అందంగా మేకప్ చేయించుకోవాలని భావించే వారికి హైదరాబాద్‌లోని మహదీయ మేకప్ స్టూడియో బెస్ట్ ఛాయిస్. మహదీయ సంస్థ తమ నూతన మేకప్ స్టూడియోను హైదరాబాద్ నడిబొడ్డున ఉండే బంజారాహిల్స్ వద్ద ఏర్పాటు చేసింది. మహదీయ సంస్థ వైవిధ్యమైన బ్రాండ్ గుర్తింపుతో ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వినోద ప్రపంచంలో సుప్రసిద్ధమైన వ్యక్తులు అతిథులుగా హాజరయ్యారు. ఈ అతిథుల్లో తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీతో పాటుగా సూపర్‌స్టార్ మహేష్‌బాబు సతీమణి నమ్రత శిరోద్కర్, భారతీయ మోడల్, నటుడు […]
ప్రభుత్వ ఆస్పత్రులపై ఎక్కువ మంది ప్రజలకు నమ్మకం ఉండదు. అక్కడ ఎక్విప్‌మెంట్ సరిగ్గా ఉండదని, వైద్యులు బాధ్యతగా వ్యవహరించరని అనుకుంటూ ఉంటారు. అందుకే వారు ప్రైవేట్ ఆస్పత్రులకు ప్రాధాన్యత ఇస్తారు. కానీ ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ మెరుగైన చికిత్స అందుతుందంటూ ప్రజలందరికీ నమ్మకం కలిగించాలని పలువురు రాజకీయ నేతలు, అధికారులు తాపత్రయపడుతుంటారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ఓ జిల్లా కలెక్టర్ తన భార్యకు గవర్నమెంట్ ఆస్పత్రిలో ప్రసవం చేయించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా […]
విరాట్ కోహ్లీ తర్వాత భారత్ టీ20 జట్టుకు హిట్ మ్యాన్ రోహిత్ శర్మను కెప్టెన్‌గా ఎంపిక చేయాలని బీసీసీఐ తీసుకున్న నిర్ణయం వెనుక అనేక కారణాలున్నాయి. రోహిత్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు సహా గతంలో భారత జట్టుకు తాత్కాలిక కెప్టెన్‌గా ఎన్నో విజయాలను అందించాడు. ముఖ్యంగా ఐపీఎల్‌లో ఏ కెప్టెన్‌కు సాధ్యపడని రీతిలో ముంబై జట్టుకు ఐదుసార్లు టైటిల్‌ను అందించాడు. మరోవైపు వన్డేల్లో భారత్ కెప్టెన్‌గా 10 మ్యాచ్‌లకు సారథ్యం వహించిన రోహిత్… 8 మ్యాచ్‌లలో […]
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా ఎంతో మంది కుటుంబాల్లో విషాదం నెలకొంది. చాలామంది చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారారు. మరికొందరు కుటుంబసభ్యులను కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయారు. ఈ నేపథ్యంలో కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు కనీస నష్టపరిహారం చెల్లించాలని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో ప్రతి కరోనా మరణానికి రూ.50వేల పరిహారం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. Read Also: మరో రికార్డు సొంతం చేసుకున్న ప్రధాని మోదీ ఈ మేరకు […]
చలికాలం ప్రారంభం కావడంతో పొగమంచు హైదరాబాద్ నగరాన్ని కప్పేస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున రాజేంద్రనగర్-హైదర్ షాకోట్ ప్రధాన రహదారిపై కారు బీభత్సం సృష్టించింది. పొగమంచు కారణంగా రోడ్డు కనబడక పోవడంతో ఓ కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు వారిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కారు సన్ సిటీ నుంచి మెహిదీపట్నం వైపు వెళ్తుండగా […]
టీ20 ప్రపంచకప్‌లో లీగ్ మ్యాచ్‌లు ముగిశాయి. ఇక నాకౌట్ మ్యాచ్‌ల సమరం ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఈరోజు జరగనున్న తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లు 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో హోరాహోరీగా తలపడిన సంగతి ఇంకా క్రికెట్ ప్రియులకు గుర్తుండే ఉంటుంది. ఆనాడు జరిగిన నాటకీయ పోరులో సాంకేతికంగా ఇంగ్లండ్ విజేతగా నిలిచినా.. న్యూజిలాండ్ కూడా అద్భుతంగా పోరాడి అభిమానుల మనసులను దోచుకుంది. అబుదాబీ వేదికగా జరగనున్న […]
భారత టీ20 కెప్టెన్‌గా ముంబైకి చెందిన రోహిత్ శర్మ ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే టీమిండియాలో అంతర్గత విభేదాలు ఉన్నాయంటూ పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్, మాజీ లెగ్ స్పిన్నర్ ముస్తాక్ అహ్మద్ ఆరోపించాడు. భారత జట్టుకు ఎక్కువ విజయాలు అందించిన విరాట్ కోహ్లీ టీ20లకు ఉన్నట్టుండి రాజీనామా ప్రకటించడం.. డ్రెస్సింగ్ రూంలో వాతావరణం బాగోలేదని చెప్పడానికి నిదర్శనమన్నాడు. ప్రస్తుతానికి టీమిండియాలో రెండు గ్రూపులు కనిపిస్తున్నాయని.. అందులో ఒకటి ఢిల్లీ గ్రూప్.. రెండోది ముంబై గ్రూప్ అని వ్యాఖ్యలు […]
భారత ప్రధాని మోదీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ట్విట్టర్‌లో 2021 సంవత్సరానికి ప్రపంచంలో అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో ప్రధాని మోదీ రెండో స్థానంలో నిలిచారు. ఈ విషయాన్ని వినియోగదారుల నిఘా కంపెనీ ‘బ్రాండ్ వాచ్’ తమ వార్షిక నివేదిక ద్వారా వెల్లడించింది. మొత్తం 50 మంది వ్యక్తులతో విడుదల చేసిన ఈ జాబితాలో తొలి స్థానంలో అమెరికన్ సింగర్ టేలర్ స్విఫ్ట్ మొదటి స్థానంలో నిలిచారు. రెండో స్థానంలో మోదీ, మూడో స్థానంలో సింగర్ […]
సికింద్రాబాద్-విశాఖ మధ్య ప్రత్యేకరైళ్లను ఏర్పాటు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే వెల్లడించింది. ఈ నెల 17, 24 తేదీల్లో స్పెషల్ రైళ్లు తిరగనున్నాయి. ఆయా తేదీల్లో రాత్రి 9:05 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరనున్న రైలు.. తర్వాతి రోజు ఉదయం 9:50 గంటలకు విశాఖ చేరుతుంది. అలాగే విశాఖలో ఈ నెల 16, 23 తేదీల్లో సాయంత్రం 5:35 గంటలకు బయల్దేరనున్న రైలు.. తర్వాతి రోజు ఉదయం 7:10 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. స్పెషల్ రైళ్లకు దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, […]
కరోనా సంక్షోభం దేశవ్యాప్తంగా అన్ని రంగాలకు ఎఫెక్ట్ చూపించింది. ఇందులో సినిమా రంగం కూడా ఉంది. ముఖ్యంగా ఇండియన్ సినిమాకు బాలీవుడ్ పరిశ్రమ ఆయువుపట్టు లాంటిది. కానీ కరోనా సెకండ్ వేవ్ తర్వాత బాలీవుడ్‌లో విడుదలైన సినిమాలు ఆదరణ నోచుకోవడంలో విఫలమయ్యాయి. అయితే ఎట్టకేలకు ఓ సినిమా బాలీవుడ్‌కు ఊపిరి అందించిందనే చెప్పాలి. అదే రోహిత్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ‘సూర్యవంశీ’. ఈ మూవీలో దీపావళి కానుకగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబడుతోంది. Read […]