Medha School : డబ్బు సంపాదనే ఏకైక లక్ష్యంగా మత్తుమందును తయారు చేసి విక్రయిస్తున్న మేధా స్కూల్ కరస్పాండెంట్ జయప్రకాష్ గౌడ్‌ను ఈగల్ టీం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచింది. కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్ విధించడంతో, చంచల్గూడా జైలుకు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో అనేక సంచలన విషయాలు బయటపడ్డాయి.
రిమాండ్ రిపోర్టు ప్రకారం, జయప్రకాష్ గౌడ్ తన పాఠశాలను మత్తుమందు తయారీకి అడ్డాగా మార్చుకున్నాడు. పాఠశాలలో మత్తుమందు తయారు చేస్తే ఎవరికీ అనుమానం రాదని భావించి ఈ దారుణానికి ఒడిగట్టాడు. పగటిపూట పాఠశాల తరగతులు యధావిధిగా నడిపించి, రాత్రిపూట మాత్రం మత్తుమందును తయారు చేసేవాడు. తరువాత, స్కూటీపై వాటిని తీసుకెళ్లి సరఫరా చేసేవాడు.
Unbelievable: భయం మా చెడ్డది సుమీ..! కుక్కల భయానికి ఇంటిపైకెక్కిన ఎద్దు.!
జయప్రకాష్ గౌడ్ మత్తుమందు తయారీ ఫార్ములాను గురువారెడ్డి అనే వ్యక్తి దగ్గర కొనుగోలు చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ మందును తయారు చేసే క్రమంలో ఆరుసార్లు విఫలమయ్యాడు. కానీ ఏడోసారి మాత్రం విజయవంతమయ్యాడు. తయారైన మత్తుమందును కల్లులో కలిపి విక్రయించడం ప్రారంభించాడు. దీనిని సేవించిన కస్టమర్లు “కిక్” బాగా ఉందని చెప్పడంతో, ఈ వ్యాపారాన్ని మరింత విస్తరించాడు. రోజుకు కిలో చొప్పున మత్తుమందును తయారు చేసి, మహబూబ్నగర్తో పాటు హైదరాబాద్లోని పలు కల్లు కాంపౌండ్లకు సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, మత్తుమందు తయారు చేసే ఫ్లోర్లోనే పిల్లలకు ట్యూషన్లు చెప్పినట్లు నివేదికలో ఉంది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై మరింత లోతైన విచారణ జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఏడేళ్ల ఆండ్రాయిడ్, సెక్యూరిటీ అప్‌డేట్‌లతో Samsung Galaxy S25 FE (Fan Edition) లాంచ్!