బలగం దర్శకుడు వేణు దాదాపుగా రెండుళ్లుగా రెండవ సినిమాను స్టార్ట్ చేసేందుకు కష్టపడుతూనే ఉన్నాడు. ఎల్లమ్మ అనేకథ రాసుకుని టాలీవుడ్ మొత్తం చుట్టేశాడు వేణు. మొదట నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తుంది అన్నారు. కానీ అక్కడ సెట్ కాలేదు. అక్కడి నుండి యంగ్ హీరో నితిన్ దగ్గరకి చేరింది. తమ్ముడు ఎఫెక్ట్ తో నితిన్ కూడా పక్కన పెట్టేసాడు. ఆ తర్వాత బెల్లంకొండ పేరు వినిపించింది. అది కార్యరూపం దాల్చలేదు.
Also Read : Sukumar : ‘అవతార్: ఫైర్ అండ్ యాష్ పై సుకుమార్ సెన్సేషనల్ కామెంట్స్
ఇక లేటెస్ట్ గా టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ఎల్లమ్మ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడని వార్తలు హల్ చల్ చేశాయి. కానీ అధికారంగా ఎక్కడ కన్ఫర్మ్ కాలేదు. అటు దిల్ రాజు కూడా త్వరలోనే హీరో ఎవరనేది చెప్తామని గోవా ఫిల్మ్ ఫెస్టివల్ లో వెల్లడించారు. అయితే ఇప్పడు తెలుస్తున్న సమాచారం ఎల్లమ్మ సినిమాలో హీరోగా దేవిశ్రీ ప్రసాద్ ను ఫిక్స్ చేశారట. రెండు రోజుల క్రితం దేవిశ్రీ పై లుక్ టెస్ట్ జరిగింది. అలానే నిన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో అనౌన్స్ మెంట్ గ్లిమ్స్ కోసం వీడియో షూట్ చేశారు. గ్లిమ్స్ తో పాటు దేవి శ్రీ ప్రసాద్ హీరో అని అఫీషియల్ గా ప్రకటించబోతున్నారు. మొత్తనికి బలగం వేణు రెండేళ్ల నిరీక్షణకి ఫలితం దక్కింది. బలగం సినిమాతో ప్రియదర్శికి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాడు వేణు. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్న దేవీశ్రీ ప్రసాద్ కు కూడా ఎల్లమ్మ సినిమాతో హిట్ ఇస్తాడని ఆశిద్దాం.