Janasena: తెలంగాణలో ఖాతా తెరిచిన జనసేన.. ఏ జిల్లాలో గెలిచిందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janasena: ఏపీకే పరిమితమైందని భావించిన జనసేన పార్టీ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఖాతా తెరిచింది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో జనసేన అభ్యర్థి ఘన విజయం సాధించారు. 14వ వార్డులో జనసేన తరఫున పోటీ చేసిన విజయలక్ష్మి ఆరూరి 60 ఓట్ల మెజారిటీతో విజయ కేతనం ఎగుర వేసింది. ఈ గెలుపుపై ఇప్పటికే పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ వేదికగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. కాగా.. ఈ మున్సిపాలిటీలో మొత్తం 15 స్థానాలకు గానూ 9 వార్డుల్లో కాంగ్రెస్, 5 వార్డుల్లో బీఆర్‌ఎస్ గెలుపొందగా, ఒక వార్డును జనసేన దక్కించుకుంది. అయితే.. విజయ లక్ష్మీ గెలపుతో తెలంగాణలోని జనసేన కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. తెలంగాణలో ఇప్పటివరకు ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో కొత్త శక్తిగా ఎదగాలని చూస్తున్న జనసేనకు ఈ గెలుపు ప్రోత్సాహాన్ని ఇస్తోందని అభిమానులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో గ్రామ, పట్టణ స్థాయిలో పార్టీ విస్తరణపై దృష్టి పెట్టే అవకాశాలు ఉంటాయా? అనే అంశాన్ని జనసేన పార్టీ నిర్ణయించాలి.
Also Read
- OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
- Breast Cancer: తేనెటీగ విషంతో క్యాన్సర్‌కు చెక్ పెట్టొచ్చా? పరిశోధనల్లో ఏం తేలింది?
- AP Government Employees Holiday: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. వరుసగా 4 రోజుల సెలవులు.. ఉత్తర్వులు జారీ
- Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
తాజావార్తలు
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
-
OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
-
Flight Ticket Price Control: విమాన టికెట్ల ధరలకు కళ్లెం.? కేంద్రం కొత్త రూల్స్.!
-
Breast Cancer: తేనెటీగ విషంతో క్యాన్సర్‌కు చెక్ పెట్టొచ్చా? పరిశోధనల్లో ఏం తేలింది?
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!