కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ జనహిత యాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్పై విరుచుకుపడుతూ, జనహిత యాత్ర లక్ష్యం ప్రజల సమస్యలు తెలుసుకోవడమేనని చెప్పారు.
తగలబడుతున్న రష్యా.. చమురు శుద్ధి ఫ్యాక్టరీలే ఉక్రెయిన్ టార్గెట్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు కోసం ఒకవైపు ముమ్మరంగా ప్రయత్నాలు జరుతుంటే.. మరోవైపు ఈ రెండు దేశాలు ఒకదానిపై మరొకటి దాడులు చేసుకుంటునే ఉన్నాయి. మాస్కో-కీవ్‌ల మధ్య యుద్ధం 2022 ఫిబ్రవరి 24 నుండి కొనసాగుతోంది. ఇటీవల కాలంలో రెండు దేశాల మధ్య వివాదం తీవ్రమైంది. ఆగస్టు 15న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ – రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో అలాస్కాలో యుద్ధాన్ని ముగించడానికి సమావేశమయ్యారు. తర్వాత […]
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రేపు మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ పర్యటనలో ఆయన పలు కీలక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అంశంపై న్యాయ నిపుణులతో చర్చించనున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలు జోరుగా మొదలయ్యాయి. మండపాల ఏర్పాటు, బొజ్జ గణపయ్య విగ్రహాల తరలింపు వేగంగా జరుగుతున్న నేపథ్యంలో, తెలంగాణ పోలీసులు ముఖ్యమైన మార్గదర్శకాలు విడుదల చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ మండపాలు, దుర్గామాత మండపాలకు ఉచితంగా విద్యుత్ అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి డిమాండ్ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
CM Revanth Reddy : హైదరాబాద్‌లో జరిగిన బయోడిజైన్ ఇన్నోవేషన్ సమ్మిట్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య ప్రసంగం చేశారు. జీవవిజ్ఞానం, వైద్య రంగం, ఆవిష్కరణల ప్రాధాన్యం గురించి ఆయన విశ్లేషిస్తూ తెలంగాణను ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. “దేవుడు ఒక మంచి డిజైనర్, ప్రకృతి మంచి గురువు. మనం మంచి విద్యార్థులమా కాదా అనేది ప్రశ్న,” అని సీఎం రేవంత్ అన్నారు. జీవశాస్త్రం, వైద్య రంగంలో ప్రకృతినే మనకు […]
ఆ 25 ఎకరాల టీటీడీ భూమిని టూరిజం శాఖకు ఎలా ఇస్తారు..? అలిపిరి రోడ్డులోని రూ. 1500 కోట్లకు పైగా విలువ చేసే 25 ఎకరాల తిరుమల తిరుపతి దేవాస్థానం భూమిని టూరిజం శాఖకు ఎలా ఇస్తారు అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. టీటీడీ బోర్డు మీటింగ్ లో మా అభ్యంతరాలను తిరస్కరించారు.. దేవుడు భూమిని రక్షించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేదా.. 25 ఎకరాల టీటీడీ ల్యాండ్ ను టూరిజం […]
హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్‌లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక ప్లైవుడ్ గోడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. ఈ క్రమంలో మంత్రుల కమిటీని ఏర్పాటు చేసి, కీలక నిర్ణయాల కోసం కసరత్తు ప్రారంభించింది.