Mamata Banerjee Apology: కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఏర్పడిన గందరగోళం ఏర్పడింది. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఈ సందర్భంగా అభిమానులకు ఆమె బహిరంగంగా క్షమాపణ చెప్పారు. లియోనల్ మెస్సీ పర్యటనలో నిర్వహణ లోపాలు ఉన్నాయని స్వయంగా ఒప్పుకుంది. ఫ్యాన్స్ నిరాశకు బెంగాల్ సర్కార్ బాధ్యత తీసుకుంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. జరిగిన అసౌకర్యానికి అభిమానులు తనను క్షమించాలని కోరింది. అంతేకాదు, ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది.
Read Also: Krithi Shetty: కృతి శెట్టి కెరీర్‌కు.. దెబ్బ మీద దెబ్బ
అయితే, లియోనల్ మెస్సీ పర్యటన సమయంలో ఎక్కడ లోపాలు జరిగాయో గుర్తించి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాల్లో ఇబ్బందులు తలెత్తకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరోవైపు, మెస్సీ పర్యటన సందర్భంగా ఏర్పడిన గందరగోళంపై పశ్చిమ బెంగాల్ గవర్నర్ CV ఆనంద బోస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెస్సీ టూర్ నిర్వహణలో లోపాలు తలెత్తిన నేపథ్యంలో బెంగాల్ ప్రభుత్వాన్ని గవర్నర్ వివరణాత్మక నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
Read Also: Off The Record: కేటీఆర్ మీద డైరెక్ట్ గా కవిత అటాక్..! కవిత మాటలతో బీఆర్ఎస్ డిఫెన్స్‌లో పడిందా..?
ఇక, సాల్ట్‌లేక్ స్టేడియంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. లియోనల్ మెస్సీ.. ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంపై అభిమానులు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్టేడియంలోని సీట్లు ధ్వంసం చేసి.. గ్రౌండ్‌లోకి కుర్చీలు, వాటర్ బాటిళ్లను ఫ్యాన్స్ విసిరేశారు. అలాగే, బారికేడ్లు దాటుకొని మైదానంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. అభిమానులు గొడవ చేయడంతో సొరంగం ద్వారా మెస్సీ టీమ్ బయటకు వెళ్లిపోయింది. ఇక, స్టేడియంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులను పోలీసులు అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.