Harish Rao: రేవంత్ రెడ్డి వచ్చాక రెండు సార్లు రైతు భరోసా ఎగ్గొట్టారని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. వ్యవసాయానికి కరెంట్, నీళ్లు అవసరం అయితే కాంగ్రెస్ మాత్రం యాప్ లు, మ్యాప్ లు కావాలి అంటుందన్నారు. తాజాగా మెదక్‌లో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి వచ్చాక బస్ ఛార్జీలు రెండేళ్లలో రెండింతలు పెరిగాయి.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రైతు వ్యతిరేక ప్రభుత్వాలని ఆరోపించారు. రైతులకు యూరియా సరిపడ రెండు ప్రభుత్వాలు ఇవ్వట్లేదు.. కాంగ్రెస్ చేసే తుగ్లక్ పనులతో కౌలు రైతులు, రైతుల మధ్య పంచాయితీ జరుగుతుందని విమర్శించారు. ఎరువుల కోసం యాప్ తెచ్చి రైతులను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది.. సింగూరు ప్రాజెక్టుపై ఆధారపడ్డ రైతులకు క్లారిటీ ఇవ్వాలన్నారు. ఒక వేళ నీళ్లు ఇవ్వకుంటే ప్రకటన విడుదల చేసి నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు అడుగడుగునా కష్టాలే.. ఈ రోజు వరకు కూడా 40 శాతం రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందని చెప్పారు.
READ MORE: Lok sabha: జీ రామ్.. జీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. పత్రాలు చించేసిన విపక్ష సభ్యలు
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు అంశాల్లో ఫెయిల్ అయ్యిందని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. “యాసంగి 1200 కోట్ల బోనస్, వర్షాకాలం రూ. 600 కోట్ల బోనస్ నగదు ఇప్పటి వరకు ఇవ్వలేదు.. రైతు భరోసా ఇప్పటివరకు ఇవ్వలేదు.. మెదక్ రైతులు అగమ్యగోచరంగా ఉన్నారు.. ఘనపురం అనకట్ట నుంచి యాసంగి పంటకు నీళ్లు ఇస్తారా లేదా క్లారిటీ లేదు.. సింగూరు ప్రాజెక్టు మరమ్మతుల పేరిట నీళ్లు ఖాళీ చేస్తున్నారు.. గత వేసవిలో ప్రాజెక్టు మరమ్మతులు చేసే అవకాశం ఉన్నా చేయలేదు.. ప్రభుత్వం నుంచి స్పష్టత కోసం రైతులు ఎదురు చూస్తున్నారు.. సింగూరు ప్రాజెక్టు ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయానికి జీవనాధారం.. పదేళ్ల BRS పాలనలో బోరు బండ్లు లేవు.. ఇప్పుడు మళ్ళీ బోరు బండ్లు వచ్చాయి..” అని వ్యాఖ్యానించారు.
READ MORE: Delhi High Court: ఇద్దరి ఇష్టపూర్వకంగా విడాకులు కోరే దంపతులు.. కలిసి ఉండాల్సిన అవసరం లేదు