ప్రముఖ నటుడు కమల్ హాసన్ కుమార్తె, పాపులర్ సౌత్ హీరోయిన్ శృతి హాసన్ సినీ ఇండస్ట్రీలో నటిగా, గాయనిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. తాజాగా ఈ బ్యూటీ టాలీవుడ్ స్టార్స్ ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబులపై చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. తాజాగా శృతి ట్విట్టర్‌లో #AskMeAnything సెషన్‌లో పాల్గొని, ఆమె అభిమానులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చారు. శృతి చాలా కాలం తరువాత సోషల్ మీడియాలో ఇంటరాక్టివ్ సెషన్‌లో పాల్గొనడంతో నెటిజన్లు ఉత్సాహంగా ప్రశ్నలు సంధించారు. నెటిజన్లు ఈ భామను తమ అభిమాన హీరోల గురించి, వారితో పని చేసిన అనుభవం గురించి అడిగారు. ఓ అభిమాని ‘ప్రభాస్ గురించి వన్ వర్డ్’ అని అడగ్గా… “అతను సూపర్ చిల్… ప్రభాస్ తో పని చేయడం బాగుంది” అని చెప్పింది శృతి. మరో నెటిజన్ ‘పవన్ కళ్యాణ్ తో మూడవసారి కలిసి పని చేయడం ఎలా అన్పించింది ?’ అని అడిగాడు. దానికి సమాధానంగా శృతి ‘వండర్ ఫుల్… పవన్ కళ్యాణ్ తో కలిసి మూడవ సారి పని చేయడం బాగుంది’ అని, రామ్ చరణ్ స్వీటెస్ట్ అని, మహేష్ బాబు జెంటిల్ మెన్ అని, ‘మహానటి’లో కీర్తి సురేష్ నటన నచ్చిందని చెప్పుకొచ్చింది. ఇక ఇంకో నెటిజన్ ‘మీ అభిమాన సింగర్ జస్టిన్ బీబర్ గురించి వన్ వర్డ్ అని అడగ్గా ‘అతను నా ఫేవరెట్ కాదు’ అని సమాధానం ఇచ్చింది. ఇక కరోనా వలన వచ్చిన చాలా లాంగ్ గ్యాప్ తరువాత టాలీవుడ్ లో క్రాక్, వకీల్ సాబ్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు ? అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. ‘ఈ ప్రాజెక్టులలో భాగం కావడం నాకు చాలా ఆనందంగా ఉంది’ అని రిప్లై ఇచ్చింది శృతి. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పాన్ ఇండియా యాక్షన్ మూవీ ‘సలార్’ లో ప్రభాస్ సరసన నటిస్తోంది శృతి హాసన్.