భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా పాకిస్థాన్ క్రికెట్ ఆటగాడు షోయబ్ మాలిక్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే పాకిస్థాన్ వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సానియా మీర్జా టెన్నిస్‌లో భారత్ తరఫునే ఆడుతోంది. తాజాగా దుబాయ్‌లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో సానియా మీర్జా పాకిస్థాన్‌కు మద్దతు ఇవ్వడంపై సోషల్ మీడియాలో ఆమెపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. గురువారం ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో స్టేడియంలో సానియా […]
దేశవ్యాప్తంగా 2019-20 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి అత్యధిక విరాళాలు సేకరించిన ప్రాంతీయ పార్టీలలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అగ్రస్థానంలో నిలిచింది. టీఆర్ఎస్ పార్టీకి విరాళాల రూపంలో రూ.89 కోట్లు వచ్చినట్లు ఏడీఆర్ అనే సంస్థ వెల్లడించింది. ఈ జాబితాలో తెలుగు దేశం పార్టీ (టీడీపీ) రెండో స్థానంలో ఉంది. టీడీపీకి విరాళాల రూపంలో రూ.81 కోట్లు వచ్చాయి. అటు ఏపీలో అధికార పార్టీ వైఎస్ఆర్‌సీపీకి విరాళాల రూపంలో రూ.74 కోట్లు సమకూరినట్లు ఏడీఆర్ తెలిపింది. దేశవ్యాప్తంగా […]
సూర్యాపేట జిల్లా కోదాడలో విషాదం చోటుచేసుకుంది. టీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు కడుతూ కరెంట్ షాక్‌కు గురై ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే… కేంద్రం ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలంటూ శుక్రవారం నాడు తెలంగాణ వ్యాప్తంగా అధికార టీఆర్ఎస్ పార్టీ నిరసనలు, ధర్నాలకు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా కోదాడ పట్టణంలోని రంగా థియేటర్ వద్ద టీఆర్ఎస్ ధర్నాకు సంబంధించిన ఫ్లెక్సీ కడుతుండగా బంజారా కాలనీకి చెందిన కందుకూరి సునీల్ (23) అనే యువకుడు కరెంట్ షాక్‌తో అక్కడికక్కడే […]
హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్ ఫకీర్‌వాడలో దారుణం చోటుచేసుకుంది. కేవలం రూ.2వేలు నగదు కోసం మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి స్నేహితుడినే హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 27 ఏళ్ల సోనూ అనే వ్యక్తి బతుకుదెరువు కోసం ఆరేళ్ల క్రితమే హైదరాబాద్‌కు వచ్చాడు. ముషీరాబాద్‌లో నివాసముంటూ కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి స్థానికంగా ఓ మటన్‌షాపులో ఉండే అల్తాఫ్ ఖాన్‌తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వారిద్దరూ స్నేహితులుగా మారారు. Read Also: పబ్‌జీ గేమ్ […]
విశాఖ జిల్లా అరకు వెళ్లే రైలు మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. కొత్తవలస-కిరండోల్ మార్గంలో చిమిడిపల్లి 66వ కి.మీ. వద్ద కొండ రాళ్లు జారి రైల్వే ట్రాక్‌పై పడ్డాయి. విద్యుత్ లైన్‌పైనా బండ రాళ్లు పడటంతో విద్యుత్ వైర్లు తెగిపడిపోయినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు కొండరాళ్లను తొలగించేందుకు తక్షణ సహాయక చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కొత్తవలస-కిరండోల్ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అరకు, బొర్రా గుహలు వెళ్లేందుకు పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు […]
టీ20 ప్రపంచకప్ ముగియగానే న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ సందర్భంగా మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. ఇప్పటికే టీ20 సిరీస్‌కు విరాట్ కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతి ఇవ్వగా.. అతడు తొలి టెస్టుకు కూడా దూరంగానే ఉంటాడని తెలుస్తోంది. మరోవైపు టీ20లకు కెప్టెన్‌గా ఎంపికైన రోహిత్ శర్మ టెస్ట్ సిరీస్‌కు దూరంగా ఉండనున్నాడు. దీంతో తొలి టెస్టుకు వైస్ కెప్టెన్ రహానె సారథ్యం వహించనున్నాడు. రెండో టెస్టు నుంచి కోహ్లీ అందుబాటులోకి వస్తాడని.. ఆ టెస్టుకు […]
కుర్రకారును విశేషంగా ఆకట్టుకున్న పబ్‌జీ గేమ్‌పై గత ఏడాది కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. భారత్‌లో చైనా పాల్పడుతున్న దుశ్చర్యలను నిరసిస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా పలు చైనా యాప్‌లపైనా ఉక్కుపాదం మోపింది. అయితే నిషేధానికి గురైన పబ్‌జీ గేమ్ తిరిగి కొత్త పేరుతో భారత్‌లోకి అడుగుపెట్టింది. ‘పబ్‌జీ న్యూ స్టేట్’ పేరుతో అందుబాటులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా గురువారం విడుదలైన ఈ గేమ్‌ను 17 భాషల్లో డిజైన్ చేశారు. గూగుల్ ప్లేస్టోర్‌లో దీని సైజ్ […]
హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘోర వైఫల్యంపై హైకమాండ్ సీరియస్‌గా ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. ఈనెల 13న ఢిల్లీ రావాలని పీసీసీ అధ్యక్షుడు సహా సుమారు 13 మంది నేతలను హైకమాండ్ ఆదేశించింది. హుజూరాబాద్ ఓటమిపై ఏఐసీసీ స్థాయిలో సమీక్షించనున్నట్లు సమాచారం. ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్‌కు కేవలం మూడు వేల ఓట్లే రావడంపై హైకమాండ్ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ ఓట్ల శాతం […]
కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమారుడు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ యాదవ్ కుమారుడు వైభవ్ యాదవ్ (17) గురువారం సాయంత్రం సూసైడ్ నోట్ రాసి ఈ ఘటనకు పాల్పడ్డాడు. జబల్‌పూర్‌లోని గోరఖ్‌పూర్ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే నివాసంలో బాత్‌రూంలో తలపై తుపాకీతో కాల్చుకుని వైభవ్ చనిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సూసైడ్ నోట్‌లో తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని వైభవ్ […]
టీ20 ప్రపంచకప్ తుది అంకానికి చేరింది. సెమీఫైనల్ మ్యాచ్‌లు ముగిశాయి. తొలి సెమీస్‌లో ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్, రెండో సెమీస్‌లో పాకిస్థాన్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించడంతో ఈనెల 14న జరిగే ఫైనల్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లు టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. దీంతో ఈసారి కొత్త ఛాంపియన్ అవతరించడం షురూ అయ్యింది. గురువారం రాత్రి జరిగిన రెండో సెమీస్‌లో పాకిస్థాన్‌ను 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా మట్టికరిపించింది. తొలుత […]