Jagapathi Babu: డబ్బు ఓ అవసరం.. కానీ అదే సర్వస్వం కాదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagapathi Babu: సీనియర్ హీరో ‘జగపతి బాబు’ గురించి ప్రత్యేకంగా ఇంట్రో అవసరం లేదు. హీరోగా, విలన్ గా ఇంకా ఎన్నో ముఖ్య పాత్రలలో మెప్పించిన ఆయన ఎక్కువగా సాదాసీదా జీవితం గడపడానికి ఇష్టపడతారు. ఆయన జీవితంలో ఎన్నో ఎత్తులు చూశానని, అలాగే ఎన్నో లోతులు చూశానని.. మల్లి తిరిగి నిలబడ్డానని చెప్పారు. ఇకపోతే తాజాగా ఆయన ఓ ప్రముఖ ప్రాడ్క్యాస్ట్ షోలో పాల్గొని అనేక జీవిత సత్యాలను మాట్లాడాడు. అందులో డబ్బులకు సంబంధించిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
Also Read
- Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
- Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
- iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు (Jagapathi Babu) సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా, అప్పుడప్పుడు జీవితం గురించి, సమాజం గురించి చెప్పే మాటలు అందరినీ ఆలోచింపజేస్తుంటాయి. తాజాగా డబ్బు గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మనం డబ్బు వెంట పరిగెత్తడం కాదు, అది మన దగ్గరికి వచ్చేలా ఉండాలని అన్నారు. అలాగే డబ్బు అనేది కేవలం అవసరాలను తీర్చే ఒక సాధనం మాత్రమేనని.. ఒకప్పుడు స్టార్ హీరోగా ఉండి, ఆ తర్వాత ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులను చూసిన వ్యక్తి కావడంతో, డబ్బు విలువ ఆయనకు బాగా తెలుసునన్నారు.
Thailand GL Series: థాయిలాండ్ ‘గర్ల్స్ లవ్’ విప్లవం.. ప్రపంచ ఫ్యాన్ కల్చర్‌కు కొత్త నిర్వచనం
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఈ రోజుల్లో మనిషి కంటే డబ్బుకే ఎక్కువ విలువ ఇస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు పిచ్చి అనేది ఒక పెద్ద జబ్బు అని, దాని కోసం ప్రాణ స్నేహితులను, బంధువులను కూడా దూరం చేసుకోవడం సరైనది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. తను వందల కోట్ల ఆస్తులను పోగొట్టుకున్నప్పటికీ, ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉన్నానని ఆయన అన్నారు. ఆస్తుల కంటే ప్రశాంతమైన నిద్ర, మంచి ఆహారం, ప్రేమగా పలకరించే మనుషులు ఉండటమే నిజమైన సంపద అని తెలిపారు. డబ్బు కోసం అబద్ధాలు ఆడటం, వేషాలు వేయడం కంటే.. ఉన్నదానితో తృప్తిగా బతకడం మేలు.. అని జగపతి బాబు డబ్బు గురించి ఓ సందేశం అందించారు.
— 𝐇𝐀𝐊𝐔𝐍𝐀-𝐌𝐀𝐓𝐀𝐓𝐀 (@noworriesbehpy) February 13, 2026
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!