విశాఖపట్నం జిల్లా యలమంచిలిలో నాగుల చవితి సందర్భంగా నిర్వహించిన నేల వేషాల కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది. సంతోష్ అనే వ్యక్తి నోట్లో డీజిల్ పోసుకుని విన్యాసాలు చేస్తుండగా.. మంటలు అంటుకుని అతడి ముఖానికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో అక్కడే ఉన్న స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేయగా.. అప్పటికే సంతోష్ చేతిలోని సీసాలో ఉన్న డీజిల్ పడి మంటలు మరింత తీవ్రమయ్యాయి. Read Also: బట్టల షాపులోకి దూసుకెళ్లిన పల్సర్ బైక్.. ఎగిరిపడ్డ యువకుడు ఈ ఘటనలో […]
జగన్ ప్రభుత్వానికి, వైసీపీ నేతలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. అనంతపురం జిల్లాలో ఎయిడెడ్ కాలేజీల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేయగా.. వారిని పరామర్శించేందుకు లోకేష్ బుధవారం ఉదయం అనంతపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు టీడీపీ నేతలు ఘనస్వాగతం పలకగా.. అనంతరం ప్రభుత్వం తమపై కేసులు పెడుతోందంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో లోకేష్ వారికి ధైర్యం చెప్పి టీడీపీ అధికారంలోకి […]
హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ బుధవారం మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేశారు. తొలుత గన్‌పార్కులోని అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించిన ఈటల రాజేందర్.. అనంతరం అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్‌లో ఈటల రాజేందర్‌తో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, తుల ఉమ, ఏనుగు రవీందర్‌రెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఇప్పటిదాకా ఏడుసార్లు ఈటల ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ఆరుసార్లు టీఆర్ఎస్, ఒకసారి బీజేపీ […]
దేశంలో నిత్యం రోడ్డుప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే రోడ్డుప్రమాదం ఎప్పుడు.. ఎలా జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. ప్రమాదం జరిగిన వెంటనే కొంతమంది ప్రాణాలు గాల్లో కలిసిపోవడం అయితే ఖాయం. ఒక్కోసారి పెద్ద ప్రమాదం జరిగినా… భూమి మీద నూకలు ఉన్నవాళ్లు బతికి బయటపడతారు. అలా కొన్ని ప్రమాదాలు విషాదాన్ని నింపుతాయి. కొన్ని ప్రమాదాలు మాత్రం ఆశ్చర్యం కలిగిస్తాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో ఓ రోడ్డుప్రమాదం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. Read Also: ఆంటీ కోసం ఉరివేసుకుని యువకుడి […]
మహబూబ్‌నగర్ జిల్లాలో ఓ యువకుడు ఆంటీ కోసం ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. జిల్లాలోని దేవరకద్ర మండలం గోపన్‌పల్లికి చెందిన ఓ యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ పెళ్లయిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అయితే ఇది వివాదానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ 20 రోజుల కిందట ఆత్మహత్యాయత్నం చేశారు. Read Also: ఆర్టీసి కీలక నిర్ణయం: ఉదయం 4 గంటల నుంచే సిటీ సర్వీసులు ఈ ఘటనలో మహిళ […]
ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా రాజకీయాల్లో చాలా కాలం నుంచి పరిటాల కుటుంబం, జేసీ కుటుంబం బద్ధ శత్రువులుగా ఉన్నాయి. గతంలో జేసీ కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉండగా… పరిటాల కుటుంబం మాత్రం తెలుగుదేశం పార్టీతో అనుబంధం కొనసాగిస్తూ వస్తోంది. అయితే 2014 తర్వాత జేసీ కుటుంబం కూడా టీడీపీలో చేరడంతో ఈ రెండు వర్గాల మధ్య క్రమంగా దూరం తగ్గుతూ వస్తోందని టాక్ నడిచింది. Read Also: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు […]
భారత్-పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయంటే ప్రతి క్రికెట్ అభిమాని టీవీకి అతుక్కుపోవాల్సిందే. ఈ నేపథ్యంలో దాదాపు రెండేళ్ల తర్వాత దాయాది జట్లు సమరానికి దిగాయి. దీంతో టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సరికొత్త రికార్డు సృష్టించింది. అక్టోబర్ 24న జరిగిన ఈ మ్యాచ్‌ను ప్రపంచవ్యాప్తంగా 16 కోట్ల 70 లక్షల మంది వీక్షించారట. ఈ విషయాన్ని స్వయంగా ఈ మ్యాచ్ ప్రసారం చేసిన స్టార్ నెట్‌వర్క్ తెలియజేసింది. Read Also: కెప్టెన్‌గా రోహిత్ […]
గోపీచంద్, నయనతార జంటగా నటించిన ‘ఆరడగుల బుల్లెట్’ సినిమా అక్టోబర్ 8న థియేటర్లలో విడుదలైంది. అయితే ఆశించిన రీతిలో ఈ సినిమా ఫలితం సాధించడంలో విఫలమైంది. తాజాగా ఈ మూవీలో ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కింది. ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. ఆయన మార్కు కత్తులు, వ్యాన్‌లు గాల్లోకి ఎగరడం అన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. […]
తెలంగాణలో టి-డయాగ్నోస్టిక్స్ పథకంలో భాగంగా ఇప్పటికే 20 జిల్లాల్లో రోగ నిర్ధారణ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. తాజాగా మరో 13 చోట్ల నెలకొల్పేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇవి కాకుండా మరో 8 వైరాలజీ ల్యాబ్‌లను సైతం ప్రభుత్వం అందుబాటులోకి తేనుంది. ఇందుకు సంబంధించి తెలంగాణ సర్కారు రూ.96.39 కోట్లు విడుదల చేసింది. ఈ డయాగ్నోస్టిక్ సెంటర్లలో 56 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తారు. కొత్త డయాగ్నోస్టిక్ సెంటర్లను జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, మంచిర్యాల, మేడ్చల్ […]
ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ విద్యావేత్త, ప్రవాసాంధ్రుడు లకిరెడ్డి బాలరెడ్డి (88) అనారోగ్యంతో బాధపడుతూ అమెరికాలో కన్నుమూశారు. కృష్ణా జిల్లా మైలవరం మండలం వెల్వడంలో జన్మించిన ఆయన పేరుతో ఇంజినీరింగ్ కాలేజీ కూడా నడుస్తోంది. సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన ఆయన ఉస్మానియా కాలేజీలో బీఎస్సీ డిగ్రీ, బీటెక్ కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ కూడా అందుకున్నారు. 1960లో అమెరికా వెళ్లి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో కెమికల్ ఇంజినీరింగ్‌లో ఎంఎస్ పూర్తి […]