Kirin 9030 Pro చిప్‌తో కొత్త ఫోల్డబుల్ ఫ్లాగ్‌షిప్ Huawei Mate X7 గ్లోబల్ లాంచ్:.. ధర, ఫీచర్స్ ఇవే..!
- Huawei Mate X7 గ్లోబల్‌గా లాంచ్
- Kirin 9030 Pro అనే శక్తివంతమైన చిప్‌సెట్
- 8 అంగుళాల ఇన్‌సైడ్ LTPO OLED, 6.49 అంగుళాల అవుటర్ కర్వ్డ్ LTPO OLED డిస్‌ప్లేలు.
- 16GB RAM + 512GB స్టోరేజ్ ఒకే మోడల్ గ్లోబల్‌గా అందుబాటులో
- వెనుక 50MP RYYB ప్రైమరీతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్.
- IP58 + IP59 రేటింగ్‌తో మెరుగైన నీరు, దుమ్ము నిరోధకత.
- 5300mAh బ్యాటరీ, 66W వైర్డ్ మరియు 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Huawei Mate X7: హువావే (Huawei) సంస్థ కొత్తగా పుస్తకం శైలిలో ఉన్న ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ Huawei Mate X7 ను చైనా తర్వాత ఇప్పుడు గ్లోబల్ మార్కెట్‌లో కూడా అధికారికంగా విడుదల చేసింది. ఈ మొబైల్ లో అత్యాధునిక Kirin 9030 Pro చిప్‌సెట్, మెరుగైన కెమెరాలు, మంచి OLED డిస్‌ప్లేలు వంటి ఫీచర్లతో ఈ ఫోన్ ప్రీమియం యూజర్స్ ను టార్గెట్ చేస్తుంది.
Nitish Kumar Reddy: నితీశ్ కుమార్ రెడ్డి హ్యాట్రిక్.. అయినా ఆంధ్రకు నిరాశే!
Also Read
- Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. రూ.15 వేల లోపు లభించే కొత్త ఫోన్ల జాబితా వెల్లడి..
- HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..
- Lava Smart Phone: 6000mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. లావా నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లాంచ్..
- OPPO Reno 16T లాంచ్.. 200MP కెమెరా, 6700mAh బ్యాటరీ, ధర ఎంతంటే..?
ఈ కొత్త Mate X7లో రెండు OLED స్క్రీన్లు ఉన్నాయి. లోపల 8 అంగుళాల (2210 x 2416 పిక్సెల్స్) ఫ్లెక్సిబుల్ LTPO OLED డిస్‌ప్లే ఉండగా.. బయట 6.49 అంగుళాల (1080 x 2444 పిక్సెల్స్) 3D క్వాడ్-కర్వ్డ్ LTPO OLED డిస్‌ప్లే ఉంది. ఈ రెండు స్క్రీన్లూ 1Hz నుండి 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తాయి. టచ్ శాంప్లింగ్ రేట్ 240Hz (ఇన్‌సైడ్), 300Hz (అవుట్‌సైడ్) గా ఉన్నాయి. బయటి స్క్రీన్‌పై రెండో తరం Kunlun గ్లాస్ రక్షణను అందించారు.
ఈ ఫోల్డబుల్ ఫోన్‌లో Kirin 9030 Pro చిప్‌సెట్‌ను జతపరిచారు. దీనికి 16GB ర్యామ్, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. అలాగే ఇది HarmonyOS 6.0 ఆధారంగా పనిచేస్తుంది. కెమెరా సెటప్ విషయానికి వస్తే.. వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP RYYB ప్రైమరీ కెమెరా (f/1.4–f/4.0 వేరియబుల్ అపెర్చర్, OIS), 40MP అల్ట్రా వైడ్ RYYB కెమెరా (f/2.2), 50MP టెలిఫోటో RYYB కెమెరా (OIS) లు ఉన్నాయి. ఇక రెండవ తరం Red Maple సెన్సర్‌ను కూడా కలిగి ఉంది. లోపల, బయటి స్క్రీన్లలో 8MP సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి.
Union Cabinet: మారనున్న ఉపాధి హామీ పథకం పేరు.. కొత్త నేమ్ ఇదే!
ఈ ఫోల్డబుల్ మోడల్‌కు IP58 + IP59 రేటింగ్ ఉంది. ఇది నీరు, దుమ్ము నిరోధకతలో మంచి స్థాయి రక్షణను అందిస్తుంది. ఇక కనెక్టివిటీ, సెన్సర్ల విషయంలోకి వస్తే.. Wi-Fi, Bluetooth 6, BeiDou, Galileo, NavIC, GPS మొదలైన నావిగేషన్ సపోర్ట్, NFC, USB Type-C పోర్ట్ ఉంటాయి. ఈ గ్లోబల్ Mate X7 మోడల్‌లో 5300mAh బ్యాటరీను అందించారు. అలాగే దీనికి 66W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. చైనా Collector’s Editionలో 5600mAh ఎక్కువ సామర్థ్యం ఉన్న బ్యాటరీను అందించారు.
Huawei Mate X7 యూరప్‌లో ఒకే ఒక్క 16GB RAM + 512GB స్టోరేజ్ వెర్షన్‌కు EUR 2,099 (రూ. 2,20,000) ధరతో లభిస్తుంది. ఇది బ్లాక్, బ్రోకేడ్ వైట్, నెబుల రెడ్ రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. చైనాలో ఈ మోడల్‌ను నవంబర్‌లో విడుదల చేసారు. అక్కడ ధర CNY 12,999 (రూ. 1,63,500) నుండి ప్రారంభమైంది.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!