ఏపీ సీఎం జగన్‌ను ఉద్దేశిస్తూ టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యల కారణంగా రాజకీయ వేడి పులుముకుంది. ఆయన వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ కార్యకర్తలు తీవ్రస్థాయిలో ఆందోళన చేపట్టగా అది రణరంగంగా మారింది. పలువురు ఆందోళనకారులు టీడీపీ కార్యాలయాలపై దాడులకు పాల్పడ్డారు. ఈ దాడులపై ప్రతిపక్ష టీడీపీ మండిపడుతోంది. అయితే ఈ అంశంపై మంత్రి కొడాలి నాని ఎన్టీవీతో మాట్లాడారు. ఇది కూడా చదవండి: పట్టాభిరామ్ మాట్లాడింది దారుణమైన భాష: డీజీపీ టీడీపీ కార్యాలయాలపై దాడులను తాను […]
హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీ ఎత్తున హవాలా డబ్బు పట్టుబడింది. చిట్యాల పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా ఓ కారు అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో పోలీసులు ఆ వాహనాన్ని తనిఖీ చేసేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసుల తనిఖీలను పసిగట్టిన కారు డ్రైవర్ రూటు మార్చి తప్పించుకునే ప్రయత్నం చేయబోయి.. చివరకు పోలీసులకు దొరికిపోయాడు. కాగా టీఎస్ 10 EY 6160 నెంబర్ గల కియా కారును పోలీసులు తనిఖీ చేయగా అందులో రూ.4 కోట్ల నగదు పట్టుబడింది. దీంతో […]
అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్‌కు హిట్ రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వ్యాఖ్యానించాడు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా సక్సెస్ మీట్‌కు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. కరోనా కారణంగా ప్రజలు థియేటర్లకు రావాలంటే భయపడుతున్న సమయంలోనూ నాగచైతన్య, అఖిల్ అన్నదమ్ములు ఇద్దరూ హిట్ కొట్టారని బన్నీ అభినందించాడు. అక్కినేని అభిమానులకు ఇది గర్వకారణమన్నాడు. అఖిల్ ‘మనం’ సినిమాలో ఆయన తాతయ్య ఏఎన్ఆర్‌తో నటించడం […]
ఇప్పటికే పెట్రోల్ ధరలు, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో డీటీహెచ్ వినియోగదారులపైనా భారం పడనుంది. డిసెంబర్ 1 నుంచి డీటీహెచ్ ఛార్జీలు పెరగనున్నాయి. జీ, స్టార్, సోనీ, వయాకామ్ 18 వంటి పలు సంస్థలు కొన్ని పాపులర్ టీవీ ఛానళ్లను డిసెంబర్ 1 నుంచి తమ బొక్వెట్ నుంచి తొలగించనున్నాయి. దీంతో ఆయా ఛానళ్లను వీక్షించాలంటే అదనంగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. బొక్వెట్‌లో అందించే ఛానళ్ల ఛార్జీలు సగటున నెలకు రూ.15 […]
ఏపీలో టీడీపీ నేతల ఇళ్లు, పార్టీ కార్యాలయాలపై అధికార పార్టీ దాడులు చేయడాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. ఇప్పటివరకు జగన్ అంటే ముఖ్యమంత్రి అని గౌరవం ఉండేదని, కానీ ఆయన వికృతి బుద్ధి చూశాక సైకో, శాడిస్ట్, డ్రగిస్ట్ అని అంటున్నానని లోకేష్ వ్యాఖ్యానించారు. ఆనవాయితీలను తుంగలో తొక్కి ప్రజాస్వామ్యానికి పాతరేసి జగన్ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నాడని లోకేష్ ఫైరయ్యారు. ఆయన పతనానికి ఆయనే ఒక్కో ఇటుక పేర్చుకుంటున్నారని మండిపడ్డారు. […]
ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. టీడీపీ నేత నక్కా ఆనంద్‌బాబుకు విశాఖ జిల్లా పోలీసులు నోటీసులు పంపడంతో ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి వైసీసీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో వైసీపీ శ్రేణులు టీడీపీ కార్యాలయాల ముందు నిరసన చేపట్టాయి. అయితే ఈ నిరసనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. కాగా టీడీపీ కార్యాలయాలపై దాడులకు వైసీపీతో సంబంధం లేదని వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు స్పష్టం చేశారు. […]
ఏపీలో టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు చేసిన దాడిని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖండించారు. టీడీపీ కార్యాలయాలపై దాడులకు పాల్పడటం సరికాదన్నారు. ఏపీ చరిత్రలోనే ఇలాంటి దాడులు జరగలేదన్నారు. ప్రజాస్వామ్యానికి ఇలాంటి దాడులు మంచిదికాదని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీ ఆఫీసులపై, నాయకుల ఇళ్లపై దాడులు మరిన్ని అరాచకాలకు దారితీస్తాయని పవన్ అన్నారు. వైసీపీ దాడులపై కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టాలని ఆయన కోరారు. దాడులు చేసినవారిని తక్షణమే శిక్షించాలని ఏపీ పోలీస్ శాఖను డిమాండ్ చేశారు. […]
ఏపీలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దీంతో వైసీపీ శ్రేణులు పలు చోట్ల టీడీపీ కార్యాలయాలపై దాడులకు పాల్పడుతున్నాయి. వైసీపీ దాడులకు నిరసనగా రేపు (అక్టోబర్ 20) ఏపీ వ్యాప్తంగా బంద్ చేయాలని ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. పట్టాభి ఇంటిపై, టీడీపీ కార్యాలయాలపై దాడులకు పాల్పడటం దారుణమని, ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. తక్షణమే ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. మరోవైపు రాజకీయ […]
టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. దుబాయ్‌లో ఇటీవల కొత్తగా ప్రారంభించిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో విరాట్ కోహ్లీ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ మ్యూజియంలో ఇప్పటికే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, హాలీవుడ్ యాక్షన్ కింగ్ జాకీ చాన్, ఫుట్‌బాల్ స్టార్ డేవిడ్ బెక్‌హామ్, నటుడు టామ్ క్రూజ్ వంటి ప్రముఖుల విగ్రహాలు ఉన్నాయి. కాగా అక్టోబరు 14న మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియాన్ని అక్కడి నిర్వాహకులు […]
రాజస్థాన్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మీనా కున్వర్ తన భర్తతో కలిసి పోలీస్ స్టేషన్‌లోనే ధర్నాకు దిగారు. అసలు విషయంలోకి వెళ్తే.. ఇటీవల జోధ్‌పూర్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే మీనా కున్వర్ మేనల్లుడు పట్టుబడ్డాడు. దీంతో పోలీసులు ఎమ్మెల్యే మేనల్లుడిని అరెస్ట్ చేసి కారును సీజ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మీనా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ‘ఈరోజుల్లో పిల్లలందరూ తాగుతున్నారు. అయినా తాగితే తప్పేంటి? […]