ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్‌కు చేరుకున్నారు. గోట్ ఇండియా టూర్‌లో భాగంగా మెస్సీతో పాటు ఫుట్‌బాలర్లు రోడ్రిగో డి పాల్, లూయిస్ సువారెజ్ కూడా నగరానికి వచ్చారు. ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లనున్న మెస్సీ బృందం, సాయంత్రం 7 గంటల వరకు అక్కడే ఉండనుంది. ఈ నేపథ్యంలో ఫలక్‌నుమా ప్యాలెస్ పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఎయిర్‌పోర్ట్ నుంచి ప్యాలెస్ వరకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. ప్యాలెస్‌లో సుమారు 250 మంది మెస్సీని కలవనున్నారని, వారికి ముందుగానే క్యూఆర్ కోడ్ ఆధారిత పాస్‌లు జారీ చేసినట్లు వెల్లడించారు.
Venky Kudumula: నిర్మాతగా మరో దర్శకుడు
ఇదే సందర్భంగా కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఫలక్‌నుమా ప్యాలెస్‌లో మెస్సీని కలవనున్నట్లు సీపీ తెలిపారు. మెస్సీ సుమారు రెండు గంటల పాటు ప్యాలెస్‌లో గడపనున్నారని చెప్పారు. గతంలో బెంగాల్‌లో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకొని భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు పేర్కొన్నారు. పాస్‌లు పొందిన వ్యక్తుల పూర్తి వివరాలు పోలీసుల వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం ఎలాంటి అంతరాయం లేకుండా సజావుగా సాగేందుకు హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్‌లు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. ఈవెంట్ విజయవంతం కావడానికి సిటీ పోలీసులకు, ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని సీపీ సజ్జనార్ కోరారు.
Lionel Messi: మెస్సీ ఈవెంట్ మేనేజర్ అరెస్ట్.. ఎవరీ సతద్రు దత్తా