టీమిండియా మాజీ క్రికెటర్, హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హెచ్‌సీఏ అధ్యక్ష పదవిపై అజారుద్దీన్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో హెచ్‌సీఏ అధ్యక్ష పదవి నుంచి అజారుద్దీన్ వెంటనే దిగిపోవాలని కోర్టు తీర్పు వెల్లడించింది. Read Also: వారెవ్వా… ఒకే ఓవర్‌లో 8 సిక్సర్లు కొట్టాడు కొన్ని నెలల క్రితం అజారుద్దీన్‌ను అధ్యక్ష పదవి నుంచి అపెక్స్ కౌన్సిల్ తొలగించింది. దీంతో అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అంబుడ్స్‌మన్ దీపక్ వర్మతో […]
ఏపీ సీఎం జగన్‌ను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో అరెస్ట్ చేసిన టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ను విజయవాడ గవర్నర్ పేట పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. గురువారం మధ్యాహ్నం విజయవాడలోని మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. తాను మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై న్యాయమూర్తికి పట్టాభి వివరణ ఇచ్చారు. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పట్టాభిపై పోలీసులు సెక్షన్ 153 (ఎ), 505 (2) , 353, 504 రెడ్ విత్ […]
కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ దూసుకుపోతున్న వేళ.. డబ్ల్యూహెచ్‌వో ప్రశంసలు కురిపించింది. ప్రపంచంలో 100 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పూర్తి చేసిన తొలి దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. దీంతో భారత్‌ను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ అభినందించారు. 100 కోట్ల డోసులను పంపిణీ చేసి భారత్ చరిత్ర లిఖించిందంటూ ప్రధాని మోదీ చేసిన ట్వీట్‌ను టెడ్రోస్ అథనోమ్ రీట్వీట్ చేశారు. కరోనా వైరస్ ముప్పు పొంచి ఉన్న వేళ ప్రజలను […]
ఇప్పటివరకు మనం క్రికెట్‌లో ఒక ఓవర్లో 6 సిక్సర్లు కొట్టడం చూశాం. కానీ ఆస్ట్రేలియాలో జరిగిన ఓ క్లబ్ క్రికెట్ మ్యాచ్‌లో అరుదైన సంఘటన జరిగింది. పెర్త్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెటర్ ఒకే ఓవర్‌లో 8 సిక్సులు కొట్టి ఔరా అనిపించాడు. ఈనెల 19న సొరెంటో డన్‌క్రెయిగ్ సీనియర్ క్లబ్, కింగ్‌స్లే ఉడ్‌వేల్ సీనియర్ క్లబ్ జట్ల మధ్య 40 ఓవర్ల మ్యాచ్ నిర్వహించారు. అయితే ఈ మ్యాచ్ రికార్డుల్లోకి ఎక్కడం విశేషం. […]
అమెరికాకు చెందిన ఓ బుడతడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఏడాది వయసు గల ఈ చిన్నారి నెల సంపాదన వింటే షాక్ అవ్వాల్సిందే. అయితే ఈ చిన్నారి ట్రావెల్ చేస్తూ కళ్లుచెదిరేలా సంపాదిస్తుండటం విశేషం. వివరాల్లోకి వెళ్తే… అమెరికాకు చెందిన జెస్ అనే మహిళకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టమట. అయితే గర్భవతిగా ఉన్న సమయంలో ట్రావెల్ చేయలేమోనని ఆమె భయపడిందట. వెంటనే ఈ మాటను తన భర్తకు చెప్పగా… అతడు ప్రోత్సహించాడట. దీంతో ఆమె ఓ సోషల్ […]
అమెజాన్ ప్రైమ్ తమ యూజర్లకు బ్యాడ్‌న్యూస్ అందించింది. కొత్త సినిమాలను, వెబ్ సిరీస్‌లను అందించే అమెజాన్ ప్రైమ్ ఇకపై ప్రియం కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో వార్షిక సబ్‌స్క్రిప్షన్ ధరలు 50 శాతం పెరగనున్నాయి. దీంతో ఇప్పటివరకు వార్షిక ఫీజు రూ.999 చెల్లిస్తే సరిపోయేది. అయితే ఇకపై రూ.1,499 చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు నెలవారీ, మూడు నెలల ప్లాన్‌లను కూడా అమెజాన్ ప్రైమ్ పెంచనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నెలవారీ ప్లాన్ రూ.129 ఉండగా ఇకపై రూ.179 చెల్లించాలి. […]
టీ20 ప్రపంచకప్‌లో ఈనెల 24న పాకిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది. ఈ టోర్నీలో భారత్‌కు ఇదే తొలి మ్యాచ్ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు జరిగిన ప్రపంచకప్‌లలో పాక్‌పై టీమిండియాకు ఓటమి అన్నదే లేకపోవడంతో ఈసారి ఫలితం ఎలా వస్తుందో అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌తో తలపడే టీమిండియా డ్రీమ్ ఎలెవన్‌ను భారత మాజీ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రకటించాడు. అయితే ఈ జట్టులో సీనియర్ స్పిన్నర్ అశ్విన్‌కు పఠాన్ చోటివ్వలేదు. ఓపెనర్లుగా […]
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టలేదు. పలు చోట్ల ఇంకా డబుల్ డిజిట్‌లోనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 191 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇదే సమయంలో 162 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా నమోదైన కేసులతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,69,556కి చేరింది. కరోనా నుంచి 6,61,646 మంది కోలుకోగా మొత్తం 3,942 […]
హైదరాబాద్ నగరంలో మీరు పార్కులకు వెళ్తున్నారా? అయితే మీ కోసం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) శుభవార్త తెలిపింది. సంజీవయ్య, లుంబినీ పార్క్, ఎన్టీఆర్ గార్డెన్స్‌కు వెళ్లే పర్యాటకుల వద్ద కెమెరాల కోసం ఇకపై ఫీజులు వసూలు చేయబోమని HMDA వెల్లడించింది. గతంలో ఈ మూడు పార్కుల్లోకి కెమెరాతో వెళ్తే అదనంగా రూ.1000 వసూలు చేసేవారు. ఇప్పుడు కెమెరాలకు, వీడియో కెమెరాలకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదని HMDA ప్రకటించింది. ప్రజల విజ్ఞప్తుల మేరకు […]
టీడీపీ అధినేత చంద్రబాబుపై బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఫైర్ అయ్యారు. ఏపీలో టీడీపీ కార్యాలయాలపై జరుగుతున్న దాడులపై కేంద్రం దృష్టి పెట్టాలన్న చంద్రబాబు వ్యాఖ్యలను ఆయన ఖండించారు. గతంలో సీఎంగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంతో చంద్రబాబు ఎలా ప్రవర్తించారో, అప్పుడు ఏం మాట్లాడారో ఒకసారి గుర్తుచేసుకోవాలని హితవు పలికారు. అప్పట్లో ఏపీలోకి అడుగుపెట్టడానికి కేంద్ర ప్రభుత్వానికి అర్హత లేదని చంద్రబాబు అన్నారని జీవీఎల్ ఆరోపించారు. ఇప్పుడు ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఏం ముఖం […]