కమెడియన్ ముక్కు అవినాష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షోతో పేరు సంపాదించుకుని గత ఏడాది బిగ్ బాస్ షోతో పాపులర్ అయ్యాడు. ఇటీవల అనూజ అనే అమ్మాయితో అతడి ఎంగేజ్‌మెంట్ జరగ్గా.. తాజాగా బుధవారం నాడు వివాహం జరిగింది. ఈ పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. అనూజ మెడలో తాళి కడుతున్న ఫోటోలను కమెడియన్ రాంప్రసాద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్‌గా మారాయి. ముక్కు అవినాష్ […]
ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ నేత పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో పట్టాభి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పెద్ద ఎత్తున పోలీసులు చేరుకోవడంతో పట్టాభి అరెస్ట్ ఖాయమని తెలుస్తోంది. పట్టాభి చేసిన వ్యాఖ్యలు అధికార, ప్రతిపక్షాల మధ్య రణరంగంగా మారాయి. ఇప్పటికే ఏపీ పోలీసులు కూడా పట్టాభి చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. చట్టబద్ధమైన పదవుల్లో ఉన్నవారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం […]
టీ20 ప్రపంచ కప్‌లో అసలు పోరు ప్రారంభానికి ముందు టీమిండియా అదరగొట్టింది. ఇప్పటికే తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో బలమైన ఇంగ్లండ్‌ను మట్టికరిపించిన భారత్.. బుధవారం జరిగిన రెండో వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్లు వార్నర్ (1), ఫించ్ (8) ఘోరంగా విఫలమయ్యారు. మిచెల్ మార్ష్ […]
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆర్.ఆర్.ఆర్(RRR) సినిమా గురించి ప్రస్తావించారు. నవంబర్ 2న RRR సినిమా స్పెషల్ షో ప్రగతి భవన్ ముందు కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. ఆరోజు హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం రానుందని.. ఆరోజు బాక్స్ బద్దలు అవుతుందన్నారు. అయితే బండి సంజయ్ RRR సినిమా అంటే రాజమౌళి సినిమా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. అసలు బండి సంజయ్ RRR […]
ఏపీలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం భౌతిక దాడుల వరకు వెళ్లింది. దీంతో అధికార పార్టీపై ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మండిపడుతోంది. ఈ అంశంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే బుధవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఏపీకి కేంద్ర బలగాలు పంపాలని చంద్రబాబు హోంశాఖ అధికారులకు లేఖ రాశారు. మరోవైపు వైసీపీ దాడులకు నిరసనగా […]
ప్రపంచంలో కోట్ల మంది ప్రజలు సోషల్ మీడియాను వాడుతున్నారు. అందులో ఫేస్‌బుక్ ఒకటి. చాలా మంది తమ అభిప్రాయాలను ఇతరులతో షేర్ చేసుకోవడానికి ఫేస్ బుక్‌ను ఉపయోగిస్తుంటారు. కొందరు దీని ద్వారా వ్యాపారాలు కూడా చేసుకుంటున్నారు. ఇటీవల ఫేస్‌బుక్ సేవలు ఆరు గంటలు నిలిచిపోగా ప్రపంచమే స్తంభించినంతగా మారిపోయింది. ఇంతలా ప్రజలతో అనుసంధానమైన ఫేస్‌బుక్ త్వరలో తన పేరును మార్చుకుంటోంది. ఈనెల 28న ఫేస్‌బుక్ వార్షిక సమావేశం జరగనుంది. ఈ భేటీలో ఆ సంస్థ సీఈవో మార్క్ […]
ఏపీలో ఇప్పుడు ‘బోసడీకే’ అనే పదం చుట్టూ రాజకీయం అలుముకుంది. మంగళవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ.. సీఎం జగన్‌ను బోసడీకే అంటూ సంభోదించారు. ఈ పదం పెద్ద రచ్చకు దారి తీసింది. దీంతో వైసీపీ కార్యకర్తలు పలు చోట్ల టీడీపీ కార్యాలయాలపై దాడులకు పాల్పడ్డారు. అయితే బోసడీకే అనే పదం పెద్ద తిట్టు అని వైసీపీ నేతలు అంటుండగా.. ఈ పదానికి అర్థం ఏంటని పలువురు […]
తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్ హయాంలో జరిగినన్ని అభివృద్ధి పనులు గతంలో ఏ ప్రభుత్వంలోనూ జరగలేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హుజూరాబాద్‌లో మత్స్యకారులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌ను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. హుజురాబాద్ ప్రజలు గతంలో ఈటెలకు ఓట్లు ఎందుకు వేశారో చెప్పాలని ప్రశ్నించారు. రెండున్నరేళ్లుగా ఆయన ఏం చేశారని నిలదీశారు. గత రెండున్నర ఏళ్లలో బండి సంజయ్ తన పార్లమెంట్ […]
ప్రస్తుతం యూఏఈ వేదికగా టీ20 ప్రపంచకప్ జరుగుతోంది. ఈ టోర్నీ తర్వాత టీ20లకు టీమిండియా కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోనున్నాడు. దీంతో కోహ్లీ తర్వాత భారతజట్టు పగ్గాలు చేపట్టేది ఎవరంటూ కొన్నిరోజులుగా చర్చ నడుస్తోంది. కొందరు రోహిత్ అని అంటుంటే.. మరికొందరు రాహుల్‌కు ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ చిక్కుముడికి సమాధానం దొరికేసింది. టీ20లకు భవిష్యత్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అని ఓ బీసీసీఐ అధికారి ఇన్‌సైడ్ స్పోర్ట్ అనే ఛానల్‌కు […]
తమిళ్ అగ్ర హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జైభీమ్’. ఈ మూవీ ట్రైలర్ విడుదలకు చిత్ర యూనిట్ ముహూర్తం ఫిక్స్ చేసింది. అక్టోబర్ 22న జై భీమ్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. వెంకటేష్ హీరో నటించిన ‘గురు’ చిత్రానికి దర్శకత్వం వహించిన సుధ కొంగర ఈ మూవీకి డైరెక్టర్. సూర్య హీరోగా ఆమె గతంలో ‘ఆకాశమే నీహద్దురా’ మూవీని తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు పొందారు. ఈ మూవీ ఓటీటీలో విడుదల కాగా జైభీమ్ […]