Tesla EV Charging: ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం టెస్లా భారత్‌లో తన చార్జింగ్ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తోంది. తాజాగా హర్యానాలోని గురుగ్రామ్‌లో టెస్లా తన తొలి చార్జింగ్ స్టేషన్‌ను ప్రారంభించింది. డీఎల్‌ఎఫ్ హోరైజన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఈ చార్జింగ్ స్టేషన్, నగరంలో టెస్లా సెంటర్‌ను ప్రారంభించిన కొద్ది రోజులకే అందుబాటులోకి రావడం విశేషం. అయితే, డిసెంబర్ 17, 2025న గురుగ్రామ్ సెక్టార్ 43, గోల్ఫ్ కోర్స్ రోడ్డులోని డీఎల్‌ఎఫ్ హోరైజన్ సెంటర్‌లో ఈ చార్జింగ్ స్టేషన్‌ను ప్రారంభించారు. ఇందులో 4 సూపర్‌చార్జర్లు, 3 డెస్టినేషన్ చార్జర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ స్టేషన్‌ను “Plug In, Charge and Go” అనుభూతిని అందించేలా రూపొందించామని టెస్లా ప్రతినిధులు తెలిపారు. చార్జింగ్ వ్యవస్థకు 99.95 శాతం అప్‌టైమ్ ఉంటుందని కంపెనీ పేర్కొంది.
టెస్లా యాప్ ద్వారా పూర్తి నియంత్రణ
టెస్లా యజమానులు తమ వాహనాలను చార్జ్ చేసుకునే మొత్తం ప్రక్రియను టెస్లా యాప్ ద్వారా నిర్వహించవచ్చు.
నావిగేషన్ సహాయం
వాహనం ప్రీ-హీటింగ్
రియల్‌టైమ్ చార్జింగ్ స్టాల్ లభ్యత
Read Also: PM Modi: భారత్ ఆర్థికంగా పురోగమిస్తోంది.. ఒమన్‌లో భారతీయ విద్యార్థులతో మోడీ సంభాషణ
చార్జింగ్ ప్రోగ్రెస్ అప్డేట్స్
నోటిఫికేషన్లు, ఆన్‌లైన్ చెల్లింపులు.. ఈ అన్ని ఫీచర్లు వినియోగదారులకు మరింత సౌకర్యవంతమైన అనుభవాన్ని అందిస్తున్నాయి.
ఢిల్లీ, ముంబైలో ఇప్పటికే టెస్లా చార్జింగ్ స్టేషన్లు
టెస్లా ఇప్పటికే భారత్‌లోని ప్రధాన నగరాల్లో తన చార్జింగ్ మౌలిక వసతులను ఏర్పాటు చేసింది.
ఢిల్లీలోని వరల్డ్‌మార్క్ 3, ఏరోసిటీలోని టెస్లా షోరూమ్ & ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో 4 V4 సూపర్‌చార్జర్లు, 3 డెస్టినేషన్ చార్జర్లు ఏర్పాటు చేసింది.
ముంబై: ఆగస్టులో బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో టెస్లా భారత్‌లో తొలి చార్జింగ్ స్టేషన్‌ను ప్రారంభించింది. అక్కడ 4 V4 సూపర్‌చార్జింగ్ స్టాల్స్ (DC), 4 డెస్టినేషన్ చార్జింగ్ స్టాల్స్ (AC) అందుబాటులో ఉన్నాయి.
భారత్‌లో టెస్లా చార్జింగ్ నెట్‌వర్క్ స్థితి
ప్రస్తుతం టెస్లా భారత్‌లో 3 చార్జింగ్ స్టేషన్లు, 12 సూపర్‌చార్జర్లు, 10 డెస్టినేషన్ చార్జర్లతో తన నెట్‌వర్క్‌ను విస్తరించింది. దీని ద్వారా టెస్లా యజమానులు దీర్ఘ ప్రయాణాలను మరింత సులభంగా ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది.
టెస్లా సూపర్‌చార్జింగ్ ఖర్చులు
250kW సూపర్‌చార్జర్: కిలోవాట్‌కు రూ. 24 మాత్రమే.. మోడల్ Y స్టాండర్డ్ వేరియంట్ పూర్తి చార్జ్‌కు సుమారు రూ. 1,800 ఉంటుంది. లాంగ్ రేంజ్ వేరియంట్‌కు రూ. 2,000కు పైగా 11kW డెస్టినేషన్ చార్జర్: కిలోవాట్‌కు రూ. 14గా ఉంది. తక్కువ ఖర్చుతో చార్జింగ్ కోరుకునే వారికి ఇది అనుకూలంగా మారనుంది.
భారత్‌లో టెస్లా భవిష్యత్ ప్రణాళికలు
గురుగ్రామ్ చార్జింగ్ స్టేషన్ ప్రారంభంతో టెస్లా భారత్‌లో తన ఉనికిని మరింత బలోపేతం చేస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని నగరాల్లో చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసి, భారత ఈవీ మార్కెట్‌లో కీలక పాత్ర పోషించాలనే లక్ష్యంతో టెస్లా ముందుకెళ్తోంది.