సికింద్రాబాద్-విశాఖ మధ్య ప్రత్యేకరైళ్లను ఏర్పాటు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే వెల్లడించింది. ఈ నెల 17, 24 తేదీల్లో స్పెషల్ రైళ్లు తిరగనున్నాయి. ఆయా తేదీల్లో రాత్రి 9:05 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరనున్న రైలు.. తర్వాతి రోజు ఉదయం 9:50 గంటలకు విశాఖ చేరుతుంది. అలాగే విశాఖలో ఈ నెల 16, 23 తేదీల్లో సాయంత్రం 5:35 గంటలకు బయల్దేరనున్న రైలు.. తర్వాతి రోజు ఉదయం 7:10 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. స్పెషల్ రైళ్లకు దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ నల్గొండ స్టేషన్‌లలో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు.
Read Also: ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోళ్లు.. గైడ్ లైన్స్ విడుదల