకౌంట్‌లో ఒక మున్సిపాలిటీ చేరింది. ముందుగానే కవిత తమ పార్టీకి చెందిన అభ్యర్థులు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరుపున పోటీ చేస్తారని కవిత ప్రకటించారు.

  • 13 Feb 2026 12:26 PM (IST)

    ఇబ్రహీంపట్నం:

    1వ వార్డు బీజేపీ అభ్యర్థి ముత్యాల శ్యామల 17 ఓట్ల మెజారిటీ తో విజయం..

    2వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి నీళ్ల బాను బాబు 83 ఓట్ల మెజారిటీ..

    3వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థి దాసరి మురళి కృష్ణ 86 ఓట్ల మెజారిటీ తో గెలుపు..

    4 వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి కొండ్రు ప్రవీణ్ 13 ఓట్ల మెజారిటీ తో విజయం..

    5వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి జెర్కొని మమత రాజు 58 ఓట్ల మెజారిటీ తో విజయం..

    6వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి అమీనా బేగం 265 ఓట్ల మెజారిటీ తో విజయం..

    7వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి టేకుల సుదర్శన్ రెడ్డి 2 ఓట్ల మెజారిటీ తో విజయం..

    8వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి వర్త్య రాందాస్ 217 ఓట్ల మెజారిటీ తో విజయం..

    9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి దారు రాఘవేందర్ రావు 11 ఓట్ల మెజారిటీ తో విజయం..

    10వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి దొంతరమోని భార్గవి 393 ఓట్ల మెజారిటీ తో విజయం..

    11వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి కొండ్రు శ్రీలత 283 ఓట్ల మెజారిటీ తో విజయం..

    12వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి త్రిలోక్ కొండిగారి త్రిలోక్ కుమార్ 100 ఓట్ల మెజారిటీతో విజయం..

    13వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ఇందూరి శ్రీనివాస్ 271 ఓట్ల మెజారిటీ తో విజయం..

    14వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ఎద్దుల విజయ లక్ష్మి 25 ఓట్ల మెజారిటీ తో విజయం..

    15వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి క్యామా శంకర్ 102 ఓట్ల మెజారిటీ తో విజయం..

    16వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి అలవాల జ్యోతి 348 ఓట్ల మెజారిటీ తో విజయం..

    17వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి మడుపు లక్ష్మమ్మ 72 ఓట్ల మెజారిటీ విజయం..

    18వ వార్డు బీజేపీ అభ్యర్థి సిద్ధం భాను ప్రియా 183 ఓట్ల మెజారిటీ తో విజయం..

    19వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి ఆకుల యాదగిరి విజయం..

    20వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి మంద జయ విజయం..

    21వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి బుగ్గ రాములు 124 ఓట్ల మెజారిటీ తో విజయం..

    22వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కప్పరి స్రవంతి 46 ఓట్ల మెజారిటీ తో విజయం..

    23వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి నీలం శ్వేత 12 ఓట్ల మెజారిటీ విజయం..

    24వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి గూడూరు గిరీష్ 76 ఓట్ల మెజారిటీ తో విజయం..

  • 13 Feb 2026 12:25 PM (IST)

    ఆసిఫాబాద్ స్వల్ప ఉద్రిక్తత..

    కొమురం భీం జిల్లా: ఆసిఫాబాద్ స్వల్ప ఉద్రిక్తత.. స్వతంత్ర అభ్యర్థిని ఆటోలో తీసుకెళ్ళే ప్రయత్న చేసిన కాంగ్రెస్.. ఆడుకున్న బీఆర్ఎస్ నాయకులు.. ఆసిఫాబాద్ మున్సిపాలిటీ 1వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి వినోద్ 78 ఓట్ల తేడాతో BRS పై విజయం.. ఫలితాల అనంతరం స్వతంత్ర అభ్యర్థిని కాంగ్రెస్ నేతలు బలవంతంగా ఆటోలో ఎక్కించి రహస్య ప్రాంతానికి తరలించే ప్రయత్నం.. బీఆర్ఎస్ నేతలు అడ్డుకోవడంతో స్వల్ప వాగ్వాదం.. రెండు పార్టీల పెనుగులాటల మధ్య తప్పించుకుని వెళ్లిపోయిన స్వతంత్ర అభ్యర్థి.. మున్సిపల్ పీఠం దక్కించుకునే క్రమంలో స్వతంత్రులపై పార్టీలు ఇలా ఒత్తిడి చేయడం చర్చనీయాంశమైంది..

  • 13 Feb 2026 12:23 PM (IST)

    జనగామ: స్వతంత్ర అభ్యర్థులతో మొదలైన మంతనాలు

    జనగామ మున్సిపల్ ఫలితాల్లో కీలకంగా మారుతున్న స్వతంత్ర అభ్యర్థులు.. జనగామ మున్సిపాలిటీలో 30 వార్డుల స్వతంత్ర అభ్యర్థులతో మొదలైన మంతనాలు

    కాంగ్రెస్_12
    BRS _13
    బీజేపీ_00
    CPM _01
    స్వతంత్రులు_04

  • 13 Feb 2026 12:19 PM (IST)

    జోగులాంబ గద్వాల జిల్లా: అలంపూరు నియోజకవర్గంలో మూడు మున్సిపాలిటీల ఫలితాలు..

    జోగులాంబ గద్వాల జిల్లా: అలంపూరు నియోజకవర్గంలో మూడు మున్సిపాలిటీల ఫలితాలు..

    1)మునిసిపాలిటీ పేరు: అయిజ
    మొత్తం వార్డుల సంఖ్య :20
    కాంగ్రెస్ :7
    బిఆర్ఎస్ :13
    బిజెపి :0
    ఫార్వర్డ్ బ్లాక్ :0
    జనసేన :0
    ఇండిపెండెంట్..0

    2)మునిసిపాలిటీ పేరు: వడ్డేపల్లి
    మొత్తం వార్డుల సంఖ్య :10
    కాంగ్రెస్ :1
    బిఆర్ఎస్ :1
    బిజెపి :0
    ఫార్వర్డ్ బ్లాక్ :8
    జనసేన :0
    ఇండిపెండెంట్..0

    3)మునిసిపాలిటీ పేరు: అలంపూరు
    మొత్తం వార్డుల సంఖ్య :10
    కాంగ్రెస్ :5
    బిఆర్ఎస్ :5
    బిజెపి :0
    ఫార్వర్డ్ బ్లాక్ :0
    జనసేన :0
    ఇండిపెండెంట్..0.. అలంపూరు మున్సిపాలిటీలో చెరో 5 స్థానాలు గెలుచుకున్న బిఆర్ఎస్ కాంగ్రెస్..

  • 13 Feb 2026 12:18 PM (IST)

    ఇప్పటి వరకు 1000+ వార్డుల్లో ఫలితాలు ఏ పార్టీకి ఎన్నంటే..?

    నగర, పురపాలిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 116 మున్సిపాలిటీల్లోని 1000కి పైగా వార్డుల్లో ఫలితాలు వెలువడ్డాయి.
    వీటిలో కాంగ్రెస్‌ 580+, బీఆర్‌ఎస్‌ 300+, భాజపా 80+ స్థానాల్లో నెగ్గాయి. ఇతరులు 80కి పైగా వార్డుల్లో గెలుపొందారు. మొత్తం వార్డులు 2,582 కాగా, ఇప్పటి వరకు ప్రకటించినవి 1,280.

    కాంగ్రెస్: 695
    బీఆర్ఎస్: 376
    బీజేపీ: 105
    ఇతరులు: 104 గెలిచారు.

  • 13 Feb 2026 12:18 PM (IST)

    టీపీసీసీ చీఫ్ సొంత మండలం భీంగల్..

    టీపీసీసీ చీఫ్ సొంత మండలం భీంగల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం

  • 13 Feb 2026 12:17 PM (IST)

    గాంధీ భవన్‌లో మొదలైన సంబరాలు..

    గాంధీ భవన్‌లో మొదలైన సంబరాలు.. స్వీట్లు పంచుకున్న వీహెచ్.. ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయి.. కాంగ్రెస్ నేతలు.. కార్యకర్తలు

  • 13 Feb 2026 12:16 PM (IST)

    వనపర్తి జిల్లా: అమరచింత మున్సిపాలిటీలో ముగిసిన కౌంటింగ్ ప్రక్రియ

    వనపర్తి జిల్లా: అమరచింత మున్సిపాలిటీలో ముగిసిన కౌంటింగ్ ప్రక్రియ

    1)BRS గెలుపు
    2),BRS గెలుపు
    3),BRS గెలుపు
    4), కాంగ్రెస్ గెలుపు
    5), కాంగ్రెస్ గెలుపు
    6), కాంగ్రెస్ గెలుపు
    7), సిపిఎం గెలుపు
    8), బిజెపి గెలుపు
    9), బిజెపి గెలుపు
    10), బిజెపి గెలుపు

  • 13 Feb 2026 12:13 PM (IST)

    కొనసాగుతున్న తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్..

    కొనసాగుతున్న తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్.. దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటివరకూ విడుదలైన ఫలితాలు ఇలా ఉన్నాయి:

    కాంగ్రెస్‌: అశ్వారావుపేట, నారాయణ ఖేడ్‌, స్టేషన్‌ ఘన్‌పూర్‌, నేరేడు చర్ల, హుజూర్‌నగర్‌, హాలియా, నందికొండ, చండూరు, భూత్పూర్‌, ధర్మపురి, భీంగల్‌, బిచ్కుంద, బాన్సువాడ, ఎల్లారెడ్డి, చొప్పదండి, సుల్తానాబాద్, మంథని, మరిపెడ, డోర్నకల్‌,

    బీఆర్‌ఎస్‌: అయిజ, తొర్రూర్‌, గడ్డపోతారం, ఇంద్రేశం,

    ఆల్ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ: వడ్డేపల్లి

    హంగ్‌ ఫలితాలు: కోహీర్‌, కేసముద్రం, దేవరకద్ర, అలంపూర్‌,

  • 13 Feb 2026 11:57 AM (IST)

    ఇప్పటి వరకు ప్రకటించిన ఫలితాలు మున్సిపాలిటీ వారీగా..

    ఇప్పటి వరకు ప్రకటించిన ఫలితాలు మున్సిపాలిటీ వారీగా ఇలా ఉన్నాయి.

    నందికొండ మున్సిపాలిటీ – కాంగ్రెస్ ఘన విజయం
    నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ సునామీ సృష్టించింది. మొత్తం 12 వార్డుల్లో 11 వార్డులను గెలుచుకుని స్పష్టమైన ఆధిక్యం సాధించింది. ఇది ఆ జిల్లాలో కాంగ్రెస్‌కు భారీ బూస్ట్‌గా మారింది.

    గడ్డపోతారం మున్సిపాలిటీ – బీఆర్‌ఎస్‌ ఆధిపత్యం
    సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్‌ గులాబీ జెండా ఎగిరింది. 18 వార్డులకు జరిగిన ఎన్నికల్లో 14 వార్డులను కైవసం చేసుకుని పూర్తి ఆధిపత్యాన్ని చాటింది. కాంగ్రెస్‌ 3, ఇతరులు 1 స్థానంలో గెలుపొందారు.

    తొర్రూరు (మహబూబాబాద్) – బీఆర్‌ఎస్‌ విజయం
    మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్‌ 16 వార్డుల్లో 9 స్థానాలు దక్కించుకుని విజయాన్ని సాధించింది. కాంగ్రెస్‌ 6 వార్డుల్లో గెలుపొందింది.

    దేవరకద్ర – నో మ్యాజిక్ ఫిగర్
    మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో హంగ్ పరిస్థితి నెలకొంది. 12 వార్డుల్లో కాంగ్రెస్‌ 6, బీఆర్‌ఎస్‌ 4, బీజేపీ 1, ఇతరులు 1 గెలవడంతో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. చైర్మన్ ఎన్నిక ఆసక్తికరంగా మారనుంది.

    నేరేడుచర్ల – కాంగ్రెస్ జయకేతనం
    సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ 15లో 9 వార్డులను గెలుచుకుని మున్సిపాలిటీని దక్కించుకుంది. బీఆర్‌ఎస్‌ 5, ఇతరులు 1 స్థానంలో గెలిచారు.

    కోహీర్ మున్సిపాలిటీ – పోటీ సమతుల్యం
    సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో కాంగ్రెస్‌ 16లో 8 వార్డులను గెలుచుకుంది. బీఆర్‌ఎస్‌ 5 స్థానాలు దక్కించుకోగా, బీజేపీ, ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థి ఒక్కో వార్డు గెలుచుకున్నారు.

    అయిజ – బీఆర్‌ఎస్‌ సత్తా
    జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్‌ 20లో 13 వార్డులు గెలుచుకుని స్పష్టమైన మెజార్టీ సాధించింది. కాంగ్రెస్‌ 7 స్థానాల్లో విజయం సాధించింది.

    మరిపెడ – కాంగ్రెస్ ఆధిపత్యం
    మహబూబాబాద్ జిల్లా మరిపెడలో కాంగ్రెస్‌ 15లో 8 వార్డులు గెలిచి మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. బీఆర్‌ఎస్‌ 6, ఇతరులు 1 స్థానంలో విజయం సాధించారు.

    సుల్తానాబాద్ – కాంగ్రెస్ పైచేయి
    పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో కాంగ్రెస్‌ 15లో 12 వార్డులు గెలుచుకుని ఘన విజయం సాధించింది. బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఇతరులు ఒక్కో స్థానాన్ని దక్కించుకున్నారు.

    డోర్నకల్ – హస్తం జయభేరి
    మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లో కాంగ్రెస్‌ 15లో 11 వార్డులు గెలుచుకుని స్పష్టమైన ఆధిక్యం సాధించింది. బీఆర్‌ఎస్‌ 4 స్థానాలు గెలిచింది.

    హాలియా – కాంగ్రెస్ హవా
    నల్గొండ జిల్లా హాలియాలో కాంగ్రెస్‌ 12లో 8 వార్డులు గెలుచుకుని మున్సిపాలిటీని దక్కించుకుంది. ఇంకా కొన్ని స్థానాల లెక్కింపు కొనసాగుతోంది.

    అశ్వారావుపేట – కాంగ్రెస్ భారీ విజయం
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ 22లో 17 వార్డులను గెలుచుకుని ఘన విజయం సాధించింది. బీఆర్‌ఎస్‌ 2, బీజేపీ 1 స్థానాలు దక్కించుకున్నాయి.

  • 13 Feb 2026 11:22 AM (IST)

    కామారెడ్డి : మున్సిపాలిటీ లో బోణీ కొట్టిన కాంగ్రెస్ , బీజేపీ

    కామారెడ్డి : మున్సిపాలిటీ లో బోణీ కొట్టిన కాంగ్రెస్ , బీజేపీ.. 34 వ వార్డులో బీజేపీ అభ్యర్థి సుజాత గెలుపు.. 32వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి అఖిల విజయం.. 31వ వార్డులో బీఆర్ఎస్ గెలుపు

  • 13 Feb 2026 11:20 AM (IST)

    మేడ్చల్ జిల్లా లో BRS హవా

    మేడ్చల్ జిల్లా లో BRS హవా

    మూడు మున్సిపాలిటీల్లో మొత్తం 68 వార్డులు..

    29 వార్డుల్లో వెలువడిన ఫలితాలు

    మూడు మున్సిపాలిటీల్లో 19 స్థానాల్లో గెలిచిన BRS

    7 స్థానాల్లో కాంగ్రెస్

    రెండు స్థానాల్లో బీజేపీ

    ఒక ఇండిపెండెంట్ విజయం

    ఎల్లంపేట మున్సిపాలిటి
    బీఆర్ఎస్ పార్టీ – 4
    కాంగ్రెస్ పార్టీ – 3

    అలియాబాద్ మున్సిపాలిటీ
    బీఆర్ఎస్ పార్టీ – 4
    కాంగ్రెస్ పార్టీ – 4
    బీజేపీ – 2
    ఇండిపెండెంట్ – 1

    మూడుచింతలపల్లి మున్సిపాలిటీ
    బీఆర్ఎస్ పార్టీ – 11
    కాంగ్రెస్ పార్టీ – 2

  • 13 Feb 2026 11:20 AM (IST)

    పెద్దపల్లి జిల్లా: సుల్తానాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం..

    పెద్దపల్లి జిల్లా: సుల్తానాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం.. సుల్తానాబాద్ మున్సిపాలిటీ కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ

    01) ఈర్ల స్వరూప (కాంగ్రెస్)
    02) గాజుల రాజమల్లు ( కాంగ్రెస్)
    03) కందునూరి సమత (బీజేపీ)
    04) బిరుదు కృష్ణ (కాంగ్రెస్)
    05) గరిగే శోభారాణి (కాంగ్రెస్)
    06) బాకం సాయి కిరణ్ (కాంగ్రెస్)
    07) వర ప్రదీప్ (కాంగ్రెస్)
    08) చింతల రాజు (కాంగ్రెస్)
    09) టికే ప్రభాకర్. (కాంగ్రెస్)
    10) అంతటి పుష్పలత(కాంగ్రెస్) .
    11) కల్వల శంకరమ్మ (BRS)
    12) అమీరిశెట్టి శ్రావణి (AIFBP)
    13) సిద్ధ తిరుపతి ( కాంగ్రెస్)
    14) వేగోళం పద్మ (కాంగ్రెస్)
    15) గాదాసు మంజుల (కాంగ్రెస్)

    కాంగ్రెస్ :12
    బీజేపీ :1
    బిఆర్ఎస్:1
    సింహం:1

    మొత్తం :15

  • 13 Feb 2026 11:12 AM (IST)

    నారాయణఖేడ్ మునిసిపల్ పీఠాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ..

    సంగారెడ్డి జిల్లా:

    నారాయణఖేడ్ మున్సిపాలిటీ ఫలితాలు
    1వ వార్డు – పత్రి లలిత (బీజేపీ) 198 ఓట్ల మెజారిటీతో విజయం
    2వ వార్డు – సురేఖ విఠల్ (కాంగ్రెస్) విజయం
    3వ వార్డు – స్వప్న అభిషేక్ షెట్కార్ (బీఆర్ఎస్) 16 ఓట్ల మెజారిటీతో విజయం
    4వ వార్డు – దారం శంకర్ (కాంగ్రెస్) 23 ఓట్ల మెజారిటీతో విజయం
    5వ వార్డు – కర్ర మహేష్ (కాంగ్రెస్) విజయం
    6వ వార్డు – భగవాన్ లక్మాన్ (కాంగ్రెస్) 203 ఓట్ల మెజారిటీతో విజయం
    7వ వార్డు – విజయ్ బుజ్జి (బీఆర్ఎస్) 14 ఓట్ల మెజారిటీతో విజయం
    8వ వార్డు – నగేష్ కుమార్ షెట్కార్ (కాంగ్రెస్) విజయం
    9వ వార్డు – బాణపూర్ రాజు (కాంగ్రెస్) విజయం
    10వ వార్డు – ఫర్హాన బేగం (కాంగ్రెస్) విజయం
    11వ వార్డు – చిల్లపల్లి రుక్మిణి (కాంగ్రెస్) విజయం
    12వ వార్డు – మొహ్మద్ షారుఖ్ ఖాన్ (కాంగ్రెస్) విజయం
    13వ వార్డు – వివేకానంద (కాంగ్రెస్) విజయం
    14వ వార్డు – సాజియా తరనుమ్ (కాంగ్రెస్) 52 ఓట్ల మెజారిటీతో విజయం
    15వ వార్డు – రూబినా నజీబ్ (బీఆర్ఎస్) విజయం

    మొత్తం 15 వార్డులలో పార్టీ వారీగా ఫలితాలు:
    కాంగ్రెస్ – 11 వార్డులు
    బీఆర్ఎస్ – 3 వార్డులు
    బీజేపీ – 1 వార్డు

  • 13 Feb 2026 11:07 AM (IST)

    నిజమాబాద్ : భీంగల్ మున్సిపాలిటీ లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు..

    నిజమాబాద్ : భీంగల్ మున్సిపాలిటీ లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.

    03 వ వార్డు తోట సతీష్ కాంగ్రెస్ గెలుపు
    07 వ వార్డులో అంజు మాలి కాంగ్రెస్ విజయం

    04 వార్డులో గున్నాల బాలలత బీ ఆర్ ఎస్ విజయం

    12 వార్డులో అనుపమ బీ ఆర్ ఎస్ గెలుపు.

    7వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు.

  • 13 Feb 2026 11:04 AM (IST)

    జగిత్యాల జిల్లా: మెట్‌పల్లి మున్సిపాలిటీలో ఇదీ పరిస్థితి..

    మెట్‌పల్లి పట్టణంలోని మొదటి రౌండ్ తొమ్మిది వార్డులు లెక్కింపులో భాగంగా ప్రస్తుత వివరాలు.. రెండో రౌండ్లో మరో 9 వార్డుల లెక్కింపు ప్రారంభం..
    కాంగ్రెస్ పార్టీ- 3
    బీజేపీ - 3
    బీఆర్ఎస్ - 2
    స్వతంత్ర - 1

  • 13 Feb 2026 10:54 AM (IST)

    జోగులాంబ గద్వాల్ జిల్లా : ఐజ మున్సిపాలిటీ ఎన్నికల్లో BRS విజయం సాధించింది...

    జోగులాంబ గద్వాల్ జిల్లా :

    ఐజ మున్సిపాలిటీ ఎన్నికల్లో BRS విజయం సాధించింది...
    మొత్తం 20 వార్డులలో 14 వార్డులు BRS కైవసం చేసుకుంది.
    6 వార్డులు కాంగ్రెస్ కైవసం చేసుకుంది.

    ఐజ మున్సిపాలిటీ పిఠాన్ని కైవసం చేసుకున్న BRS పార్టీ...

  • 13 Feb 2026 10:51 AM (IST)

    పేటలో బీజేపీ హవా..

    నారాయణపేట జిల్లా: నారాయణపేట మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు లో 8 వార్డులకు గాను 5 వార్డులలో బీజేపీ విజయం, ఒకటి కాంగ్రెస్, ఒకటి బిఆర్ఎస్,ఒకటి స్వతంత్ర అభ్యర్థి విజయం

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Congress BRS BJP Telangana
  • Election Counting Centres Telangana
  • Municipal Results Today
  • NTV Live Updates
  • postal ballot counting Telangana

ట్రెండింగ్‌

  • Summer Alert : శరీరంలో నీరు తగ్గిందని తెలిపే ‘రెడ్ ఫ్లాగ్’ లక్షణాలు ఇవే.. నిర్లక్ష్యం చేస్తే డేంజరే..!

  • Karnataka Special Carrot Palya : నిమిషాల్లో తయారయ్యే హెల్తీ రెసిపీ.. టేస్ట్ అదిరిపోతుంది.!

  • Panakam Recipe: తక్షణ శక్తి కోసం శ్రీరామ నవమి పానకం.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!

  • Stomach Pain After Eating.? తిన్న వెంటనే కడుపు నొప్పా..? ఈ 5 కారణాలు తెలిస్తే షాక్ అవుతారు!

  • Stock Market: భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు.. బిక్కుబిక్కుమంటున్న మదుపరులు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions