బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. తాజాగా దిశా షేర్ చేసిన ఓ పిక్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. దిశా తన ఇన్స్టాగ్రామ్ లో బ్లాక్ లేస్ బాడీసూట్ ధరించి, నేచురల్ మేకప్ లుక్ తో, హెయిర్ లీవ్ చేసి, ఎడమ చేతిలో సన్నని బ్లాక్ బ్యాండ్ ధరించిన పిక్ ను పోస్ట్ చేశారు. ఆమె ఈ పిక్ ను పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే […]
ప్రముఖ నటుడు కమల్ హాసన్ కుమార్తె, పాపులర్ సౌత్ హీరోయిన్ శృతి హాసన్ సినీ ఇండస్ట్రీలో నటిగా, గాయనిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. తాజాగా ఈ బ్యూటీ టాలీవుడ్ స్టార్స్ ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబులపై చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. తాజాగా శృతి ట్విట్టర్‌లో #AskMeAnything సెషన్‌లో పాల్గొని, ఆమె అభిమానులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చారు. శృతి చాలా కాలం తరువాత సోషల్ మీడియాలో ఇంటరాక్టివ్ సెషన్‌లో పాల్గొనడంతో నెటిజన్లు […]
ప్రిన్స్ మహేశ్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో మూడో చిత్రానికి లైన్ క్లియర్ అయ్యింది. అన్ని అనుకున్నట్టు జరిగితే… అతి తర్వలో ఈ మూవీ అధికారిక ప్రకటన వస్తుందట. ‘అతడు, ఖలేజా’ సినిమాల చేదు అనుభవాన్ని మరిపిస్తూ… వీరి సరికొత్త చిత్రం ఉండాలని అభిమానులంతా ఆశపడుతున్నారు. ‘అల వైకుంఠపురములో’ సినిమా తర్వాత ఎన్టీయార్ తో త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నాడంటూ ఆ మధ్య అధికారిక ప్రకటన వచ్చింది. ‘ట్రిపుల్ ఆర్’ తర్వాత పట్టాలెక్కే ఎన్టీయార్ సినిమా ఇదే […]
సినిమాలను అంగీకరించే విషయంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంత కన్ ఫ్యూజన్ కు ఎవరూ గురికారేమో! ఏ దర్శకుడితో సినిమా చేయాలనే విషయంలో బన్నీ చాలా వేవరింగ్ కు గురౌతుంటాడు. అందువల్లే ‘ఐకాన్’ ప్రాజెక్ట్ మీదా నీలినీడలు కమ్ముకున్నాయంటారు!! ప్రముఖ నిర్మాత దిల్ రాజు – స్టార్ హీరో అల్లు అర్జున్ మధ్య ఉన్న అనుబంధం చాలా గాఢమైంది! దిల్ రాజు బ్యానర్ లో బన్నీ ‘ఆర్య, పరుగు, ఎవడు, దువ్వాడ జగన్నాథమ్’ సినిమాలను చేశాడు. […]
పవన్ కళ్యాణ్ కేవలం పవర్ స్టార్ కాదు… జనసేనాని కూడా… అందువల్ల ఆచితూచి అడుగేస్తూ సమాజానికి ఉపయోగపడే కథలనే ఎంచుకుంటున్నారు… క్రిష్ డైరెక్షన్ లో పవన్ నటించే సినిమాలోనూ జనానికి మేలు చేసే పాత్రలోనే జనసేనాని కనిపించనున్నాడట… పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఫస్ట్ పీరియడ్ మూవీ ‘హరి హర వీరమల్లు’… పీరియడ్ మూవీస్ అంటే డైరెక్టర్ క్రిష్ కు ప్రాణం… ఇప్పటికే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి పీరియడ్ మూవీతో బిగ్ హిట్ సాధించాడు క్రిష్… ఇప్పుడు […]
శర్వానంద్… వైవిధ్యమైన పాత్రలతో స్టార్ డమ్ చేరుకున్న టాలీవుడ్ హీరో. ‘ప్రస్థానం’ మొదలు నిన్న మొన్నటి ‘శ్రీకారం’ వరరకూ శర్వానంద్ చేసిన సినిమాలు చూసిన వారికి తన రూటే సెపరేట్ అన్నది ఇట్టే అర్థం అవుతుంది. సినిమాల జయాపజయాలకు అతీతంగా ఏ సినిమాకు ఆ సినిమా భిన్నంగా ఉండేలా చూసుకుంటూ జర్నీ కొనసాగిస్తున్నాడు శర్వానంద్. ఇతగాడు మరోసారి ఖాకీ వేయబోతున్నాడట. గతంలో ‘రాధ’ సినిమాలో పోలీస్ పాత్ర పోషించి అలరించాడు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద […]
తన కెరీర్ లో ఒకే ఒక సారి ద్విపాత్రాభినయం చేశాడు యాక్షన్ హీరో గోపీచంద్. ‘గౌతమ్ నందా’ పేరుతో రూపొందిన ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఇప్పుడు మరోసారి గోపీచంద్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడట. ఆ సినిమాయే తేజ దర్శకత్వంలో రూపొందనున్న ‘అలిమేలుమంగ వేంకటరమణ’. ఈ సినిమాలో గోపీచంద్ డబుల్ రోల్ లో కనిపిస్తాడట. ట్విన్స్ గా పుట్టిన ఇద్దరు అనుకోకుండా విడిపోయి ముప్పై ఏళ్ల తరువాత శత్రువులుగా కలిస్తే ఎలా ఉంటుందనే పాయింట్ తో ఈ సినిమా […]
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కరోనా నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని అలియా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. నీలిరంగు డెనిమ్ చొక్కా, పింక్ ప్యాంటు ధరించిన బ్యూటిఫుల్ పిక్ ను షేర్ చేస్తూ తనకు కరోనా నెగెటివ్ వచ్చిందని తెలిపింది అలియా. గత కొన్ని రోజుల క్రితం అలియా భట్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో “నాకు కోవిడ్ -19 నెగెటివ్ గా నిర్ధారణ అయ్యింది. […]
మలయాళ సూపర్ స్టార్, కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆరాట్టు’. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. కేవలం 53 సెకన్ల నిడివి ఉన్న వోల్టేజ్ మాస్ కంటెంట్ టీజర్ తో హీరోను పరిచయం చేశారు. అయితే ఈ టీజర్లో ఒకే ఒక్క డైలాగ్ ఉండగా… అది కూడా తెలుగు డైలాగ్ కావడం విశేషం. టీజర్లో ‘నేను వాడిని చంపేస్తాను’ అంటూ విలన్ ను హెచ్చరించారు మోహన్ […]
ఉగాది రోజున నరేశ్, అలీ నటిస్తున్న ‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’ సినిమాకు శుభాశీస్సులు అందచేశారు సూపర్ స్టార్ కృష్ణ. మలయాళ హిట్ ‘వికృతి’కి రీమేక్‌గా వస్తోంది ఈ చిత్రం. సోషల్ మీడియాలో అత్యుత్సాహం ప్రదర్శించే వారి వల్ల అమాయకులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారనే కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. అలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై అలీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీపురం కిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు ఈ చిత్రం షూటింగ్ పూర్తియింది. ఉగాది రోజున ‘అందరూ […]