సూర్య హీరోగా నటించిన ‘జైభీమ్’ నేరుగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలై మంచి సినిమాగా టాక్ తెచ్చుకుంది. విమర్శకుల ప్రశంసలను కూడా పొందుతోంది. 28 ఏళ్ల క్రితం జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా సూర్య ఈ సినిమాను నిర్మించాడు. తాజాగా ప్రముఖ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ‘జైభీమ్’ సినిమాను వీక్షించాడు. దర్శకుడు జ్ఞానవేల్ ఈ సినిమాను బాగా తెరకెక్కించాడని లారెన్స్ కొనియాడాడు. Read Also: డిస్నీ హాట్ స్టార్ చేతికి “అఖండ” రైట్స్ ఓ దొంగతనం […]
పిచ్చి పలు రకాలు అని పెద్దలు అంటుంటారు. కొందరు వ్యక్తులు కూడా పిచ్చిగా ఏదేదో చేసేస్తుంటారు. హైదరాబాద్ నగరంలోని ఓ వ్యక్తి కూడా ఇలాగే పిచ్చి పని చేసి ఇప్పుడు కటకటాలు లెక్కపెడుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. జవహర్‌నగర్ పీఎస్ పరిధిలోని యాప్రాల్‌కు చెందిన వెంకటనరసింహశాస్త్రి (53) బేకరీ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే తనకు రోజూ నిద్ర పట్టడం లేదని.. ఎన్ని మందులు వాడినా ఫలితం దక్కలేదని.. ఎవరో చెబితే గంజాయి తాగాడు. ఆరోజు నిద్ర మంచిగా […]
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల పరిధిలో కరోనా కారణంగా నిలిచిపోయిన 12 ప్యాసింజర్ రైళ్ల సేవలను పునరుద్ధరిస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే వెల్లడించింది. అయితే ఇకపై ఇవి అన్‌రిజర్వుడు ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా నడుస్తాయని రైల్వేశాఖ తెలిపింది. ఫలితంగా ఆయా రైళ్లలో టిక్కెట్ ఛార్జీలు పెరగడంతో పాటు అవి ఆగే స్టేషన్ల సంఖ్య కూడా పరిమితం కానుంది. ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మారిన ప్యాసింజర్ రైళ్లు:✤ కాచిగూడ-మిర్యాలగూడ-కాచిగూడ (07276/07974). ఈ నెల 11 నుంచి అందుబాటులోకి వస్తుంది.✤ మిర్యాలగూడ-నడికుడి-మిర్యాలగూడ (07277/07273). ఈ రైలు […]
కడప జిల్లా జమ్మలమడుగు మండలం మోరగుడి గ్రామంలో మద్యం తాగడంపై నిషేధం విధించారు. ఈ మేరకు గ్రామ కమిటీ పేరుతో గ్రామంలో హెచ్చరిక బోర్డులు వెలిశాయి. కొందరు వ్యక్తులు మద్యం తాగిన మత్తులో సీసాలు పగలకొట్టడం, మద్యం బాటిళ్లను పొలాల్లో, రోడ్లపైనే పడేస్తుండటంతో విసుగు చెందిన గ్రామ పెద్దలు మద్య నిషేధంపై నిర్ణయం తీసుకున్నారు. Read Also: వైరల్: బుడ్డోడి టాలెంట్‌కు ఆనంద్ మహీంద్రా ఫిదా తమ గ్రామ పరిధిలో పొలాలు, ఖాళీ స్థలాలు, బహిరంగ ప్రదేశాల్లో […]
మధ్యప్రదేశ్ భోపాల్‌లోని ఓ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కమలా నెహ్రూ ఆస్పత్రిలోని మూడో అంతస్తులో మంటలు చెలరేగడంతో నలుగురు చిన్నారులు మరణించారు. ప్రమాదం జరిగిన పిల్లల వార్డులో మొత్తం 40 మంది చిన్నారులు ఉండగా.. మిగతా 36 మంది క్షేమంగా ఉన్నారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న 12 ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. మంటలు చెలరేగిన విషయాన్ని తెలుసుకున్న పిల్లల బంధువులు వార్డులోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఆస్పత్రి పరిసరాల్లో […]
టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా విజయంతో ముగించింది. తొలి రెండు మ్యాచ్‌లలో ఓడిపోయిన భారత్.. హ్యాట్రిక్ విజయాలతో టోర్నీకి వీడ్కోలు పలికింది. సారథిగా విరాట్ కోహ్లీకి ప్రపంచకప్ అందించలేకపోయిన ఆటగాళ్లు.. కెప్టెన్‌గా అతడి ఆఖరి మ్యాచ్‌లో మాత్రం గెలిచి విజయాన్ని కానుకగా అందించారు. నమీబియాతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. Read Also: హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అదిరే రికార్డు ఈ మ్యాచ్‌లో కోహ్లీ సేన టాస్ గెలిచి […]
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శలు చేశారు. పదిసార్లు మెడలు నరుక్కుంటానని మాట తప్పిన కేసీఆర్.. బండి సంజయ్ మెడలు విరుస్తారా? అంటూ ఎద్దేవా చేశారు. దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో బీజేపీ మళ్లీ మళ్లీ గెలుస్తూ వస్తోందని.. తెలంగాణలో ఎందుకు అధికారంలోకి రాదని కేసీఆర్‌ను ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్‌పై అన్ని రాష్ట్రాలు వ్యాట్ తగ్గిస్తుంటే తెలంగాణలో ఎందుకు తగ్గించరని విజయశాంతి నిలదీశారు. హుజురాబాద్‌లో ఓటమి చెందడంతో కేసీఆర్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని ఆమె ఆరోపించారు. Read […]
బిగ్‌బాస్-5 పదో వారంలోకి అడుగుపెట్టింది. 9వ వారంలో హౌస్ నుంచి ఎలిమినేట్ కాగా.. పదో వారం కోసం సోమవారం రాత్రికి నామినేషన్‌ల ప్రక్రియ జరగనుంది. పదో వారంలో ఐదుగురు నామినేషన్‌లలో ఉండనున్నారు. వీరిలో రవి, కాజల్, సిరి, సన్నీ, మానస్ ఉన్నారు. ఈ వారం నామినేషన్‌ల ప్రక్రియ భిన్నంగా సాగనుంది. ఇందులో భాగంగా కెప్టెన్ యానీ నలుగురిని సెలక్ట్ చేసి జైల్లో ఉంచి తాళం వేస్తుంది. ఈ జాబితాలో సన్నీ, మానస్, కాజల్, షణ్ముఖ్ ఉన్నారు. Read […]
ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు అన్ని పెట్రోల్ బంకుల వద్ద టీడీపీ శ్రేణులు నిరసనలు చేపట్టాలని సూచించారు. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గిస్తానని ప్రజలకు జగన్ హామీ ఇచ్చారని.. ఇచ్చిన హామీ ప్రకారం పెట్రోల్‌పై రూ.16, డీజిల్‌పై రూ.17 తగ్గించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రాల్లో పెట్రోల్, […]
తన ఫాం హౌస్‌పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ఆరోపణలపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. పదే పదే తన ఫాం హౌజ్‌ను దున్నుతా అంటున్నావ్.. నువ్వేమైనా ట్రాక్టర్ డ్రైవర్‌వా? అని బండి సంజయ్‌ను ప్రశ్నించారు. చట్టం ప్రకారం కొన్న తన ఫాం హౌజ్ ముందు అడుగు పెడితే ఆరు ముక్కలవుతావని హెచ్చరించారు. అయినా తనది ఫాం హౌస్ కాదని.. ఫార్మర్ హౌస్ అని కేసీఆర్ పేర్కొన్నారు. తాను వ్యవసాయం చేసే కుటుంబంలో […]