తమిళ్ అగ్ర హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జైభీమ్’. ఈ మూవీ ట్రైలర్ విడుదలకు చిత్ర యూనిట్ ముహూర్తం ఫిక్స్ చేసింది. అక్టోబర్ 22న జై భీమ్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. వెంకటేష్ హీరో నటించిన ‘గురు’ చిత్రానికి దర్శకత్వం వహించిన సుధ కొంగర ఈ మూవీకి డైరెక్టర్. సూర్య హీరోగా ఆమె గతంలో ‘ఆకాశమే నీహద్దురా’ మూవీని తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు పొందారు. ఈ మూవీ ఓటీటీలో విడుదల కాగా జైభీమ్ కూడా ఓటీటీలోనే రిలీజ్ కానుంది.
దీపావళి పండగ సందర్భంగా జై భీమ్ మూవీ నవంబర్ 2 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఇటీవల ఈ మూవీ నుంచి విడుదలైన అదుపులేని పవర్ అంటూ సాగే పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ మూవీలో బడుగు, బలహీన వర్గాల కోసం పోరాడే లాయర్‌గా సూర్య కనిపించనున్నాడు. 1993లో తమిళనాడులో ఓ గిరిజన యువతి కోసం సీనియర్ అడ్వకేట్ చంద్రు పోరాటం చేశారు. ఇప్పుడు ఇదే కథాంశంతో జైభీమ్ మూవీ తెరకెక్కినట్లు తెలుస్తోంది.