యాదాద్రి పుణ్యక్షేత్రం పునః ప్రారంభ ముహూర్తాన్ని చినజీయర్‌స్వామి ఖరారు చేసిన నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం మధ్యాహ్నం యాదాద్రిలో పర్యటించారు. దాదాపుగా పూర్తికావస్తున్న ఆలయ పునర్నిర్మాణ పనులను, ప్రధానాలయం, గర్భగుడిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా పరిశీలించారు. ఏరియల్ వ్యూ ద్వారా యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులతో పాటు పరిసరాలన్నింటినీ పరిశీలించారు. పెంబర్తి కళాకారులు తయారుచేసిన ప్రధానాలయ ద్వారాలను సీఎం ప్రత్యేకంగా పరిశీలించారు. ప్రాంగణంలోని ఆలయ ప్రాకారం వెంట ఉన్న శిల్పాల ప్రత్యేకతలను వెంట ఉన్నవారికి వివరించారు. […]
ఏపీలో పెరిగిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ చిత్తూరు జిల్లా రేణిగుంటలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు ర్యాలీ చేపట్టాయి. అయితే ఈ ర్యాలీ కాసేపటికే రసాభాసగా మారిపోయింది. ప్రశాంతంగా ర్యాలీ నిర్వహిస్తున్న టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. టీడీపీ చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న తిరుపతి పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు నరసింహ యాదవ్, శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డిపై వైసీపీ మహిళా కార్యకర్తలు చెప్పులు, చీపుర్లను విసరడంతో కాసేపు […]
దసరా, బతుకమ్మ పండగల సందర్భంగా తెలంగాణలో ఆర్టీసీకి భారీ స్థాయిలో ఆదాయం సమకూరింది. పండగలకు సొంతూళ్లకు వెళ్లిన ప్రయాణికులు సోమవారం నాడు తిరుగుప్రయాణం అయ్యారు. ప్రైవేట్ ట్రావెల్స్ అడ్డగోలు దోపిడీ చేస్తుండటంతో ప్రజలు ఆర్టీసీనే నమ్ముకున్నారు. దీంతో ఈనెల 18వ తేదీ ఒక్కరోజే టీఎస్ఆర్టీసీకి రూ.14.79 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. సోమవారం నాడు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ బస్సులు 36.3 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు ఆయన తెలిపారు. పండగల […]
టీ 20 ప్రపంచకప్‌లో టీమిండియా కూర్పు ఎలా ఉంటుందో అన్న విషయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. యూఏఈలో పిచ్‌లు స్పిన్‌కు ఎక్కువగా అనుకూలిస్తున్న నేపథ్యంలో ముగ్గురు స్పిన్నర్లను ఆడించాలా లేదా ఇద్దరు స్పిన్నర్లను ఆడించాలా అన్న అంశంపై టీమిండియా కెప్టెన్ కోహ్లీ సతమతం అవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మను ఆడించకుండా ఇషాన్ కిషన్‌ను పరీక్షించారు. ఈ టెస్టులో నూరు శాతం ఇషాన్ పాసయ్యాడు. ముఖ్యంగా […]
దేశంలో కరోనా వైరస్ ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. దీంతో దేశమంతటా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా నడుస్తోంది. ప్రతి ఒక్కరూ కరోనా టీకాను తప్పనిసరిగా తీసుకుంటున్నారు. రేపటితో భారత్‌లో కరోనా టీకాల డోసులు 100 కోట్లకు చేరుకోనున్నాయి. 130 కోట్ల భారతావనిలో ఇప్పటివరకు 70 కోట్ల మంది ప్రజలు కరోనా టీకా తొలి డోస్, 29 కోట్ల మంది ప్రజలు సెకండ్ డోస్‌లను వేయించుకున్నారు. భారత్‌లో జనవరి 16న కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన […]
దేశ వ్యాప్తంగా టమోటా ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో టమోటా పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా టమోటా పంటలు ఎక్కువగా పండే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో రైతులు చాలా నష్టపోయారు. ఈ నేపథ్యంలో రైతులు తమ నష్టాన్ని ధరలు పెంచి భర్తీ చేసుకుంటున్నారు. అకాల వర్షాల వల్ల టమోటాల సరఫరా తక్కువ కావడంతో డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యమైన వెజిటబుల్ […]