KTR vs Bandi Sanjay : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలనానికి తావిచ్చే పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, తెలంగాణ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భారీ పరువు నష్టం దావా వేశారు. బండి సంజయ్ తనపై చేసిన వ్యాఖ్యలు తప్పుడు ఆరోపణలతో నిండివున్నాయని, అవి తన రాజకీయ, వ్యక్తిగత ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసేలా ఉన్నాయని కేటీఆర్ ఆరోపించారు.
సోమవారం కేటీఆర్ తరఫు న్యాయవాదులు సిటీ సివిల్ కోర్టులో రూ.10 కోట్ల పరువు నష్టం దావా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై కోర్టు డిసెంబర్ 15వ తేదీన విచారణ జరపనుంది. బండి సంజయ్ తాజాగా ఫోన్ ట్యాపింగ్ వివాదంపై కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకొని కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, నిరాధారమని ఇప్పటికే కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. అయినప్పటికీ బండి సంజయ్ తనపై రాజకీయ దురుద్దేశంతో ఆరోపణలు కొనసాగిస్తున్నారని కేటీఆర్ ఆరోపిస్తున్నారు.
వింటేజ్ లుక్లో కొత్త Royal Enfield Meteor 350 లాంచ్.. ఫీచర్లు, ధరలు ఇలా!
తనపై చేస్తున్న ఈ ఆరోపణలు ప్రజల్లో తప్పుడు అభిప్రాయాన్ని కలిగించేలా ఉన్నాయని, ముఖ్యంగా తన ప్రజా ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ కోర్టులో స్పష్టం చేశారు. బండి సంజయ్ తన హోదాను దుర్వినియోగం చేస్తూ ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆరోపణ. రాజకీయంగా పోటీ చేయడం వేరే విషయం, కానీ తప్పుడు ఆరోపణలతో ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నం అసహ్యకరమని కేటీఆర్ వైఖరి.
బండి సంజయ్‌పై కేటీఆర్ వేసిన ఈ భారీ దావా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇరుపార్టీల మధ్య మాటల యుద్ధం, ఆరోపణలు–ప్రతియారోపణలు మరోస్థాయికి చేరాయి. ఈ కేసు విచారణ ఎటువంటి మలుపు తిరుగుతుందన్నది అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
వాహనాలు, మొబైల్, మరేదైనా వస్తువు పోయిందా? ఇట్టే కనిపెట్టొచ్చు.. కొత్త JioFind Series లాంచ్!