టీ20 వరల్డ్ కప్: రెండో వార్మప్ మ్యాచ్‌లోనూ భారత్ ఘనవిజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 ప్రపంచ కప్‌లో అసలు పోరు ప్రారంభానికి ముందు టీమిండియా అదరగొట్టింది. ఇప్పటికే తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో బలమైన ఇంగ్లండ్‌ను మట్టికరిపించిన భారత్.. బుధవారం జరిగిన రెండో వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్లు వార్నర్ (1), ఫించ్ (8) ఘోరంగా విఫలమయ్యారు. మిచెల్ మార్ష్ కూడా డకౌట్‌గా వెనుతిరిగాడు. అనంతరం స్టీవ్ స్మిత్ 57, మ్యాక్స్‌వెల్ 37, స్టాయినీస్ 41 పరుగులతో రాణించడంతో ఆసీస్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. భారత బౌలర్లలో అశ్విన్ 2 వికెట్లు పడగొట్టగా… రాహుల్ చాహర్, భువనేశ్వర్. రవీంద్ర జడేజా చెరొక వికెట్ సాధించారు.
అనంతరం 153 పరుగుల విజయలక్ష్యంతో బరిలోగి దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్, రాహుల్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఇషాన్ కిషాన్ తీసుకున్న బాధ్యతను ఈ మ్యాచ్‌లో రోహిత్ చేపట్టాడు. ఆసీస్ బౌలర్లను అతడు చీల్చి చెండాడాడు. జట్టు స్కోరు 68 పరుగుల వద్ద రాహుల్ 39 పరుగులు చేసి అగార్ బౌలింగ్‌లో వెనుతిరిగాడు. అనంతరం సూర్యకుమార్ యాదవ్‌తో రోహిత్ రెచ్చిపోయి ఆడాడు. మొత్తం 41 బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లతో 60 పరుగులు చేసిన రోహిత్ రిటైర్డ్ ఔట్ అయ్యాడు. సూర్యకుమార్ (38), హార్డిక్ పాండ్యా (14) పరుగులతో నాటౌట్‌గా మిగిలారు. కాగా టీ20 ప్రపంచకప్‌లో ఈనెల 24న పాకిస్థాన్‌తో పోరుతో భారత్ తన వేట ప్రారంభించనుంది.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
- India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
- Japan Cricket Team: జపాన్ ఆటగాళ్ల పేర్లు చూస్తే మైండ్ బ్లాంక్..? మన కామెంటేటర్లకు చుక్కలే పో..!
తాజావార్తలు
-
Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
-
Mandadi: కమెడియన్ అనుకుంటే స్టార్ హీరోల కటౌట్లే షేక్ చేశాడు! రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మందాడి’..
-
AP JUDA: స్టైపెండ్ పెంపుపై జూడాల అసంతృప్తి.. ప్రభుత్వానికి కోర్టు ధిక్కరణ నోటీసులు
-
Kartikeya Gummakonda : తన ‘కమ్‌బ్యాక్’ కోసం మెగాఫోన్ పట్టిన ‘ఆర్ఎక్స్ 100’ హీరో..
-
Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!