ప్రపంచంలో భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధాని మోడీ అన్నారు. ఒమన్ పర్యటనలో భాగంగా భారతీయ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. మైత్రిపర్వ్‌లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ప్రపంచం ఆర్థిక వ్యవస్థపై అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో.. పెద్ద ఆర్థిక వ్యవస్థలు కూడా కనీస వృద్ధిని సాధించేందుకు ఇబ్బంది పడ్డాయన్నారు. ఇలాంటి తరుణంలో భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందడం గొప్ప విషయం అన్నారు. ఇరుదేశాల మధ్య మైత్రి బంధం బలోపేతం అయిందన్నారు.
ఇది కూడా చదవండి: Lok sabha: జీ రామ్.. జీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. పత్రాలు చించేసిన విపక్ష సభ్యలు
అంతకముందు మస్కట్‌లో భారత్-ఒమన్ వ్యాపార సదస్సులో ప్రధాని మోడీ ప్రసంగించారు. ‘‘మన సంబంధం విశ్వాసం అనే పునాదిపై నిర్మించబడింది. స్నేహం అనే బలంపై ముందుకు సాగింది. కాలక్రమేణా అది మరింత బలపడింది. నేడు మన దౌత్య సంబంధాలు ఏర్పడి 70 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇది కేవలం 70 సంవత్సరాల వేడుక మాత్రమే కాదు. ఇది ఒక మైలురాయి. మన శతాబ్దాల వారసత్వాన్ని ఒక సుసంపన్నమైన భవిష్యత్తు వైపు తీసుకువెళ్లాలి.’’ అని మోడీ ఆకాంక్షించారు.
‘‘సముద్రం రెండు చివర్ల చాలా దూరంలో ఉంటాయని.. అయితే అరేబియా సముద్రం మాండవి.. మస్కట్‌ల మధ్య ఒక బలమైన వారధిగా నిలిచింది. ఈ వారధి మన సంబంధాలను.. సంస్కృతిని, ఆర్థిక వ్యవవస్థను బలోపేతం చేసింది. ఈరోజు పూర్తి విశ్వాసంతో చెప్పగలం. సముద్రపు అలలు.. వాతావరణం మారినప్పటికీ.. భారతదేశం-ఒమన్ మధ్య స్నేహం ప్రతి అలతో పాటు మరింత బలపడుతోంది.’’ అని అన్నారు.
ఇది కూడా చదవండి: Nitish Kumar: క్షమాపణ చెప్పు లేదంటే చంపేస్తా.. హిజాబ్‌పై నితీష్‌కు పాకిస్థాన్ గ్యాంగ్‌స్టర్ వార్నింగ్
మూడు దేశాల పర్యటన కోసం ప్రధాని మోడీ సోమవారం జోర్డాన్ వెళ్లారు. అక్కడ అపూర్వ స్వాగతం లభించింది. అనంతరం ఇథియోపియాకు వెళ్లారు. అక్కడ కూడా గౌరవ మర్యాదలు దక్కాయి. ప్రస్తుతం ఒమన్‌లో పర్యటిస్తున్నారు. మూడు దేశాల మధ్య బలమైన వాణిజ్య ఒప్పందాలు జరిగాయి. అమెరికా, చైనా తర్వాత మూడో అతిపెద్ద వాణిజ్య ఒప్పందం ఇదే కావడం విశేషం.
బుధవారం ఒమన్ చేరుకోగానే ఉప ప్రధాని సయ్యిబ్ షిహాబ్ బిన్ తారిక్ అల్ సయిద్‌తో మోడీ సమావేశమై పలు ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై చర్చించారు. ఇరు దేశాల మధ్య ఉన్న మైత్రీ బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా సమాలోచనలు జరిపారు. భారత్-ఒమన్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70 ఏళ్లవుతుండటాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఓ ఎగ్జిబిషన్‌ను మోడీ తిలకించారు.
Muscat, Oman: Prime Minister Narendra Modi says, "India has consistently remained one of the fastest-growing major economies in the world. This has happened at a time when the global economy faces multiple challenges, with many large economies struggling to achieve even minimal… pic.twitter.com/d0zUC8WIPE
— IANS (@ians_india) December 18, 2025