ఏపీలో జనసేనకు ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు. రాజోలు నియోజకవర్గం నుంచి రాపాక వరప్రసాద్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే ఆయన ఇటీవల వైసీపీకి మద్దతు తెలుపుతున్నారు. కానీ అధికారికంగా వైసీపీలో చేరలేదు. అలా చేరితే పార్టీ ఫిరాయింపుల చట్టం కిందకు వస్తుంది. అప్పుడు అనర్హత వేటు పడే అవకాశముంటుంది. దీంతో ఆయన జనసేన ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. Read Also: గవర్నర్‌ను కలిసిన టీడీపీ నేతలు.. వైసీపీపై ఫిర్యాదు ఈ నేపథ్యంలో గురువారం వైసీపీ జనాగ్రహ దీక్షలు చేపట్టగా […]
టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ ముందడుగు వేసింది. ఎట్టకేలకు గ్రూప్ స్టేజీ నుంచి సూపర్ 12లోకి అడుగుపెట్టింది. గురువారం జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో పసికూన పపువా న్యూగునియాపై 84 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. సూపర్ 12లోకి వెళ్లాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆటగాళ్లు సత్తా చాటారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ మహ్మద్ నయీమ్ డకౌట్ అయినా షకీబ్ (46), లిటన్ దాస్ (29), కెప్టెన్ మహ్మదుల్లా (50) చెలరేగి […]
చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా 24 క్యారెట్ల బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుల వద్ద రూ.3 కోట్ల విలువైన 6 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. కేటుగాళ్లు సినీ ఫక్కీలో బంగారాన్ని తరలించే యత్నం చేశారు. దుబాయ్ నుంచి లగేజీ బ్యాగులో మోసుకొని వచ్చిన సెల్‌ఫోన్‌లలో బంగారాన్ని దాచి దర్జాగా తప్పించుకోవాలని చూశారు. బంగారాన్ని కరిగించి ల్యాప్‌టాప్, సెల్ ఫోన్ బ్యాటరీలుగా తయారు చేసి కేటుగాళ్లు అందులో దాచిపెట్టారు. Read Also: వైరల్: […]
హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రచార పోరు నడుస్తోంది. ఉప ఎన్నికకు సమయం ముంచుకువస్తుండటంతో అన్ని పార్టీలు జోరుగా ప్రచారం సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీ టీఆర్ఎస్ తమ అధినేత కేసీఆర్‌తో సభలు నిర్వహించేలా ప్రణాళికలు రచించింది. ఈనెల 27న హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి మండలం పెంచికల్ పేట గ్రామంలో కేసీఆర్ బహిరంగ సభ ఉంటుందని టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ఎన్నికల నిబంధనల ప్రకారం హుజురాబాద్ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ ఏర్పాటుకు వీలు లేకపోవడంతో ఈ […]
టీడీపీ కార్యాలయాలపై దాడుల అంశాన్ని ఆ పార్టీ సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో ఏపీ గవర్నర్ హరిచందన్‌ను గురువారం సాయంత్రం టీడీపీ నేతల బృందం కలిసింది. తమ పార్టీ కార్యాలయాలపై వైసీపీ నేతల దాడికి సంబంధించి గవర్నర్‌కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. వైసీపీపై చర్యలు తీసుకోవాలంటూ ఆయనకు వినతిపత్రం సమర్పించారు. దాడులపై వీడియో ఫుటేజీని కూడా గవర్నర్ కు అందజేశారు. గవర్నర్‌ను కలిసిన వారిలో అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు ఉన్నారు. […]
దేశంలోని పలు ప్రాంతాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఏపీలోని బద్వేల్, తెలంగాణలోని హుజురాబాద్ నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే దేశంలోని ఆయా ప్రాంతాల్లో ఉప ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో కోడ్ ఉల్లంఘనలు జరుగుతుండటంపై కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యింది. ఎన్నికలు జరిగే నియోజకవర్గంపై ప్రభావం చూపేలా పక్క నియోజకవర్గాలలో పలు రాజకీయ పార్టీలు కార్యక్రమాలు నిర్వహించడంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. Read Also: బద్వేల్ ఉపపోరు…ఆ రెండు పార్టీలకు షాక్ […]
తెలంగాణలో కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో 92.61 శాతం మంది అర్హత సాధించినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి ప్రకటించారు. అయితే ఈ కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్టులో పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా అర్హత సాధించారు. మహిళలు 41,131 మంది క్వాలిఫై కాగా పురుషులు 22,614 మంది మాత్రమే అర్హత సాధించడం గమనార్హం. అంటే పురుషుల కంటే రెట్టింపు స్థాయిలో మహిళలు క్వాలిఫై అయ్యారు. గత ఏడాది కూడా మహిళలే […]
సీఎం జగన్‌ను అసభ్యపదజాలంతో దూషించిన కేసులో టీడీపీ నేత పట్టాభిరామ్‌కు విజయవాడ 3వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. గురువారం మధ్యాహ్నం పట్టాభిని పోలీసులు కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి నవంబర్ 2 వరకు రిమాండ్ విధిస్తున్నట్లు తీర్పు వెల్లడించారు. ఈ సందర్భంగా పట్టాభి తన వాదనలను న్యాయమూర్తికి వినిపించారు. తాను ఎవరినీ వ్యక్తిగతంగా దూషించలేదని… ప్రభుత్వంలో ఉన్న లోపాలనే ప్రస్తావించానని తెలిపారు. తన ఇంటిపై వైసీపీ కార్యకర్తలు అనేకసార్లు దాడి చేశారని […]
సుధీర్‌బాబు హీరోగా నటించిన ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమా దీపావళి కానుకగా ఓటీటీ ప్రియులకు అందుబాటులోకి రానుంది. ఈ మూవీ డిజిటల్ హక్కులను జీ5 సంస్థ కొనుగోలు చేసింది. ఈ మేరకు దీపావళి సందర్భంగా నవంబర్ 4 నుంచి ఈ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు జీ5 సంస్థ ప్రకటన చేసింది. 70MM ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు ‘పలాస’ ఫేం కరుణకుమార్ దర్శకత్వం వహించాడు. Read Also: కోలుకున్న అడివి […]