కమెడియన్ ముక్కు అవినాష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షోతో పేరు సంపాదించుకుని గత ఏడాది బిగ్ బాస్ షోతో పాపులర్ అయ్యాడు. ఇటీవల అనూజ అనే అమ్మాయితో అతడి ఎంగేజ్‌మెంట్ జరగ్గా.. తాజాగా బుధవారం నాడు వివాహం జరిగింది. ఈ పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. అనూజ మెడలో తాళి కడుతున్న ఫోటోలను కమెడియన్ రాంప్రసాద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్‌గా మారాయి. ముక్కు అవినాష్ పెళ్లికి బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లు సొహైల్, అరియానా, దివితో పాటు పలువురు జబర్దస్త్ నటులు కూడా హాజరయ్యారై వధూవరులను ఆశీర్వదించారు.
కాగా గత ఏడాది బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వెళ్లిన అవినాష్ అక్కడ తన ప్రత్యేకతను చాటుతూ గేమ్ ఆడాడు. 90 రోజుల పాటు హౌస్‌లో ఉన్నాడు. గేమ్‌లో భాగంగా అరియానాతో ప్రేమకథ నడిపాడు. దీంతో చాలా మంది అవినాష్, అరియానా నిజంగా ప్రేమించుకున్నారేమో అని ఊహించుకున్నారు. కానీ తర్వాత పలు టీవీ షోల ద్వారా అరియానాతో వచ్చిన వదంతులను అవినాష్ ఖండించాడు. తామిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని చాటిచెప్పాడు.
అవినాష్ పెళ్లి వీడియో లింక్: https://www.instagram.com/p/CVPO6qeFq9i/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again