మేకప్ చేయించుకోవాలని అనుకునేవారికి బెస్ట్ ఛాయిస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అందంగా మేకప్ చేయించుకోవాలని భావించే వారికి హైదరాబాద్‌లోని మహదీయ మేకప్ స్టూడియో బెస్ట్ ఛాయిస్. మహదీయ సంస్థ తమ నూతన మేకప్ స్టూడియోను హైదరాబాద్ నడిబొడ్డున ఉండే బంజారాహిల్స్ వద్ద ఏర్పాటు చేసింది. మహదీయ సంస్థ వైవిధ్యమైన బ్రాండ్ గుర్తింపుతో ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వినోద ప్రపంచంలో సుప్రసిద్ధమైన వ్యక్తులు అతిథులుగా హాజరయ్యారు. ఈ అతిథుల్లో తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీతో పాటుగా సూపర్‌స్టార్ మహేష్‌బాబు సతీమణి నమ్రత శిరోద్కర్, భారతీయ మోడల్, నటుడు అలీ రెజా, భారతీయ మోడల్, నటుడు మరియు టెలివిజన్ పర్సనాలిటీ రోహిత్ ఖండేల్‌వాల్, ఎంటీవీ రోడీస్ పోటీదారు జబీ ఖాన్ ఉన్నారు.
ఈ ప్రారంభోత్సవ సందర్భంగా మహదీయ దర్వేష్ మాట్లాడుతూ.. ‘ నా చిన్నతనం నుంచి నాకు మేకప్ అంటే ప్రత్యేక అభిమానం ఉండేది. నా కల నిజమైన రోజు ఇది. నా కల సాకారం కావడంలో మా నాన్న నాకు ఎంతగానో సహాయపడ్డారు. నా స్టూడియో తన గురించి తాను ఎంతగానో వెల్లడిస్తుంది. ఈ స్టూడియో గోడలు, డెకార్‌కు విలాసమే స్ఫూర్తి. ఈ మహదీయాస్ మేకప్ స్టూడియో ప్రధాన లక్ష్యం , వినియోగదారుల సంతృప్తి. ఇక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరి మోములోనూ చిరు నవ్వు చూడాలన్నది నా కోరిక. కలలకు వాస్తవ రూపాన్ని ఈ స్టూడియో అందిస్తుంది’ అని అన్నారు.
Also Read
- Gut Health: జీర్ణక్రియ మెరుగుపడాలంటే..? రోజువారీ ఆహారంలో ఈ ఐదు చేర్చండి
- White Shoes Cleaning Tip: వైట్ షూపై మొండి మరకలు పోవడం లేదా?.. రూ.10తో తెల్లటి బూట్లకు కొత్త లుక్..
- Diabetes: తల్లిదండ్రులకు మధుమేహం ఉంటే మీకు వస్తుందా?
- Soft Roti Tips: పెనం నుంచి తీయగానే రోటీ గట్టిపడిపోతోందా? ఈ సింపుల్ టిప్‌తో రోజంతా సాఫ్ట్‌గా!
ఈ స్టూడియో పలు రకాల సేవలను అందిస్తోంది. వీటిలో అన్ని సందర్భాలకూ తగిన రీతిలో మేకప్స్, హెయిర్‌డూస్, అన్ని రకాల డ్రేపింగ్స్, జ్యువెలరీ శైలి మొదలైనవి ఉన్నాయి. వివాహం, పార్టీలు, పండుగలు మొదలైన సందర్భాల కోసం అత్యుత్తమ ఔట్‌ఫిట్స్, ఆభరణాల అవసరాలను సైతం ఇది తీరుస్తుంది. ఇక్కడి మేకప్ నైపుణ్యత, ఇతరులకు భిన్నంగా మహదీయ స్టూడియోను నిలుపుతుంది. ఈ స్టూడియో అత్యంత విలాసవంతమైన ప్రాంగణంలో ఉంది. ఆధునిక, క్లాసికల్ అందాల సమ్మేళనంలా ఈ స్టూడియో ఉంటుంది. వినియోగదారులకు వినూత్నమైన అనుభవాలను అందించడానికి మహదీయ కట్టుబడి ఉంది. దీని కలర్ పాలెట్, బంగారం, ఆఫ్ –వైట్, బీగ్, మరూన్ రంగులలో ఉంటుంది. మహదీయ మేకప్ స్టూడియో విలాసవంతమైన, పర్శియన్–ఇరానియన్ స్ఫూర్తిని ప్రతిబింబించడంతో పాటుగా అన్ని విధాలుగా ప్రత్యేక అనుభవాలను మిగులుస్తుంది.
ఇరాన్‌లోని మేకప్ సంస్కృతితో అధికంగా స్ఫూర్తి పొందిన మహదీయ, ఆ స్ఫూర్తిని ఇండియాకు తీసుకురావాలని కోరుకోవడమే కాదు.. ఈ రెండు సంస్కృతుల అద్భుతమైన సమ్మేళనం సృష్టించాలని, అదీ ఇతరులకు భిన్నంగా ఉండేలా ప్రత్యేక నైపుణ్యం ప్రదర్శించాలని భావిస్తోంది. ప్రతి సందర్భంలోనూ స్టైల్ స్టేట్‌మెంట్ సృష్టించాలనుకునే ప్రతి ఒక్కరికీ ఈ స్టూడియో సహాయపడుతుంది.
తాజావార్తలు
-
JNU: జేఎన్ యూ ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. 10 మంది విద్యార్థినుల ఫిర్యాదులు, ICC దర్యాప్తు
-
Nandamuri Mokshagna : నేడు చిన్న సింబా బర్త్ డే.. ఎంట్రీ అప్డేట్ ఉంటుందా ?
-
Fatima Sana: భారత్‌తో మ్యాచ్‌లో అదే మా కొంపముంచింది.. ఏడ్చేసిన పాక్ కెప్టెన్ ఫాతిమా సనా!
-
Göbekli Tepe: పిరమిడ్లకంటే వేల ఏళ్ల ముందు నిర్మించిన ఆలయం.. దానిని నిర్మించినవాళ్లే ఎందుకు పూడ్చిపెట్టారు?
-
Anushka Shetty : అనుష్క శెట్టి సినిమాలకు ఇక గుడ్‌బై చెప్పేసినట్టేనా?
ట్రెండింగ్
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!