US-Iran: ఇరాన్‌లో టెన్షన్.. టెన్షన్.. చుట్టుముడుతోన్న అమెరికా సైన్యం
- ఇరాన్‌లో టెన్షన్.. టెన్షన్
- చుట్టుముడుతోన్న అమెరికా సైన్యం
- ఏ క్షణంలోనైనా దాడి జరగొచ్చని వార్తలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్-అమెరికా మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతున్నాయి. ఇరాన్‌పై దాడికి అమెరికా సిద్ధపడుతున్నట్లు కనిపిస్తోంది. భారీ స్థాయిలో అమెరికా సైన్యం మోహరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే యూఎస్ఎస్ అబ్రహం లింకన్ నౌక అరేబియా సముద్రంలో మోహరించింది. తాజాగా మరో అతిపెద్ద విమాన వాహన నౌక తరలివెళ్తున్నట్లుగా తెలుస్తోంది. యూఎస్ఎస్ జెరాల్డ్ ఆర్.ఫోర్డ్‌ను కరేబియన్ నుంచి మధ్య ప్రాచ్యానికి తరలించాలని ఆదేశాలు వెళ్లడంతో ఉద్రిక్తతలు పెరుగుతున్నట్లు అర్థమవుతోంది. ఇప్పటికే యూఎస్ఎస్ అబ్రహం లింకన్ నౌకతో పాటు మూడు గైడెడ్-క్షిపణి డిస్ట్రాయర్లు మోహరించాయి.
ఇది కూడా చదవండి: Zaima Rahman: ట్రెండింగ్‌గా తారిక్ రెహమాన్ కుమార్తె.. బంగ్లాదేశ్ ఫలితాల్లో ఏ మ్యాజిక్ చేసిందంటే..!
Also Read
ప్రస్తుతం అణు ఒప్పందంపై ఇరాన్‌తో అమెరికా చర్చలు నడుపుతోంది. త్వరలోనే ఒప్పందం జరుగుతుందని ఆశిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఒకవేళ చర్చలు గనుక విఫలమైతే ఏ క్షణంలోనైనా అమెరికా సైన్యానికి ట్రంప్ ఆదేశాలు ఇవ్వొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. గత వారం ఒమన్‌లో పరోక్ష చర్చలు జరిగాయి. కానీ సత్‌ఫలితాన్ని ఇవ్వలేదు. అణు ఒప్పందం చేసుకునేందుకు ఏ మాత్రం ఇరాన్ మొగ్గు చూపడం లేదు. అమెరికాను ధీటుగా ఎదుర్కొంటామని ఇరాన్ సవాల్ విసురుతోంది. ఈ నేపథ్యంలో ఏదో జరుగుతుందని సంకేతాలు వెల్లడవుతున్నాయి. ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితమే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వైట్‌హౌస్‌లో ట్రంప్‌ను కలిశారు. దాదాపు 3 గంటల పాటు రహస్య సమావేశం జరిగింది. ఇద్దరి మధ్య కీలక చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Triangle Love: వాలెంటైన్ డేకు ముందు ఘోరం.. ట్రయాంగిల్ లవ్‌లో ఎంత ఘోరానికి తెగబడిందంటే..!
ప్రస్తుతం ఇరాన్‌పై అమెరికా ఒత్తిడి పెంచే యోచనలో ఉన్నట్లు కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే యూఎస్‌ఎస్ అబ్రహం లింకన్, యూఎస్‌ఎస్ ఫ్రాంక్ ఈ పీటర్సన్ జూనియర్, యూఎస్‌ఎస్ స్ప్రూయాన్స్ డెస్ట్రాయర్లు, యూఎస్‌ఎస్ మిషెల్ మార్ఫీలు తరలించినట్లు తెలుస్తోంది. తాజాగా జెరాల్డ్ ఆర్ ఫోర్డ్‌ను సైతం వెళ్తుండంతో భయాందోళనలు మొదలయ్యాయి.
- Tags
- america
- Iran
- Tensions rise
- trump
- us
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?