Instagram : ఇంస్టాగ్రామ్‌లో ఏర్పడిన పరిచయం ఒక భార్యను ఎంతటి దారుణానికి పాల్పడేలా చేసిందో ఈ ఘటన రుజువు చేస్తోంది. మహబూబాబాద్ జిల్లా, గడ్డి గూడెం తండాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. భర్తను చంపే ఉద్దేశంతో భార్య తన ఇంస్టాగ్రామ్ ప్రియుడితో కలిసి అతడి చెవులు కోసి హత్యాయత్నం చేసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గడ్డి గూడెం తండాకు చెందిన ఓ భర్తపై అతడి భార్య, ఆమె ప్రియుడు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో అతడి చెవులను కోసి, ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించారు. భయంతో ప్రాణాలను అరచేత పట్టుకుని పరుగులు తీసిన ఆ భర్త, వారి నుంచి తప్పించుకోగలిగాడు.
Unbelievable: భయం మా చెడ్డది సుమీ..! కుక్కల భయానికి ఇంటిపైకెక్కిన ఎద్దు.!
ఈ ఘటనను గమనించిన స్థానికులు, పారిపోతున్న ఇంస్టాగ్రామ్ ప్రియుడిని వెంబడించి పట్టుకున్నారు. అతడిని ఓ చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, అతడిని పోలీసులకు అప్పగించారు. ఈ దాడిలో తీవ్ర గాయాలైన భర్తను వెంటనే మహబూబాబాద్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఈ ఘటనపై మహబూబాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఆధునిక సాంకేతికతతో పెరిగిన సామాజిక మాధ్యమాల వినియోగం ఎలాంటి దుష్పరిణామాలకు దారితీస్తుందో ఈ ఘటన మరోసారి నిరూపించిందని స్థానికులు అభిప్రాయపడ్డారు.
Hardik Pandya New Relationship: హార్దిక్ పాండ్యా మళ్లీ ప్రేమలో పడ్డాడా.. ఎవరా రూమర్ గల్‌ఫ్రెండ్