Rachamallu Sivaprasad Reddy: దొంగనోట్ల కేసులో అరెస్ట్ అయిన బొందిలి కార్పొరేషన్ డైరెక్టర్ రజనీ విషయంపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్‌రెడ్డి స్పందించారు. రసపుత్ర రజనీ వైఎస్ఆర్‌సీపీకి చెందిన మనిషేనని ఆయన స్పష్టం చేశారు. దొంగనోట్ల చలామణి కేసులో రజనీ బెంగళూరులో పోలీసులకు దొరికిందని తమకు సమాచారం అందిందని.. తమ కుమార్తెను బెంగుళూరులోని ఓ కాలేజీలో చేర్పించడానికి తన అన్న చరణ్ సింగ్ ఇంటికి రజనీ వెళ్లిందని.. చరణ్ సింగ్ ఇంట్లో దొంగ నోట్ల కేసులో […]
Road Accident: అమెరికాలోని సియాటిల్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆదోనీకి చెందిన కందుల జాహ్నవి అని పోలీసులు గుర్తించారు. వేగంగా వచ్చిన పోలీస్ కారు ఢీ కొట్టడంతో జాహ్నవికి తొలుత తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని యువతిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ తుదిశ్వాస వదిలింది. ఈమేరకు ప్రమాదం విషయాన్ని జాహ్నవి కుటుంబ సభ్యులకు […]
టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణపై మంత్రి రోజా మండిపడ్డారు. అక్కినేనిపై బాలయ్య వ్యాఖ్యలను ఆమె తప్పుబట్టారు. బాలయ్యకు వయసు పెరిగినా, ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచినా ఆయన తీరు మారడం లేదని మంత్రి రోజా ఆరోపించారు. బాలయ్య వ్యాఖ్యల వల్ల అక్కినేని అభిమానులు బాధపడ్డారని రోజా అన్నారు. ఇవే వ్యాఖ్యలు ఎన్టీఆర్‌పై చేస్తే ఎలా ఉంటుందో బాలయ్య ఆలోచన చేయాలని సూచించారు. అటు లోకేష్ దశ దిశా లేకుండా పాదయాత్ర అంటున్నాడని.. ప్రజలకు ఏం చేశారో చెప్పలేని వాళ్లు […]
Pawan Kalyan: విజయవాడలోని ఇంద్రకీలాద్రిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం ప్రత్యేకంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జనసేన ఎన్నికల ప్రచార రథం వారాహికి పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ ప్రచార రథంపై నుంచి జనసేనాని తొలిసారి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ సుభిక్షంగా ఉండాలని.. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి ముందుండాలని అమ్మవారిని కోరుకున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఏపీలో జరుగుతున్న అరాచకాలను దుర్గమ్మ చూస్తోందని పవన్ వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాలు […]
Fact Check: సోషల్ మీడియాలో అసలు ఏదో నకిలీ ఏదో కనిపెట్టడం కష్టంగా మారుతోంది. అయితే కొందరు నకిలీని అసలుగా భావించి వైరల్ చేస్తుండటం హాట్ టాపిక్‌గా మారింది. అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా వీరసింహారెడ్డి విజయోత్సవ సభలో బాలయ్య ఫ్లోలో అన్న మాటను పట్టుకుని ఒక వర్గం అదేపనిగా ట్రోల్ చేస్తోంది. అక్కినేని తొక్కినేని అని మాట్లాడటాన్ని భూతద్దంలో పెట్టి కొందరు విమర్శలు చేస్తున్నారు. ఈ మాటను బాలయ్య కావాలని మాట్లాడారా లేదా అన్న విషయం […]
Suryakumar Yadav: టీమిండియా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో వేగంగా 100 సిక్సర్లు కొట్టిన తొలి భారత ఆటగాడిగా సూర్యకుమార్ నిలిచాడు. ఇండోర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు సిక్సర్లు కొట్టి అతడు ఈ ఫీట్ సాధించాడు. సూర్యకుమార్ కేవలం 61 ఇన్నింగ్సులలోనే 100 సిక్సర్ల ఘనతను సాధించాడు. గతంలో హార్దిక్ పాండ్యా 101 అంతర్జాతీయ ఇన్నింగ్సులలో 100 సిక్సర్లు కొట్టి భారత్ తరఫున టాప్‌లో నిలిచాడు. […]
Team India: న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్ వన్డే ర్యాంకుల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అయితే తాము ర్యాంకులను పెద్దగా పట్టించుకోబోమని.. మైదానంలో ఎలా రాణించాలనేదానిపైనే చర్చిస్తామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. చివరి వన్డేలో తాను సెంచరీ చేయడం సంతోషంగా ఉందని.. కొంతకాలంగా రాణిస్తున్న తనకు ఈ సెంచరీ అదనపు మైలురాయి లాంటిదని తెలిపాడు. బోర్డుపై పరుగులు ఉన్నా ఇండోర్ లాంటి పిచ్‌పై ఎంతటి లక్ష్యం ఉన్నా సరిపోదని.. […]
Anilkumara Yadav: వచ్చే ఎన్నికల్లో నెల్లూరు నగరం నుంచి తానే పోటీ చేస్తానని వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. వచ్చే దఫా తన నియోజకవర్గం మారుస్తారని పుకార్లు షికార్లు చేస్తుండటంతో ఆయన ఈ ప్రకటన చేశారు. అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి జగన్ గీసిన గీత దాటడు అని మరొకసారి మళ్ళీ చెప్తున్నానని వివరించారు. తాను రాష్ట్రంలో తలవంచేది ఒకే ఒక్క జగన్‌కు మాత్రమే అని తెలిపారు. టీ […]
Pakistan: పాకిస్థాన్ క్రికెట్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవలే పాకిస్థాన్ క్రికెట్ టీమ్ చీఫ్ సెలెక్టర్‌గా ఎంపికైన మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు షాకిచ్చింది. అఫ్రిదిని చీఫ్ సెలెక్టర్ పదవి నుంచి తొలగించింది. అఫ్రిది స్థానంలో 69 ఏళ్ల హరూన్ రషీద్‌ను చీఫ్ సెలెక్టర్‌గా నియమిస్తున్నట్లు పీసీబీ వెల్లడించింది. కమిటీలోని మిగతా సభ్యుల పేర్లను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొంది. టీ20 ప్రపంచకప్ ఓటమి అనంతరం పీసీబీ ఛైర్మన్ పదవి బాధ్యతల నుంచి […]
Akkineni Controversy: వీరసింహారెడ్డి విజయోత్సవ సభలో హీరో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అక్కినేని తొక్కినేని అంటూ బాలయ్య వ్యాఖ్యానించడం అక్కినేని అభిమానులను తీవ్రంగా హర్ట్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో బాలయ్యను నెటిజన్‌లు ట్రోల్ చేస్తున్నారు. ఈ వివాదంపై తాజాగా అక్కినేని నాగచైతన్య కూడా స్పందించాడు. నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావు తెలుగు తల్లి కళామతల్లి ముద్దుబిడ్డలు అని.. వారిని అగౌరవపరచడం అంటే మనల్ని మనం కించపరుచుకోవడమేనని అక్కినేని […]