Supari Gang : సూర్యాపేట జిల్లా కేంద్రంలో మరోసారి సుపారీ మర్డర్ యత్నం బయటపడడంతో స్థానికంగా భారీ కలకలం చెలరేగింది. సమాచారం ప్రకారం, ఓ బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురిని లక్ష్యంగా చేసుకుని ఒక సుపారీ గ్యాంగ్ కారులో వెంబడించింది. అప్రమత్తమైన వారు వెంటనే బైక్ దిగి సమీపంలోని వైన్స్‌లోకి పరుగెత్తడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. వైన్స్‌లో ఉన్న స్థానికులు గ్యాంగ్‌పై దాడికి దిగగా, పరిస్థితి చేజారిపోతుందనుకున్న వారు తాము వచ్చిన కారులో అక్కడి నుంచి పరారయ్యారు. ఈ […]
Betting Seva : నిర్మల్ జిల్లా పోలీసులు భైంసా ప్రాంతంలో జరుగుతున్న ఆన్లైన్ బెట్టింగ్ ముఠాపై గట్టి దాడి చేసి ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. ఏడాది కాలంగా భైంసాను అడ్డాగా చేసుకుని ఈ అక్రమ కార్యకలాపాలను నడిపిస్తున్న సయ్యద్ ఆజమ్‌ను గురువారం రాత్రి ఓవైసీ నగర్‌లోని ఓ ఆలయం సమీపంలో మెరుపుదాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల వెల్లడించిన వివరాల ప్రకారం, ఆజమ్ మీ సేవా సెంటర్ ముసుగులో Allpannel.com అనే […]
ఓటమి తర్వాత రకరకాల సమస్యలతో సతమతం అవుతున్న బీఆర్ఎస్… ఫస్ట్ టైం… డబుల్ డోస్ పొలిటికల్ ప్లానింగ్ చేస్తోందా? జంబ్లింగ్ సిస్టంతో కొత్త ప్రయోగం చేయాలనుకుంటోందా? ఒక నాయకుడి చేరికతో రెండు నియోజకవర్గాల్లో బలపడాలని భావిస్తోందా? అది ఎంతవరకు సాధ్యమయ్యే అవకాశం ఉంది? ఇంతకీ ఏంటా పొలిటికల్ ప్లాన్? దానితో ఏయే నియోజకవర్గాల్లో పుంజుకోవాలనుకుంటోంది? ఓటమి తర్వాత వరుస దెబ్బలతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది బీఆర్ఎస్. వలసలు ఆ పార్టీని ఇంకా దెబ్బతీస్తున్నాయి. అందునా ఇటీవల మాజీ […]
ACB: వనస్థలిపురం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం– తుర్కయాంజల్‌కు చెందిన ఓ వ్యక్తి తనకు ఉన్న 200 గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు సబ్‌రిజిస్ట్రార్ రాజేశ్‌ను సంప్రదించాడు. ఈ సందర్భంగా ప్లాటు రిజిస్ట్రేషన్ కోసం రాజేశ్ రూ.1 లక్ష లంచం డిమాండ్ చేశాడు. తర్వాత చర్చల అనంతరం రూ.70 వేల వద్ద ఒప్పందం కుదిరింది. దీంతో ఆ స్థల యజమాని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు […]
హైదరాబాద్ కూకట్‌పల్లిలో 12 ఏళ్ల సహస్ర హత్య కేసు ఛేదనలో పోలీసులు కీలక ఆధారాలను వెలికి తీశారు. హత్య నిందితుడు, 10వ తరగతి విద్యార్థి తన దొంగతనం ప్లాన్‌ను “మిషన్ డాన్” పేరుతో రాసుకోవడం విచారణలో బయటపడింది.
తెలంగాణలో ఆరోగ్యశాఖలో మరోసారి ఉద్యోగాల వేట మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం భారీగా స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1623 పోస్టులు భర్తీ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. వివరాల ప్రకారం, తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని హాస్పిటల్స్‌లో
HYD Traffic Police : హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు నగర పోలీసులు కొత్త అడుగు వేశారు. సాధారణంగా ప్రధాన జంక్షన్ల వద్ద కనిష్టం ఇద్దరు, గరిష్టం ముగ్గురు పోలీసులు విధుల్లో ఉంటారు. కానీ రెండు జంక్షన్ల మధ్యలో సమస్యలు తలెత్తినప్పుడు స్పందన ఆలస్యమవుతుండేది. ఈ లోటు తీర్చేందుకు ప్రత్యేకంగా ట్రాఫిక్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (HCSC) సహకారంతో తొలి దశలో 50 అత్యాధునిక అవెంజర్ వాహనాలను కొనుగోలు […]
హైదరాబాద్ నగరాన్ని కుదిపేసిన కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసులో పోలీసులు కీలక పురోగతిని సాధించారు. ఎస్వోటీ పోలీసులు దర్యాప్తులో భాగంగా 10వ తరగతి చదువుతున్న బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.